పచ్చి బఠాణీ తింటే ఎన్ని లాభాలో తెలుసా!!
Health Benefits of Green Peas | పచ్చి బఠాణీలు కూరకు మంచి రూపాన్ని, కమ్మటి రుచినీ ఇస్తాయి. అందుకే పులావ్, బిర్యానీ, ఉప్మా, చాట్.. ఇలా ఏది చేసుకున్నా పచ్చి బఠాణీలు జోడించుకోవచ్చు. పచ్చి బఠాణీల్లో ఆరోగ్యాన్నిచ్చే పోషకాలూ ఉన్నాయి..
n పచ్చి బఠాణీల్లో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. దీనివల్ల రక్త హీనత సమస్య నుంచి బయట పడవచ్చు. ఇందులోని విటమిన్-సి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. వీటిలో లుటీన్
అనే కెరోటినాయిడ్ ఉంటుంది. ఇది కళ్లలో శుక్లాలు రాకుండా చూస్తుంది. కంటిచూపును మెరుగుపరుస్తుంది. అంతేకాదు వీటిలోని ఫైబర్ గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది. మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది.
n వీటిలో క్యాలరీలు తక్కువ. బరువు తగ్గాలనుకునే వారికి చక్కటి ఆహారం. దీనివల్ల ఆకలి నియంత్రణలో ఉంటుంది. మలబద్ధకం సమస్యలూ ఉండవు. ఫ్లేవనాయిడ్స్, కెరోటినాయిడ్స్, పాలీఫినాల్స్, విటమిన్-ఎ, సి, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌తోపాటు ఇతర పోషకాలు కూడా ఉన్నాయి. పచ్చి బఠాణీల్లో ఉండే విటమిన్-సి వల్ల చర్మం మృదువుగా, కాంతిమంతంగా ఉంటుంది. అయితే వీటిని వంటసోడా, మాంసాహారం, మసాలా దినుసులతో కలిపి ఉడికించకుండా.. తాజా కూరగాయలతో తీసుకోవడం మంచిది.
Read More :
“సాధారణ అరటి పండ్లతో పోలిస్తే ఎర్రటి అరటి పండ్లు మంచివా? కాదా?”
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

