శనివారం 23 జనవరి 2021
Suryapet - Nov 24, 2020 , 01:26:32

గ్రానైట్‌ దారుణ హత్య

గ్రానైట్‌  దారుణ హత్య

  • కర్రలతో కొట్టి, బండరాయితో మోది చంపిన దుండగులు 
  • పోలీసుల అదుపులో మహిళ
  • మృతుడిది ఖమ్మం జిల్లా..

కోదాడ రూరల్‌ : అనంతగిరి మండలం  గ్రామ శివారులో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం పట్టణానికి చెందిన గ్రానైట్‌ వ్యాపారి వెన్ని రంగనాథ్‌(43), తనకు బంధువైన రాజేశ్వరితో కలిసి ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో బొలేరో  శాంతినగర్‌ శివారులోకి వచ్చారు. అనంతగిరి రహదారి సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న దేవాలయం ఎదురుగా రోడ్డుపై వాహనం నిలిపి పిచ్చాపాటి మాట్లాడారు. అనంతరం బండపై కూర్చుని మాట్లాడుతుండగా చీకటిలో ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు రంగనాథ్‌పై కర్రలతో దాడి చేశారు.  తలపై మోది వరి పొలంలోకి తోసి పారిపోయారు.   భయంతో పరారైంది. గ్రామానికి చెందిన రైతులు సోమవారం ఉదయం బండపై ఆరబోసిన ధాన్యాన్ని  ఎత్తేందుకు కుప్ప చేస్తుండగా వరి మడిలో వ్యక్తి మృతదేహం కనిపించింది. ధ్‌ంతో వారు స్థానికులకు తెలియజేయగా.. గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. రూరల్‌ సీఐ శివరాంరెడ్డి, కోదాడ రూరల్‌ ఎస్‌ఐ  సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. జిల్లా డాగ్‌స్క్వాడ్‌కు సమాచారం అందించారు. మృతుడి వాహనం నెంబర్‌ అధారంగా వారి బంధువులకు తెలియజేశారు.  జాగిలం హత్య ప్రదేశం నుంచి శాంతినగర్‌ వైపు పరుగులు తీసి అక్కడి నుంచి మొగలాయికోట గ్రామ శివారులోని వాటర్‌ ట్యాంకు వద్ద నిలిచిపోయింది.   రాయిని, కర్రలను, మృతుడి వాచీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని కోదాడ ప్రభుత్వ దవాఖానకు  మృతుడి కుమారుడు బాలాజీ  మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

పోలీసుల అదుపులో మహిళ..

హత్య అనంతరం అర్ధరాత్రి పారిపోయిన రాజేశ్వరి సోమవారం సంఘటనా స్థలానికి వచ్చి పోలీసులకు ఘటన వివరాలు తెలిపింది.  ఆమెను అదుపులోకి తీసుకొని కోదాడ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.


logo