మంగళవారం 26 జనవరి 2021
Suryapet - Nov 28, 2020 , 02:41:00

120 మంది నిరుద్యోగులకు సూర్యాపేటలో శిక్షణ

120 మంది నిరుద్యోగులకు సూర్యాపేటలో శిక్షణ

సొంత ఖర్చుతో భోజనం అందిస్తున్న మంత్రి జగదీశ్‌రెడ్డి

హర్షం వ్యక్తం చేస్తున్న నిరుద్యోగులు

సూర్యాపేట టౌన్‌ : ఇంటర్‌ చదువుతున్న విద్యార్థులతోపాటు నిరుద్యోగులకు ఉచిత పోలీసు శిక్షణ కేంద్రాలను జిల్లా కేంద్రాల్లో రాష్ట్ర  ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా నైపుణ్యతను బట్టి 120 మంది విద్యార్థులు, నిరుద్యోగులను ఎంపిక చేసి సూర్యాపేటలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో  శిక్షణ ఇస్తున్నారు.  రోజులపాటు కొనసాగే శిక్షణను మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఇటీవల ప్రారంభించి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన విద్యార్థులు, నిరుద్యోగుల వివరాలను  తెలుసుకున్నారు. దూర ప్రాంతాల నుంచి వస్తున్న వారి ఇబ్బందులను గమనించారు.  ఆకలిని  నిర్ణయించి  వేదికపై హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం శిక్షణ పొందుతున్న 120 మందికి ఉదయం టిఫిన్‌, పాలు, మధ్యాహ్నం భోజనం అందిస్తున్నారు. దీంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  సమయంలో ఆకలితో బాధ పడుతున్న తమకు టిఫిన్‌, పాలు, భోజనం అందిస్తున్న  జగదీశ్‌రెడ్డి సహకారం మరువలేనిదని పేర్కొన్నారు.

మంత్రి స్ఫూర్తితో ఉద్యోగం సాధించి సమాజ సేవ చేస్తా 


ఏదైనా ప్రారంభించడానికి మందీమార్బలంతో వచ్చే నాయకులనే ఇప్పటి వరకూ చూశా.  సమస్యలపై అడిగిన వారిని ఎవరినీ చూడలేదు. మా శిక్షణ కేంద్రం సందర్శనకు వచ్చిన మంత్రి జగదీశ్‌రెడ్డి మా సమస్యను గుర్తించి  సమస్యను వెంటనే తీర్చిన విధానం ఆశ్యర్యానికి గురిచేసింది. మాకు అందిస్తున్న ఆహారంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉండి శిక్షణ పొందుతున్నాం. నాయకుడంటే   నాకు ఆయనే స్ఫూర్తి. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని పోలీస్‌ ఉద్యోగం సాధించి సమాజ సేవ చేస్తా.

- రాజశేఖర్‌, కాసరబాద, సూర్యాపేట

 సివిల్‌ కానిస్టేబుల్‌ అవుతా..

నాకు హైదరాబాద్‌ పోయి కోచింగ్‌ తీసుకునే ఆర్థిక స్థోమత లేదు. ప్రభుత్వం ఇస్తున్న ఉచిత శిక్షణ మాలాంటి వాళ్లకు ఎంతగానో ఉపయోగపడుతుంది. శిక్షణ కేంద్రం ప్రారంభం రోజున దూర ప్రాంతాల నుంచి వచ్చేవారి  తెలుసుకుని టిఫిన్‌, పాలు, భోజనం అందిస్తున్న మంత్రి జగదీశ్‌రెడ్డికి రుణపడి ఉంటాం. శిక్షణ మొదటి రెండ్రోజులు ఉదయం ఫిట్‌నెస్‌ శిక్షణ అనంతరం ఆకలితో తిరిగి ఇంటికి వెళ్లి మళ్లీ రావడానికి తీవ్ర ఇబ్బంది పడ్డాం. మా బాధలు ముందుగానే గమనించి అడగకుండానే మా ఆకలిని తీరుస్తున్న మంత్రిగారికి కృతజ్ఞతలు.

-  భగత్‌సింగ్‌నగర్‌, సూర్యాపేట


logo