ఇంట్లో, ఆఫీస్‌లో ఏదో ఒక పార్టీలు, పబ్లిక్ ఈవెంట్లు, స్టేజ్ పెర్ఫార్మెన్స్ చేస్తుంటారా? అయితే, డిజిమోర్ సంస్థ రూపొందించిన ‘డి-340 యూహెచ్ఎఫ్’ వైర్లెస్ మైక్రోఫోన్‌ని వాడొచ్చు. దీంతో చాలా క్లియర్‌గా సౌండ్ వస్తుంది. పార్టీలకు, పెళ్లిళ్లకు, స్టేజ్‌పై ప్రదర్శనలకు ఇది పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఉపయోగించడం కూడా చాలా సులభం. ఎలాంటి సెటప్ అవసరం లేదు. ప్రత్యేక అడాప్టర్‌తో ఆడియో మిక్సర్, లేదా స్పీకర్‌కు కనెక్ట్ చేసి వాడుకోవచ్చు. ఈ మైక్‌లో రీచార్జ్ లిథియం బ్యాటరీలను వాడొచ్చు. వాటిని రెండు గంటలు చార్జ్ చేస్తే.. 6 గంటలపాటు పని చేస్తాయి. టైప్-సీ చార్జింగ్ కేబుల్ ఇచ్చారు. వైర్లెస్ పద్ధతిలో సుమారు 160 అడుగుల వరకూ ఎలాంటి సిగ్నల్ లాస్ లేకుండా సౌండ్ పికప్ చేస్తుంది. మైక్‌తోపాటు వైర్లెస్ రిసీవర్, బ్యాటరీలు, యూఎస్బీ చార్జింగ్ కేబుల్, అడాప్టర్, యాంటి-రోలింగ్ రింగ్ వస్తాయి.
బడ్జెట్లో 5జీ ఫోన్..
ఇన్ఫినిక్స్.. తన సరికొత్త ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇన్ఫినిక్స్ హాట్ 60ఐ 5జీ పేరుతో.. బడ్జెట్లోనే 5జీ ఫోన్‌కు రూపకల్పన చేసింది. అదిరిపోయే లుక్‌తోపాటు చక్కని ఫీచర్లు అందిస్తున్నది. ఇందులో కెమెరా సెటప్ చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. 6.75 అంగుళాల హెచ్డీ డిస్ప్లే. 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో.. డిస్ప్లే స్మూత్‌గా పనిచేస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్‌ని వాడారు. బ్యాటరీ సామర్థ్యం 6000 ఎంఏహెచ్. 128 గంటల పాటు నిర్విరామంగా పాటలు వినొచ్చని కంపెనీ చెబుతున్నది. 50 మెగాపిక్సెల్ క్లియర్ కెమెరాతో డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్‌ను ఏర్పాటుచేశారు. 4 జీబీ ర్యామ్‌కు మరో 4 జీబీ ఎక్స్టెండెడ్ ర్యామ్ కలిపి.. సామర్థ్యాన్ని 8 జీబీకి పెంచుకోవచ్చు. 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కూడా ఉంది. మరో ప్రత్యేకత ఏంటంటే.. ఇన్ఫినిక్స్ ఏఐ టెక్నాలజీ. దీనితో వాయిస్ సెర్చ్, ఏఐ ఎరేజర్, ఏఐ డాక్యుమెంట్ సమ్మరైజర్, ఏఐ వాల్‌పేపర్ జనరేటర్ లాంటి అడ్వాన్స్డ్ ఫీచర్లు ఉపయోగించుకోవచ్చు. ఐపీ64 వాటర్-డస్ట్ రెసిస్టెన్స్ రేటింగ్ కూడా ఉంది. నీళ్లు పడ్డా, ధూళి చేరినా పెద్దగా ఇబ్బంది ఉండదు.
కరెంట్ పోతే.. యూపీఎస్ ఉందిగా!
కంప్యూటర్, ల్యాపీ వాడేవారికి కరెంట్ పోతే డేటా లాస్ అవుతుందని భయం ఉంటుంది. అలాంటప్పుడు బడ్జెట్లో యూపీఎస్ పెట్టుకుంటే సరి. అలాంటిదే ఆర్టిస్ 600 వీఏఎల్సీడీ టచ్‌స్క్రీన్ యూపీఎస్. ఇది మీ పీసీ, ల్యాప్‌టాప్‌లకు పూర్తి రక్షణ ఇస్తుంది. 600VA కెపాసిటీతో రౌటర్లు, నెట్వర్కింగ్ డివైజ్‌లు, గేమింగ్ కన్సోల్స్కి కూడా పవర్ బ్యాకప్ ఇస్తుంది. దీంట్లో 12V 7AH హెవీ డ్యూటీ బ్యాటరీ ఉంది. ఒకేసారి మూడు డివైజ్‌లను కనెక్ట్ చేయవచ్చు. ఒక సాధారణ డెస్క్‌టాప్ పీసీ, ఎల్ఈడీ మానిటర్‌ను కనెక్ట్ చేస్తే.. 40 నిమిషాల వరకూ బ్యాకప్ ఇస్తుంది. దీంట్లోని ఏవీఆర్ (ఆటోమేటిక్ వోల్టేజ్ రెగ్యులేషన్) ఫంక్షన్.. వోల్టేజ్‌ను ఆటోమేటిక్‌గా అదుపులో ఉంచుతుంది. కరెంట్ లేనప్పుడు కూడా దీనిలో ఉన్న కోల్డ్ స్టార్ట్ ఫంక్షన్ పీసీని నేరుగా స్టార్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. కరెంట్ వచ్చాక ఇది ఆటోమేటిక్‌గా ఆన్ అవుతుంది. దీంట్లో మరో ప్రత్యేకత టచ్‌స్క్రీన్‌తో కూడిన ఎల్సీడీ. ఇన్పుట్ వోల్టేజ్, అవుట్‌పుట్ వోల్టేజ్, బ్యాటరీ పవర్‌ని డిస్ప్లేలో చూడొచ్చు. అనుకోకుండా కరెంట్ పోతే, వెంటనే ఫైళ్లను సేవ్ చేసుకుని షట్‌డౌన్ చేసుకోవడానికి తగినంత సమయం ఇస్తుంది.
కామ్క్రియేటర్ల కోసం ఓ మంచి మైక్!
యూట్యూబ్, వ్లాగింగ్, రీల్స్ చేస్తున్నారా? అయితే, ‘వూక్ వైర్లెస్ మైక్’ మీ కోసమే. నాయిస్ క్యాన్సిలింగ్, వాయిస్ చేంజర్ ఫీచర్లతో వైర్లెస్ మైక్‌లను వాడుకోవచ్చు. బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ తగ్గించడానికి ఏఐ ఈఎన్సీ (AIENC) నాయిస్ క్యాన్సిలింగ్ ఫీచర్‌తో వస్తుంది. దీంట్లో రెండు మైక్‌లు, రిసీవర్ ఉంటాయి. ఇద్దరు ఒకేసారి మాట్లాడినా, ఆడియో రికార్డ్ అవుతుంది. ఇంటర్వ్యూలు, పాడ్‌కాస్ట్‌లు, వీడియోల కోసం బాగా ఉపయోగపడుతుంది. దీంట్లో ఏఐ వాయిస్ చేంజర్ ఫీచర్ ఉంది. దీంతో మీరు మీ వాయిస్‌ను మూడు రకాలుగా మార్చుకోవచ్చు. బ్యాటరీ బ్యాకప్ 30 గంటలపాటు వస్తుంది. యూఎస్బీ-సీ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. రికార్డింగ్ చేస్తున్నప్పుడు కూడా చార్జ్ చేసుకోవచ్చు. మైక్‌లను ఐఓఎస్, ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లకు కనెక్ట్ చేయవచ్చు. ఎలాంటి యాప్స్, అడాప్టర్లు అవసరం లేదు. 360 డిగ్రీల్లో ఆడియో క్యాప్చర్ చేస్తుంది. దీంతో వాయిస్ స్పష్టంగా రికార్డు అవుతుంది. 30 మీటర్ల వరకు వైర్లెస్ రేంజ్ ఉంది. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ కోసం వీడియోలు చేసేవారికి ఇది మంచి ఎంపిక.