– ఎం. సుధామ, బోడుప్పల్
ఒక స్థలంలో కొత్త ఇల్లు కట్టుకోవాలని నిర్ణయించారు అంటే.. మీరు దాదాపు కొత్త నక్ష (ప్లాన్) తయారు చేసుకున్నట్టే కదా! అప్పుడు, పాత ఇంటి పునాదులు కొత్త ఇంటికి ఎలా కలుస్తాయి? ఒకవేళ కొన్ని గోడ వరుసలు కలిసినా సరే.. పాత పునాదుల మీద కొత్త ఇంటి గోడలు కట్టకూడదు. ఇల్లు కూల్చాక, తప్పకుండా పాత పునాదులను పూర్తిగా పెకిలించి తీసేయాలి. అడుగు భాగాన్ని తొలగించి.. స్థలం మొత్తం శుద్ధి చేయాలి. కొత్త ఇంటికి సరిపడా కొలతలతో పునాదులు మళ్లీ కట్టుకోవాలి.
భూమి లోపలినుంచి వచ్చే పునాదుల విషయంలో సర్దుబాటు పనికిరాదు. ఇంటిని పిల్లర్స్ వేసి కట్టినా, పిల్లర్స్ లేకుండా ఇటుకలతో కట్టినా.. పాత పునాదులు పనికిరావు. ఇంటిని తొలగించినప్పుడు వచ్చిన పునాది రాళ్లను కొత్త ఇంటికి వాడటం దోషం కాదు. ఇంటి నిర్మాణ స్థలం పూర్తిగా శుద్ధి అయిపోయి, శక్తి స్థలం కావాలి. అంటే, పాత ఆనవాళ్లు లేకుండా ఉండాలి. లేదంటే.. గిన్నె కడగకుండా పాలు కాచిపెట్టినట్టు అవుతుంది.
– కె. సురేఖ, రాజేంద్రనగర్
ఇంటి స్థలంలో గోతులు – కాలువలు – బావులు ఉన్నప్పుడు, అక్కడ నిర్మాణం జరపడం మానుకోవాలి. అవి ఏండ్లుగా ఉన్నప్పుడు ఆ స్థలం అనేక అవలక్షణాలతో కూడి ఉంటుంది. మీకు బావి ఉన్న స్థలమే ఉంది అనుకుంటే.. అది విశాలమైనది అయితేనే ఇల్లు కట్టడానికి పూనుకోవాలి. అంటే గొయ్యి (బావి) ఉన్న స్థలం వదిలి, మిగతా ప్రదేశంలో ఇల్లు ప్లాన్ చేయాల్సి ఉంటుంది. ఇంటి ఆవరణలో (ఫుట్ ప్రింట్)లో బావి అడుగు రావడం మంచిదికాదు. మట్టితో ఆ బావిని పూడ్చినా.. అది అంత తొందరగా మరణం పొందదు. కొన్నిసార్లు పొంగుతుంది. కొన్ని రుతువుల్లో కుంగుతుంది. కాబట్టి, ఇల్లు కట్టే స్థలంలో బావి వస్తే.. కట్టడం ఆపేయాలి. తూర్పు వైపునకు, ఉత్తరం వైపునకు లేదా మనం ఇంటి చుట్టూ వదిలే ఖాళీ ప్రదేశంలోకి వెళ్లినప్పుడే ఆ చోట, అంటే బావి లేని మిగతా ప్రదేశంలోనే ఇల్లు నిర్మించాలి. ఇల్లు అనేది మన జీవితం కంటే ముఖ్యం కాదు. మన సుఖశాంతులతో సమానం కాదు. వాస్తు ప్రాధాన్యం మరచిపోకూడదు.

– కె. హనుమ, యూసఫ్‌గూడ ఇంటిని పెద్దగా, విశాలమైన మెట్లతో ప్లాన్
చేసినట్టయితే.. డబుల్ హైట్ (సీత్రూ) ఉంటేనే చాలా గొప్పగా కనిపిస్తుంది. ఇల్లు స్వరూపాన్ని బట్టి కొన్ని అంశాలు విస్తరించడం లేదా కుదించడం జరుగుతుంది. మీరు కేవలం పైకి వెళ్లేందుకే మెట్లు కావాలి అనుకుంటే.. అందుకు 6 అడుగులు * 12 అడుగుల స్థలం అవసరం పడుతుంది. ఆ స్థలంలో పైకివెళ్లే డాగ్లెగ్ స్టెప్స్ (సాధారణ మెట్లు) పెట్టుకుంటే.. ఇంట్లో అదనంగా డబుల్ హైట్ అవసరం పడదు. అలాగే కేవలం లిఫ్ట్ పట్టే స్థలం ఇచ్చి, దానిచుట్టూ మెట్లు పెట్టుకుంటే కూడా డబుల్ హైట్ అవసరం పడదు. అయితే లిఫ్ట్ తప్పక పెట్టాల్సి వస్తుంది. దానిని ఆలస్యం చేయవద్దు. డూప్లెక్స్ నిర్మాణంలో ఇంటిని అన్ని రకాలుగా బ్యాలెన్స్ చేయాల్సి వస్తుంది. శాస్ర్తాన్ని అనుసరిస్తూ నిర్మాణం జరపాలి. మీ ఇంటి నిర్మాణం, దాని వైశాల్యాన్ని బట్టి ఓ నిర్ణయం తీసుకోండి.
– బి. శ్రీహరి, వైరా
ఇంటిని ప్లాన్ చేసేటప్పుడే.. ముందుగా బాల్కనీలు లెక్కించి, మిగతా గదుల గురించి ఆలోచించాలి. ఇంటి పంపకంలో బాల్కనీలు చాలా ముఖ్యం. మొత్తం గదులు, వంట గది, మధ్యలో హాలు.. ఇలా విభజన చేయడంతోపాటు తూర్పు బాల్కనీ, ఉత్తరం బాల్కనీ తప్పక ఉండాలి. ఇంటిని కింద కట్టినా.. పైన కట్టినా తూర్పు – ఉత్తరం ఖాళీ వచ్చేలా ఉండాల్సిందే! కింద ఉత్తరంలో ఉండే ఖాళీ స్థలం, పైన ఇల్లు కట్టినప్పుడు దానికి కూడా ఉత్తరం ఖాళీ అవసరం అవుతుంది.
కాబట్టి, ఉత్తరం తప్పక బాల్కనీ రావాలి. అలాగే, తూర్పు కూడా! ఇక పడమర రోడ్డు ఉన్న ఇల్లు కాబట్టి, మీరు పడమర వైపు బాల్కనీ తీసుకోవచ్చు. ఆ బాల్కనీ కూడా ఇంటి వెడల్పు ఎంత ఉంటే అంత.. అంటే ఉత్తరం నుంచి దక్షిణం వరకు బాల్కనీ ఉండాలి.పడమర మెట్లు పెట్టి బాల్కనీ ఉన్నా కూడా.. తూర్పులో బాల్కనీ ఉండాల్సిందే! తూర్పు లేదా పడమరల్లో కేవలం ఒక్క బాల్కనీ మాత్రమే కావాలి అనుకుంటే.. తప్పక తూర్పు వైపునే బాల్కనీ ఉండాలి. లేదా రెండు వైపులా కూడా తీసుకోవచ్చు. దీనివల్ల నిర్మాణానికి సమతౌల్యం వస్తుంది. ఎక్కడ తేడా వచ్చినా వాస్తుకు విరుద్ధమే.
‘బతుకమ్మ’, నమస్తే తెలంగాణ దినపత్రిక,
ఇంటి.నం: 8-2-603/1/7,8,9, కృష్ణాపురం.
రోడ్ నం: 10, బంజారాహిల్స్, హైదరాబాద్ – 500034.