పరిగడుపున క్యాబేజీ నీళ్లు తాగితే ఆ సమస్యలు తగ్గిపోతాయంట !!
Cabbage Water | కూరలు, సలాడ్స్, పచ్చళ్లలో క్యాబేజీని వాడతాం. నిజానికి, క్యాబేజీ నీళ్లు కూడా ఆరోగ్యానికి ఎంతో మంచివి. ఈ నీళ్ల ద్వారా ఎన్నో పోషకాలు మనకు అందుతాయి. ఒంట్లోని వ్యర్థాలను బయటికి పంపే ఆరోగ్య పానీయం ఇది.
క్యాబేజీలో పొటాషియం, మెగ్నీషియం, క్యాల్షియంలాంటి ఖనిజాలతో పాటు విటమిన్- కె, సి, బి6 లాంటివీ అపారం. శరీర కణజాలానికి హానిచేసే ఫ్రీరాడికల్స్ నుంచి కాపాడే పాలీఫినాల్స్ తదితర యాంటీ ఆక్సిడెంట్లు మరింత పుష్కలం.
› క్యాబేజీ నీళ్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఇందులోని పోషకాలు, ఖనిజ లవణాలు హానికర సూక్ష్మక్రిముల నుంచి కాపాడతాయి.
› క్యాబేజీలో లభించే ఇండాల్-3 అనే యాంటీ ఆక్సిడెంట్ విషతుల్యాలను బయటికి తరిమి, కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. మద్యం అధిక మోతాదులో పుచ్చుకునేవారు, తెల్లవారి పరగడుపున ఒక గ్లాసు క్యాబేజీ నీళ్లు తీసుకోవడం మంచిదని సలహా ఇస్తారు వైద్యులు. ఇవి పొట్ట, కాలేయంలో పేరుకుపోయే ఆల్కహాల్ వ్యర్థాలను శుభ్రపరుస్తాయి.
› క్యాబేజీ నీళ్లలోని యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలోని విషతుల్యాలను బయటికి పంపుతాయి. బీపీ తదితర సమస్యల నుంచి ముందస్తు రక్షణ కల్పిస్తాయి.
› ఇందులోని పోషకాలు ఫ్రీరాడికల్స్ నుంచి కాపాడి చర్మ ఆరోగ్యానికి సహకరిస్తాయి.
› క్యాబేజీ నీళ్లలో క్యాలరీలు తక్కువ. దీంతో బరువు తగ్గేందుకు ఉపయోగపడతాయి.
› క్యాబేజీలో ఉండే మెగ్నీషియం, క్యాల్షియం, పొటాషియంలాంటి ఖనిజ లవణాలు ఎముకలను దృఢంగా ఉంచుతాయి.
› ఈ నీళ్లలోని బీటా కెరోటిన్లు వయసు రీత్యా వచ్చే కంటి సమస్యల్ని దూరం చేస్తాయి. నేత్ర ఆరోగ్యానికి సహకరిస్తాయి.
ఇంతకీ, ఈ నీళ్లను ఎలా తయారు చేసుకోవాలంటే… సన్నగా తురిమిన క్యాబేజీలో నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టాలి. పొద్దున్నే వడగట్టి రుచికోసం నిమ్మరసం, ఉప్పు లాంటివి కలుపుకొని తాగితే సరిపోతుంది.
Read More :
“చిన్న చిన్న విషయాలనే మరిచిపోతున్నారా? వీటిని ఇలా తింటే మతిమరుపు తగ్గుతుందట !!”
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- cabbage
- Health
- Health benefits
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

