ఇంతవరకు చేసింది పసుపు గణపతి పూజ . ఆ గణపతిని మహాగణపతి అంటారు. ఇప్పుడు మట్టి గణపతిని పూజించాలి. ఈయనే వరసిద్ధి గణపతి. చేతిలో పూలు, అక్షతలు తీసుకొని కింది శ్లోకం చదివి గణపతి పాదాల దగ్గర సమర్పించాలి.
ఓం శ్రీవరసిద్ధి వినాయకస్వామినే నమః ప్రాణప్రతిష్ఠ ముహూర్తః సుముహూర్తోస్తు స్వామిన్ సర్వజగన్నాథ యావత్పూజావసానకం తావత్తం ప్రీతిభావనే ప్రతిమేస్మిన్ సన్నిధిం కురు, సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీం పరివార సమేతం శ్రీవరసిద్ధి వినాయకస్వామిన్ స్థాపితో భవ, సుముఖోభవ, సుప్రసన్నోభవ, స్థిరోభవ, వరదోభవ ప్రసీదః ప్రసీదః ప్రసీదః శ్రీవరసిద్ధి వినాయకస్వామినే నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి.
(కింది శ్లోకం చదువుతూ స్వామిపై అక్షతలు వేస్తూ నమస్కరించాలి)
ఆవాహనం
శ్లో॥ అత్రాగచ్ఛ జగద్వంద్య సురరాజార్చితేశ్వర
అనాథనాథ సర్వజ్ఞ, గౌరీగర్భ సముద్భవ ॥
ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః
ఆవాహయామి ఆవాహనం సమర్పయామి
(కింది శ్లోకం చదువుతూ స్వామిపై అక్షతలు వేస్తూ నమస్కరించాలి)
ఆసనం
శ్లో॥ మౌక్తికైః పుష్యరాగైశ్చ నానారత్నైర్విరాజితం
రత్న సింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం ॥
ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః నవరత్న ఖచిత స్వర్ణసింహాసనార్థం-హరిద్రాక్షతాన్ సమర్పయామి.
(కింది శ్లోకం చదువుతూ పుష్పముతో గణేశుని చేతులపై నీళ్లు చల్లాలి)
అర్ఘ్యం
శ్లో॥ గౌరీపుత్ర నమస్తేస్తు శంకరస్య ప్రియనందన
గృహాణార్ఘ్యం మయాదత్తం గంధపుష్పాక్షతైర్యుతం ॥
ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః
హస్తయోః అర్ఘ్యం సమర్పయామి
(కింది శ్లోకం చదువుతూ పుష్పముతో గణేషుని పాదాలపై నీళ్లు చల్లాలి)
పాద్యం
శ్లో॥ గజవక్త్ర నమస్తేస్తు సర్వాభీష్టప్రదాయక
భక్త్యాపాద్యం మయాదత్తం గృహాణ ద్విరదానన ॥
ఓం శ్రీ వరసిద్ధ్ది వినాయకాయ నమః
పాదయోః పాద్యం సమర్పయామి
శ్లో॥ అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ వరపూజిత
గృహాణాచమనం దేవ తుభ్యం దత్తం మయా ప్రభో॥
ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః
ముఖేః శుద్ధ ఆచమనీయం సమర్పయామి
(కింది శ్లోకం చదువుతూ ఆవు పాలు, పెరుగు, నెయ్యిలతో కూడిన మిశ్రమాన్ని సమర్పించాలి)
మధుపర్కం
శ్లో॥ దధిక్షీరసమాయుక్తం మధ్వాజ్యేన సమన్వితమ్ మధుపర్కం గృహాణేదం గజవక్త్ర నమోస్తుతే ॥
ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః
మధుపర్కం సమర్పయామి
(కింది శ్లోకాన్ని చదువుతూ పుష్పంతో స్వామిపై పంచామృతాలు చిలకరించాలి)
పంచామృతం
శ్లో॥ స్నానం పంచామృతైర్దేవ గృహాణ గణనాయక
అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ గణపూజితః॥
ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః
పంచామృత స్నానం సమర్పయామి
(కింది శ్లోకాన్ని చదువుతూ పుష్పంతో నీటిని రెండుసార్లు స్వామిపై చల్లాలి)
శుద్ధోదక స్నానం
శ్లో॥ గంగాది సర్వతీర్థేభ్య ఆహృతైః అమలైర్జలైః
స్నానం కురుష్వ భగవాన్ ఉమాపుత్ర నమోస్తుతే॥
ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః
శుద్ధోదక స్నానం సమర్పయామి.
స్నానానంతరం పునః శుద్ధాచమనీయం సమర్పయామి.
(కింది శ్లోకం చదువుతూ పత్తితో చేసిన వస్ర్తాన్నిగానీ, రెండు పుష్పాలను గానీ వినాయకుడికి సమర్పించాలి)
వస్త్రం
శ్లో॥ రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యంచ మంగళం
శుభప్రదం గృహాణత్వం, లంబోదర హరాత్మజ॥
ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః
వస్త్రయుగ్మం సమర్పయామి
(కింది శ్లోకాన్ని చదువుతూ పత్తితో చేసిన యజ్ఞోపవీతాన్ని స్వామికి వెయ్యాలి)
యజ్ఞోపవీతం
శ్లో॥ రాజతం బ్రహ్మసూత్రం చ కాంచనంచోత్తరీయకం
గృహాణ దేవ సర్వజ్ఞ భక్తానామిష్ట దాయక॥
ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః
యజ్ఞోపవీతం సమర్పయామి
(కింది శ్లోకాన్ని చదువుతూ పుష్పంతో గంధాన్ని స్వామిపై వెయ్యాలి)
గంధం
శ్లో॥ చందనాగరు కర్పూర కస్తూరీ కుంకుమాన్వితమ్
విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్
ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః
దివ్య శ్రీ చందనం సమర్పయామి
(కింది శ్లోకాన్ని చదువుతూ అక్షతలు స్వామిపై వెయ్యాలి)
అక్షతలు
శ్లో॥ అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాన్
తండులాన్ శుభాన్
గృహాణ పరమానంద శంభుపుత్ర నమోస్తుతే॥
ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః
అలంకరణార్థం హరిద్రాక్షతాన్ సమర్పయామి
(కింది శ్లోకాన్ని చదువుతూ పుష్పాలు స్వామిపై వెయ్యాలి)
పుష్పములు
శ్లో॥ సుగంధాని చ సుపుష్పాణీ జాజీకుంద
ముఖానిచ – ఏకవింశతి పత్రాణి
సంగృహాణ నమోస్తుతే॥
ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః
పుష్పాణి పూజయామి