
పెన్‌పహాడ్: డెంగ్యూ, కరోనా, చికెన్‌గున్యా తదితర వ్యాధులు, అంటు రోగాలు వ్యాప్తి జరగకుండా ముందస్తుగా వైద్య ఆరో గ్య శాఖ సిబ్బంది గ్రామాలలోని ప్రజలకు మరింత అవగహన కల్పించాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ కోటాచ లం అన్నారు. బుధవారం మండల కేంద్రములోని ప్రాథమిక ఆరోగ్య కేం ద్రాన్ని అకస్మికంగా తణిఖీ చేసి అనంతరం సిబ్బం దితో ఏర్పాటు చేసిన సమీక్షలో పాల్గొన్నారు.
దవాఖాన పరిసరాలను పరిశీలించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోకపోతే ప్రజలకు ఆరోగ్య సూత్రాల గురించి ఏ విధం గా సూచిస్తారని సిబ్బందిపై మండిపడ్డారు. దవాఖాన సమస్యలను పరిస్కరించుకోవాలని డీఎంహెచ్‌వో సూచించారు. అలాగే కోవిడ్ టెస్టులు, టీకాలకు సంబందించిన రిజిష్టర్‌ను పరిశీలించారు. వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ గ్రామ పంచాయతీ సహాకారంతో పైపులైన్ లీకేజీ, పారిశుధ్యం సమస్యలు మెరుగుపడేలా కృషి చేయాలని సూచించారు.
అనాజీపురంలో ఓ మహిళకు డెంగ్యూ వ్యాధి బారిన పడిందని వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ దవాఖానకు వచ్చే రోగులకు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. అనాజీపురంలో అవసరమైతే క్యాంపు నిర్వహించి ప్రజలకు ప్రభుత్వ వైద్య సేవలపై భరోసా కల్పించాలన్నారు.
పీహెచ్సీలో అందిస్తున్న అన్ని రకాల సేవల పనితీరుపై రోగులతో ముఖాముఖీ మాట్లాడారు. ఏఏ సేవలు అందించాలనే విషయాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కరోనా నియంత్రనలో భౌతికదూరంతో పాటు శానిటైజర్ వాడడం, చేతు లు శుభ్రపరచడం తప్పనిసరి అందుకు ప్రజలకు మరింత అవగహన కల్పిస్తూ సిబ్బంది కూడా విధిగా పాటించాలన్నారు. వచ్చే నెలలో పాఠశాలలు పునఃప్రారంభం అవుతున్నందున సిబ్బంది పర్యవేక్షణలో ఉంటూ విద్యార్థులకు మరింత సేవలు అందించాలన్నారు.
పీహెచ్సీ సిబ్బంది పనితీరును మరింత మొరుగు పరుచుకోవాలని సూచించారు. దవాఖాన పరిసరాలు పరిశుభ్రంగా ఉండేవిధంగా అలాగే ప్రతిరోజు దవాఖాన గదులు హైడ్రోక్లోరైడ్‌తో పిచికారీ చేయాలన్నారు. కార్యక్రమములో ఆర్బీఎస్కె జిల్లా కోఆర్డీనేటర్ డాక్టర్ వినయానంద్, క్వాలిటీ మేనేజర్ అరుణ, డిప్యూటీ ఉప మీడియా అధికారి అంజయ్య, స్థానిక వైద్యాధికారి డాక్టర్ క్రాంతికుమార్, సిబ్బంది పాల్గొన్నారు.