మీ ఫోన్లో స్టోరేజ్ తక్కువగా ఉందా? ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్, ఐఫోన్, ఆండ్రాయిడ్.. ఇలా అన్నిటికీ ఓటీజీ డ్రైవ్ వాడుకోవాలని ఉందా? అలాంటి సమయాల్లో మీకు చక్కగా ఉపయోగపడేది ఈవీఎం ఎన్స్టోర్ 4-ఇన్-1 ఓటీజీ ఫ్లాష్‌డ్రైవ్. ఈ ఒక్క డ్రైవ్.. నాలుగు రకాల డివైస్‌లకు కనెక్ట్ అవుతుంది. అంటే ఫొటోలు, వీడియోలు, ఫైల్స్ బదిలీ చేయడం మరింత సునాయాసం అవుతుంది. ఈ ఓటీజీ డ్రైవ్‌లో నాలుగు కనెక్టివిటీ ఆప్షన్లు ఉన్నాయి. యూఎస్బీ టైప్-ఎ, టైప్-సి, యూఎస్బీ 3.0తోపాటు ఐఫోన్ కోసం లైటెనింగ్ కనెక్టివిటీ ఉన్నది. ప్లగ్ అండ్ ప్లే విధానంలో ఈజీగా డేటా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. యూఎస్బీ 3.0 సపోర్ట్ వల్ల హై స్పీడ్‌తో డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది. మెటల్ బాడీతో రూపొందిన ఈ డ్రైవ్ స్టయిలిష్‌గానూ కనిపిస్తుంది. డ్రైవ్‌లో ఉండే వీడియోలను నేరుగా ప్లే చేయవచ్చు. ఈ డ్రైవ్ స్టోరేజ్ సామర్థ్యం 64జీబీ.
ధర: రూ.999,
దొరుకు చోటు:
అన్ని ప్రముఖ ఆన్లైన్,
ఆఫ్‌లైన్ స్టోర్లలో
లభిస్తుంది.
నిత్యం ఏదో ఒక పనితో బిజీగా ఉంటున్నాం. దీంతో ఇంట్లో ఎప్పుడు ఏ గదిలో ఉంటామో తెలియని పరిస్థితి. అలాంటప్పుడు ఇంటికి ఎవరైనా వస్తే ఎలా? ఇదిగో ఈ కాలింగ్ బెల్ ఉంటే చాలు. దీని పేరు ఏలియన్స్ వైర్లెస్ డోర్ బెల్. స్టయిలిష్ లుక్, సింపుల్ సెటప్, మల్టీ-యూజ్ డిజైన్‌తో యూజర్ల దృష్టిని ఆకర్షిస్తున్నది. ఈ డోర్‌బెల్ సెట్లో పుష్ బటన్, రిసీవర్ ఉంటాయి. ఇంటి గేటు వద్ద బటన్‌ను.. ఇంట్లో ఏ ప్లగ్ పాయింట్లోనైనా రిసీవర్‌ను పెట్టుకుంటే చాలు.. సెటప్ అయిపోయినట్టే. 100 నుంచి 300 మీటర్ల వైర్లెస్ పరిధిలో ఇది పని చేస్తుంది. దీంతో పెద్ద ఇళ్లకైనా, వ్యాపార స్థలాలకైనా సరిపోతుంది. 38 రకాల ట్యూన్స్ అందుబాటులో ఉంటాయి. మూడు రకాల లెవల్స్‌లో వాల్యూమ్‌ను సెట్ చేసుకోవచ్చు. హై, మీడియం, లో, సైలెంట్ మోడ్లలో పెట్టుకోవచ్చు. ఐపీ 44 వాటర్ ప్రూఫ్ ఫీచర్‌తో వస్తుంది. అంటే వర్షాల్లోనూ, ఎండల్లోనూ పటిష్ఠంగా పనిచేస్తుంది. హోటల్స్, హాస్పిటల్స్, షాపులు, గోదాములు, స్కూళ్లు, వర్క్‌షాప్స్.. లాంటి వాణిజ్య ప్రదేశాల్లోనూ బాగా పనికొస్తుంది.
ధర: రూ.797.
దొరుకు చోటు: అన్ని ప్రముఖ
ఆన్లైన్, ఆఫ్‌లైన్ స్టోర్లలో లభిస్తుంది.
ప్రొఫెషనల్ ఫొటోగ్రఫీని మరో లెవల్‌కి తీసుకెళ్లే ప్రయత్నంలో ఫ్యూజీఫిల్మ్ కంపెనీ మరో ముందడుగు వేసింది. దేశీయ మార్కెట్లోకి కొత్త మోడల్ కెమెరాని తీసుకొచ్చింది. అదే జీఎఫ్ఎక్స్100ఆర్ఎఫ్. మిడ్ ఫార్మాట్ ఫొటోగ్రఫీ లవర్స్‌కి ఇది ప్రత్యేకం. జీఎఫ్ఎక్స్ సిరీస్‌లో మొదటి ఫిక్స్డ్ లెన్స్ మోడల్ ఇది. భారీ సెటప్‌తో అధిక బరువుతో ఉండే మీడియం ఫార్మాట్ కెమెరాల విషయంలో ఈ జీఎఫ్ఎక్స్100ఆర్ఎఫ్ సరికొత్త ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తున్నది. 102 మెగాపిక్సెల్ సెన్సార్‌తో కూడిన ఈ కెమెరా బరువు.. కేవలం 735 గ్రాములు మాత్రమే. అంటే మీ బ్యాగ్‌లో వేసుకుని ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. కొత్తగా వచ్చిన ఈ కెమెరాలో ఫ్యూజీ కంపెనీకి చెందిన తాజా ఎక్స్ ప్రాసెసర్ 5 ఇమేజ్ ఇంజన్ వాడారు. అంతేకాదు.. కొత్తగా అభివృద్ధి చేసిన 35ఎంఎం ఎఫ్4 ఫిక్స్డ్ లెన్స్ దీంట్లో హైలైట్. లాండ్‌స్కేప్స్, స్ట్రీట్ ఫొటోస్, ట్రావెల్ క్లిక్స్, పోర్ట్రెయిట్స్.. ఇలా అన్నిటికీ సరిపోతుంది. ఇన్‌బిల్ట్ ఇన్ ఎన్డీ ఫిల్టర్ కూడా ఉంది. అంటే ఎక్కువ లైట్ ఉన్న ప్రదేశాల్లోనూ లేటెస్ట్ షాట్ లైట్ కంట్రోల్‌తో తీసుకోవచ్చు.
ధర: రూ. 5,49,999
దొరుకు చోటు: అన్ని ప్రముఖ ఆన్లైన్, ఆఫ్‌లైన్ స్టోర్లు.
కృత్రిమ మేధతో మోటరోలా ‘రేజర్ 60 అల్ట్రా’ ఫ్లిప్ ఫోన్‌ను దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. స్టయిల్, స్మార్ట్‌నెస్, స్పీడ్.. అన్నిటినీ ఫ్లిప్ డిజైన్‌లో సమీకరించిన ప్రీమియం ఫోన్ ఇది. ఈ ఫోన్‌కి 4 అంగుళాల కవర్ డిస్ప్లే ఉంది. ఇది ఈ సెగ్మెంట్ ఫోన్లలో ఇప్పటివరకూ అందుబాటులో ఉన్న అతిపెద్ద కవర్ డిస్ప్లేగా మోటరోలా చెబుతున్నది. ఇంటర్నల్ డిస్ప్లే 7 అంగుళాలు. 165Hzరిఫ్రెష్ రేట్ వల్ల స్మూత్‌గా తెరపై గ్రాఫిక్స్ కనిపిస్తాయి. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌ని వాడారు. ర్యామ్ 16జీబీ. స్టోరేజ్ సామర్థ్యం 512 జీబీ. బ్యాటరీ సామర్థ్యం 4,700 ఎంఏహెచ్. వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ ఉంది. ఇక కెమెరాల విషయానికొస్తే.. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ సెన్సార్, 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాలు ఉన్నాయి. కెమెరాలకు ఏఐ ట్యూనింగ్ ఉండటంతో ఫొటోల్లో రంగులు సహజంగా కనిపిస్తాయి. వీడియోల్లో 4కె రికార్డింగ్, ఇమేజ్ స్టేబిలైజేషన్, క్విక్ ఎడిటింగ్ ఫీచర్లు లభిస్తాయి.
ధర : రూ.99,999.
దొరుకు చోటు:
అన్ని ప్రముఖ
ఆన్లైన్,
ఆఫ్‌లైన్ స్టోర్లలో
లభిస్తుంది.