జంతుజాలంతో మాయాజాలం!
సచిటారు కొమ్మను ఊ కొడుతున్న ఉడుతను క్లిక్ మనిపించకుండా ఊరుకోలేం. వెళ్తున్న దారిలో మయూరం వయ్యారంగా కనిపిస్తే.. చిటికెలో ఫొటో తీసేస్తాం! వాటిని చూసుకొని తెగ మురిసిపోతుంటాం.
చిటారు కొమ్మను ఊ కొడుతున్న ఉడుతను క్లిక్ మనిపించకుండా ఊరుకోలేం. వెళ్తున్న దారిలో మయూరం వయ్యారంగా కనిపిస్తే.. చిటికెలో ఫొటో తీసేస్తాం! వాటిని చూసుకొని తెగ మురిసిపోతుంటాం. పల్లె పొలిమేరలో పరుచుకున్న పచ్చదనంలోనే మీ కెమెరా ఇన్ని అందాలు వీక్షిస్తే.. మీరు వనసీమకు విహారానికి వెళ్లినప్పుడు ఇంకెన్ని అద్భుతాలు చేస్తుందో కదా!జూలు విదిలిస్తున్న సింహాలు, తొండాలు ఆడిస్తున్న మత్తేభాలు, ఒంపులు తిరిగిన కొమ్ములతో ప్రత్యేకంగా కనిపించే హరిణాలు.. ఇలా అడవికి సొంతమైన వన్యప్రాణి సొగసులను కట్టిపడేసే వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీ ఓ అద్భుతమైన కళ. అడవి జంతువుల చిత్తరువులు చూసినప్పుడే కాదు.. వాటిని క్లిక్ మనిపించినప్పుడూ అంతులేని ఉత్సాహం కలుగుతుంది. మరచిపోలేని అనుభూతుల్ని మిగుల్చుతుంది.
సఫారీ వేళ.. సరదాగా కెమెరాతో ఫొటోలు తీయడం మామూలే! అయితే జంతువుల సహజ ప్రవర్తనను, వాటి కదలికను, భావోద్వేగాలను బంధించడం గొప్ప కళ. ఇది మీ ఓర్పుతో కూడుకున్న పని. నేర్పుగా చేయాల్సిన హాబీ. ప్రకృతిపై మీకున్న ప్రేమ-జంతు సంరక్షణల కలయిక ఈ వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీ!

డీఎస్ఎల్ఆర్ ఎందుకు?
- జంతువులు వేగంగా కదులుతాయి. వాటిని బంధించాలంటే.. వేగవంతమైన షట్టర్ స్పీడ్ అవసరం. దానిని డీఎస్ఎల్ఆర్ సులభంగా అందిస్తుంది.
- దూరంగా ఉండే జంతువులను, వాటికి ఎలాంటి అసౌకర్యం కలగకుండానే ఫొటోలు తీయాలంటే.. టెలిఫొటో లెన్స్ అవసరం.
- మాన్యువల్ కంట్రోల్ ద్వారా లైట్, ఫోకస్, షాడో, ఎక్స్పోజర్ను మీకు అనుకూలంగా మార్చుకోవచ్చు.
- RAW ఫార్మాట్లో షూట్ చేస్తే.. పోస్ట్ ప్రాసెసింగ్‌లో ఫొటోలో రంగులు, డీటెయిల్స్‌ను మరింత మెరుగుపరచవచ్చు.
అవసరమైన పరికరాలు
కెమెరా:
- కెనాన్ ఈఓఎస్ ఆర్6/ఆర్7/90డి/5డి మార్క్IV, నికాన్ డి7500/జెడ్6 II, సోనీ ఏ7 IV వంటి మాడల్స్ ఉత్తమం.
- కంటిన్యూయస్ షూటింగ్ స్పీడ్ ఎక్కువగా ఉండాలి. 8fps లేదా అంతకంటే ఎక్కువగా ఉంటే మంచిది.
- అడవిలోని వాతావరణాన్ని తట్టుకునే ‘వెదర్ సీలింగ్’ మాడల్స్ ఉపయోగకరంగా ఉంటాయి.
లెన్స్ :
- 300 ఎంఎం-600 ఎంఎం టెలిఫొటో లెన్స్.. జంతువులను దూరం నుంచే షూట్ చేయడానికి ఉపయోగపడుతుంది.
- దగ్గరి నుంచి షూట్ చేయాలంటే.. 70ఎంఎం-200ఎంఎం f/2.8 లెన్స్ సరిపోతుంది.
- 100ఎంఎం మ్యాక్రో లెన్స్‌ను చిన్న జంతువులను, క్లోజ్ అప్ షాట్స్ తీయడానికి వాడుకోవచ్చు.
ఇతర పరికరాలు
- కెమెరా స్టెబిలిటీ కోసం మోనోపాడ్, బీన్ బ్యాగ్.
- జంతువులు మిమ్మల్ని గుర్తించకుండా ఉండటానికి కామోఫ్లాగ్ డ్రెస్.
- రెయిన్, డస్ట్ ప్రొటెక్షన్
- జాతీయ పార్కుల్లో వివిధ ప్రదేశాలను గుర్తించడానికి జీపీఎస్, కంపాస్ అవసరం.
కెమెరా సెట్టింగులు
మోడ్:
- మాన్యువల్ (M) లేదా షట్టర్ ప్రియారిటీ (Tv/ S)లో షూట్ చేయాలి.
- వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీలో షట్టర్ స్పీడ్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ఎందుకంటే.. జంతువులు క్షణాల్లో కదిలిపోతాయి.
షట్టర్ స్పీడ్
- నడుస్తున్న జంతువులను ఫొటో తీయాలంటే.. 1/500 -1/800 sec
- జంతువులు పరుగులు తీస్తున్నా, జంప్ చేస్తున్నా.. షట్టర్ స్పీడ్ 1/1000 -1/2000 secమధ్య ఉండేలా చూసుకోవాలి.
- జంతువులు వేటాడుతున్నప్పటి యాక్షన్ మూమెంట్స్ కోసం.. షట్టర్ స్పీడ్‌ను 1/2500 1/4000 secమధ్యలో ఉంచుకోవాలి.
అపర్చర్
- ఒక్క జంతువును మాత్రమే ఫొటో తీయాలనుకుంటే.. అపర్చర్ f/4 f/5.6 ఉంటే చాలు. అప్పుడు బ్యాక్‌గ్రౌండ్ మొత్తం బ్లర్ అయిపోయి.. సబ్జెక్ట్ స్పష్టంగా కనిపిస్తుంది.
- రెండు, అంతకన్నా ఎక్కువ జంతువుల్ని ఒకే ఫ్రేమ్‌లో బంధించాలంటే.. అపర్చర్ f/8 f/11 ఉంటే సరిపోతుంది.
ఐఎస్ఓ
- గోల్డెన్ అవర్స్ (ఉదయం, సాయంత్రం)లో ఐఎస్వో 1600-3200 మధ్య ఉంచుకోవాలి.
- మేఘాలు లేకుండా, వెలుతురు ఎక్కువగా ఉంటే.. ఐఎస్వో 200-400 ఉంటే చాలు.
- ఆకాశం మేఘావృతమై ఉన్నప్పుడు, చెట్ల నీడలో పడుకున్న జంతువులను ఫొటో తీయాంటే.. ఐఎస్వో 800 -1600 ఉండాలి.

ఆటో ఫోకస్ మోడ్
- కదిలే జంతువుల కోసం కంటిన్యూయస్ ఏఎఫ్
(AI Servo / AF-C). - నిద్రపోతున్న, ఒక్క దగ్గర కూర్చున్న జంతువును ఫొటో తీయాలంటే.. Single Point AF. ఫోకస్‌ను జంతువుల కళ్లపై ఉంచాలి.
- యాక్షన్ ఫొటోలు తీయడానికి Group Area AF లో ఉంచుకోవాలి.
డ్రైవ్ మోడ్
హైస్పీడ్ బరస్ట్: కెమెరాను హైస్పీడ్ బరస్ట్ మోడ్‌లో ఉంచడం ద్వారా ఒక్క సెకన్లో 8 నుంచి 12 ఫ్రేమ్స్ వస్తాయి. వేగంగా కదిలే జంతువులను స్పష్టంగా బంధిస్తాయి.
వైట్ బ్యాలెన్స్
ఆటో/ క్లౌడి: జంతువుల సహజసిద్ధకమైన స్కిన్‌టోన్ కోసం..
కంపోజిషన్ చిట్కాలు
- ఐకాంటాక్ట్: కెమెరా ఫోకస్ ఎప్పుడూ జంతువుల కళ్లలోనే ఉండాలి. అప్పుడే ఫొటోలకు జీవం వస్తుంది.
- రూల్ ఆఫ్ థర్డ్స్ : సబ్జెక్ట్ (జంతువు)ను ఫ్రేమ్ మధ్యలో కాకుండా 1/3 భాగంలో ఉంచండి.
- లో యాంగిల్ షాట్స్: కింది నుంచి తీసే ఫొటోలు.. జంతువుల ఎత్తు, శక్తిని చూపిస్తాయి.
- బ్యాక్‌గ్రౌండ్: జంతువులకు, వాటి వెనకాల ఉండే చెట్లు, పుట్టలకు మధ్య కాంట్రాస్ట్ స్పష్టంగా కనిపించాలి. అందుకోసం బ్యాక్‌గ్రౌండ్‌ను బ్లర్ చేయాలి.
- యాక్షన్ మూమెంట్స్: జంతువుల కదలికలు, నీళ్లు తాగడం, ఆడుకోవడం, వేటాడటం లాంటి సహజ క్షణాలను క్యాప్చర్ చేయండి.
- ఎన్విరాన్మెంట్ కాంటెక్ట్స్ : జంతువులతోపాటు వాటి చుట్టూ ఉండే వాతావరణాన్ని (చెట్లు, గుట్టలు, పుట్టలు) కూడా ఫొటోల్లో చూపించండి.
లైటింగ్ టిప్స్
- ఉదయం (6 9 మధ్యలో): ఈ సమయంలో లైటింగ్ సాఫ్ట్‌గా, వార్మ్‌గా ఉంటుంది. జంతువులు కూడా చాలా యాక్టివ్‌గా ఉంటాయి.
- సాయంత్రం (4- 6 మధ్యలో): బ్యాక్‌లైట్ అద్భుతంగా ఉంటుంది. వెనక నుంచి పడే సూర్యకాంతిలో.. జంతువులు మెరుస్తున్నట్లుగా కనిపిస్తాయి.
ఫీల్డ్ ప్రాక్టీస్ టిప్స్
- వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీకి ముఖ్యంగా కావాల్సింది సహనం. సరైన క్షణం కోసం వేచి ఉండటం అలవాటు చేసుకోండి.
- జంతువుల ప్రవర్తనపై అధ్యయనం చేయండి. అవి ఎప్పుడు తింటాయి, ఏ సమయంలో నీళ్లు తాగుతాయి. ఎలా కదులుతాయి అనేది తెలుసుకోండి. షూటింగ్‌కు వెళ్లినప్పుడు వాటిని నిశితంగా గమనించండి.
- మీ పనిని నిశ్శబ్దంగా పూర్తి చేసుకోండి. కెమెరా క్లిక్ కూడా వినిపించకుండా.. సైలెంట్ షట్టర్ మోడ్‌ను వాడండి.
- జంతువుల సమీపంలోకి అస్సలు వెళ్లకండి.
- కెమెరాను స్థిరంగా ఉంచండి. అందుకోసం ట్రైపాడ్, మోనోపాడ్ లేదా బీన్బ్యాగ్ను వాడండి.
సేఫ్టీ-ఎథికల్ ఫొటోగ్రఫీ
- ప్రకృతి, జంతువుల ప్రైవసీని గౌరవించండి.
- వాటిని ఏ రకంగానూ ఇబ్బంది పెట్టకండి.
- వాటి నివాసాలు, పిల్లలకు దగ్గరగా వెళ్లవద్దు.
- జంతువులకు ఎలాంటి ఆహారం ఇవ్వకండి.
- పార్క్ గైడ్ సూచనలు పాటించండి.
చివరిగా.. వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీ అనేది కేవలం జంతువుల ఫొటోలు తీయడం మాత్రమే కాదు.ప్రకృతిని గమనించడం, గౌరవించడంతోపాటు
ఆ క్షణాన్ని శాశ్వతంగా నిలబెట్టడం కూడా. ఈ ప్రయాణంలో డీఎస్ఎల్ఆర్ మీకు సాంకేతిక శక్తిని అందిస్తుంది. కానీ, మీ మనసు, ఓర్పుతోపాటు ప్రకృతి, జంతువులపై మీకు ఉండే ప్రేమ మాత్రమే..ఆ చిత్రానికి ప్రాణం పోస్తుంది.
-ఆడెపు హరికృష్ణ
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

