చిన్న చిన్న విషయాలనే మరిచిపోతున్నారా? వీటిని ఇలా తింటే మతిమరుపు తగ్గుతుందట !!
Health Benefits of Fish | మిగతా మాంసాహారాలతో పోలిస్తే చేపలు, నత్తలు, రొయ్యలు వంటి సీఫుడ్‌లో ప్రొటీన్‌తోపాటు కొవ్వు శాతమూ తక్కువే. అంతేకాదు, శరీరానికి అవసరమయ్యే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే మనకు ఎప్పుడూ అందుబాటులో ఉండే చేపలను తరచూ ఆహారంలో భాగం చేసుకోవాలి.
వయసు మీదపడటం వల్ల ఎదురయ్యే సమస్య మతిమరుపు. కొందరిలో ఇది అల్జీమర్స్‌కు దారితీస్తుంది. చేపలతో అలాంటి జ్ఞాపకశక్తి సమస్యల నుంచి బయటపడవచ్చని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. చేపలను తినడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది.
చేపలను తింటే మానసిక ఆందోళన తగ్గుతుంది. ఒత్తిడిని తగ్గించడంలో చేపలు ఎంతగానో ఉపయోగపడతాయి. చేపల్లోని డోపమైన్, సెరొటోనిన్ అనే హార్మోన్లు డిప్రెషన్‌ను అడ్డుకుంటాయి. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కీళ్లనొప్పులను తగ్గిస్తాయి. ఎముకల్ని దృఢంగా ఉంచే విటమిన్-డి, కాల్షియం చేపల్లో పుష్కలం.
పెద్దపేగు, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, పాంక్రియాటిక్ క్యాన్సర్లనూ చేపలు నిరోధిస్తాయి. చేపలను తినడం వల్ల గుండెజబ్బులు వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయని అమెరికన్ జర్నల్ ఆఫ్ కార్డియాలజీలో ఓ అధ్యయన వివరాలను ప్రచురించారు. చేపల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ రక్తంలో ఉండే ట్రై గ్లిజరైడ్లను తగ్గిస్తాయి. దీంతో రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడవు.
స్త్రీలలో రుతుక్రమం సమస్యలకు చేపలను మించిన ఔషధం లేదు. చేపల్లో తొమ్మిది రకాల అమైనో యాసిడ్స్ ఉంటాయి. గర్భిణులు, బాలింతలు తరచూ చేపలను తినడం వల్ల పిల్లల ఎదుగుదల బాగుంటుంది. పిల్లల్లో ఆస్తమాను నివారించేందుకు చేపలు ఔషధంగా పనిచేస్తాయి.
Read More :
“పొన్నగంటి కూర తినడం ఆరోగ్యానికి మంచిదేనా? ఆకుకూరలతో లాభాలేంటి?”
“Cellulite | మహిళల్లో ఎక్కువగా కనిపించే ఈ వ్యాధికి.. ఆముదానికి సంబంధమేంటి?”
కూరలు, చారుల్లో ధనియాల పొడిని వేసుకుంటే ఇన్ని లాభాలు ఉన్నాయా!!”
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

