స్క్రోలింగ్ వెనక మనసు రోలింగ్!
‘నా ఇన్స్టాగ్రామ్ ఫీడ్ చూస్తే అందరూ హ్యాపీగా, సక్సెస్‌ఫుల్‌గా ఉన్నట్లు అనిపిస్తుంది. నేనెందుకు అలా లేను అనే డిప్రెషన్ మరోవైపు. నాకే ఈ స్ట్రగుల్స్ అన్నీ.. అనే భావన నన్ను మరింత ఒంటరిగా ఫీల్ అయ్యేలా చేస్తోంది..’ ‘కొన్నిసార్లు నా ఫోన్‌ని సైలెంట్ మోడ్‌లో పెట్టేస్తా.. ఒంటరిగా కూర్చుంటా.
‘నా ఇన్స్టాగ్రామ్ ఫీడ్ చూస్తే అందరూ హ్యాపీగా, సక్సెస్‌ఫుల్‌గా ఉన్నట్లు అనిపిస్తుంది. నేనెందుకు అలా లేను అనే డిప్రెషన్ మరోవైపు. నాకే ఈ స్ట్రగుల్స్ అన్నీ.. అనే భావన నన్ను మరింత ఒంటరిగా ఫీల్ అయ్యేలా చేస్తోంది..’ ‘కొన్నిసార్లు నా ఫోన్‌ని సైలెంట్ మోడ్‌లో పెట్టేస్తా.. ఒంటరిగా కూర్చుంటా.
ఓ 10 నిమిషాలు నాకు చాలా రిలీఫ్‌గా అనిపిస్తుంది. కానీ, మళ్లీ నోటిఫికేషన్స్ చూడాలనిపిస్తుంది! ఫోన్ అందుకోగానే ఏదో ఆవహించినట్టుగా అలానే చూస్తూ ఉండిపోతున్నా’ ‘ఫోన్ అన్‌లాక్ చేస్తే.. వందల్లో ఫ్రెండ్స్.. వేలల్లో మెసేజ్‌లు.. ఎమోజీలు! ఒక్కసారి ఫోన్ పక్కన పెడితే, హాయ్! అంటూ భుజంపై చెయ్యేసే ఫ్రెండ్ ఒక్కరూ లేరు. ఆరంగుళాల స్క్రీన్‌లో ఎందర్నో నెట్‌వర్క్‌గా పెట్టుకున్న నేను. నా చుట్టూ నలుగురు ఫ్రెండ్స్ లేకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియడం లేదు’..
సోషల్ మీడియాలో వేలల్లో ఫాలోవర్లు.. వందల్లో లైక్‌లు.. నిత్యం పోస్టింగ్‌లతో కళకళలాడే ప్రొఫైల్స్ ఎన్నో! పైకి కనిపిస్తున్న ఈ రంగుల ప్రపంచం వెనక నేటి తరం జెన్-జీ ఎంత ఆవేదన వ్యక్తం చేస్తున్నదో.. పైన పేర్కొన్న స్టేట్‌మెంట్సే సాక్ష్యం. ఓ తాజా రిపోర్ట్ ప్రకారం.. సోషల్ మీడియా అనేది కేవలం వినోదం మాత్రమే కాదు, అది యువత డిజిటల్ వెల్-బీయింగ్‌ని దెబ్బతీసే కనిపించని ఆయుధం! ఈ నిరంతర కనెక్టివిటీ వెనుక ఒక ప్రశ్న ఉంది.. ‘మనం నిజంగా కనెక్ట్ అవుతున్నామా? లేక మరింత ఒంటరిగా ఫీలవుతున్నామా?’ ఈ ప్రశ్నకు కొన్ని ఆసక్తికరమైన, ఆలోచింపజేసే జవాబులు వినిపిస్తున్నాయి. ఈ సోషల్ మీడియా ఫిల్టర్ల వెనుక దాగున్న అసలు నిజాలేంటో చూద్దాం.
జెన్-జీలో 80% మంది రోజుకు 5 గంటల కంటే ఎక్కువ సోషల్ మీడియా వాడుతున్నారట. 65% మంది ‘స్క్రోలింగ్ టైమ్ ఎలా గడిచిపోతున్నదో తెలియడం లేదు’ అంటున్నారు. 72% మంది ‘ఇతరులతో పోలిస్తే తను ఎక్కడో కింద ఉన్నట్టుగా అనిపిస్తున్నది’ అని ఒప్పుకొంటున్నారు. ఈ డేటా కేవలం ‘సోషల్ మీడియా చెడ్డది’ అని చెప్పడం కోసం కాదు. అది ఒక టూల్ మాత్రమే. దాన్ని ఎలా వాడుతున్నాం అనేదే ముఖ్యం! రిపోర్ట్‌లోనే 71% జెన్-జీ యూజర్స్ ‘సోషల్ మీడియా నాకు క్రియేటివిటీ, కమ్యూనిటీ, కనెక్షన్ ఇస్తుంది’ అని కూడా చెబుతున్నారు. అంటే సమస్య టెక్నాలజీలో కాదు.. యూసేజ్‌లో ఉంది! మరో విషయం ఏంటంటే.. జెన్-జీ మొదటి డిజిటల్ నేటివ్ జనరేషన్.. వారికి ఆన్లైన్, ఆఫ్‌లైన్ లైఫ్స్ మధ్య బౌండరీస్ సెట్ చేయడం నేర్పించాలి. సోషల్ మీడియా నిషేధించడం కాదు.. స్మార్ట్‌గా వాడటం నేర్పించాలి! లైక్‌ల సంఖ్య మీ వ్యక్తిత్వాన్ని నిర్ణయించదు. స్క్రీన్ వెలుపల మీరు గడిపే సమయమే మీ అసలైన సంపద! అనే విషయాన్ని నేటి తరానికి అర్థమయ్యేలా చెప్పాలి.
నీడలా పోలికలు..
ఎవరో వ్యక్తి విహార యాత్రకు సంబంధించిన ఫొటోలు చూసినప్పుడు, వారి లగ్జరీ లైఫ్‌ైస్టెల్ పోస్టు చూసినప్పుడు.. ‘నా జీవితం ఎందుకు ఇలా ఉంది?’ అనే పోలిక యువతలో ఆత్మన్యూనత భావాన్ని పెంచుతున్నదట! రిపోర్ట్ ప్రకారం, 60 శాతం మంది యువకులు సోషల్ మీడియా చూసిన తర్వాత తమ ఫిజిక్, స్థాయి తక్కువగా ఉందని ఫీల్ అవుతున్నారని తేలింది. ఈ ‘పర్ఫెక్షన్’ భ్రమలో పడి.. సహజమైన జీవితాన్ని ఆస్వాదించడం మర్చిపోతున్నారు. ఇలా సోషల్ మీడియా ప్రభావం యువతపై ఏయే రూపాల్లో ఉందంటే..
- FOMO (Fear of Missing Out): ఏదో కోల్పోతున్నామనే భయం. ఇతరులు ఎంజాయ్ చేస్తున్నారు, మనం వెనకబడిపోతున్నాం అనే ఆందోళన.
- సైబర్ బుల్లీయింగ్: ఆన్లైన్ వేధింపులు, నెగిటివ్ కామెంట్స్ యువత మానసిక ఆరోగ్యాన్ని చిన్నాభిన్నం చేస్తున్నాయి. ఇది వారిలో డిప్రెషన్‌కు దారితీస్తున్నది.
- నిద్రలేమి: అర్ధరాత్రి వరకు స్క్రోలింగ్ చేయడం వల్ల ‘బ్లూ లైట్’ ప్రభావంతో నిద్ర కరువవుతున్నది. ఇది శారీరక శక్తిని, ఏకాగ్రతను తగ్గిస్తున్నది.
- ప్రైవసీ ఆందోళనలు: తమ వ్యక్తిగత డేటా దుర్వినియోగం అవుతుందేమోననే భయం 70 శాతం మంది యువతలో ఉంది.
- వాలిడేషన్ సైకిల్: లైక్స్, కామెంట్స్ కోసం పోస్ట్ చేయడం.. వాటిపై ఆధారపడి సెల్ఫ్-వర్త్ని నిర్ణయించుకోవడం.
స్క్రీన్ టైమ్ వర్సెస్ స్లీప్ టైమ్: రాత్రి పడుకునే ముందు స్క్రోలింగ్ చేస్తే స్లీప్ క్వాలిటీ తగ్గుతుంది. మూడ్ ఫ్లక్చువేషన్స్ అవుతుంది.
డిజిటల్ వెల్-బీయింగ్..
సాంకేతికతను వాడుకుంటూనే.. మన మానసిక, శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే ‘డిజిటల్ వెల్-బీయింగ్’. అంటే సోషల్ మీడియాను మనం నియంత్రించాలి తప్ప, అది మనల్ని నియంత్రించకూడదు. ఫోన్ పక్కన పెట్టి మనుషులతో నేరుగా మాట్లాడటం, ప్రకృతితో గడపడం కూడా ఇందులో భాగమే! డిజిటల్ వెల్-బీయింగ్లో భాగంగా వీటిని ఫాలో అవ్వండి..
ఇంటెన్షనల్ స్క్రోలింగ్: ఫోన్ తీసుకునే ముందు.. ‘నేను ఇప్పుడు ఎందుకు ఫోన్ తీసుకుంటున్నాను?’ అని ప్రశ్నించుకోండి! బోర్డమ్, యాంగ్జయిటీ వల్ల ఫోన్ తీసుకోవడం తగ్గించండి.
డిజిటల్ బౌండరీస్: బెడ్ రూమ్, డైనింగ్ టేబుల్ లాంటి చోట్ల ఫోన్-ఫ్రీ జోన్స్ క్రియేట్ చేయండి. రాత్రి 10 తర్వాత నోటిఫికేషన్స్ ఆఫ్ చేయండి.
క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ: 100 మందిని ఫాలో అవ్వడం కంటే.. 10 మందితో నిజమైన కనెక్షన్ బిల్డ్ చేయండి.
ఆఫ్‌లైన్ హాబీస్ పెంచుకోండి: రీడింగ్, ఆర్ట్, స్పోర్ట్స్, మ్యూజిక్.. స్క్రీన్ లేని యాక్టివిటీస్‌కి టైమ్ కేటాయించండి.
ప్రాక్టీస్ సెల్ఫ్-కంపాషన్: ఇతరుల హైలైట్స్ రీల్స్‌తో మన రియాలిటీని కంపేర్ చేయకండి. ‘నా జర్నీ నాది.. నా స్పీడ్ నాది’ అనే మైండ్‌సెట్‌ని డెవలప్ చేసుకోండి.
అన్‌ఫాలో ద నెగెటివిటీ: మిమ్మల్ని బాధపెట్టే లేదా తక్కువగా ఫీల్ చేసే అకౌంట్లను వెంటనే అన్‌ఫాలో చేయండి.
డిజిటల్ డిటాక్స్: వారానికి ఒక పూట లేదా ఒక రోజంతా ఇంటర్నెట్కు దూరంగా ఉండి చూడండి. అప్పుడే మెదడుకు అసలైన విశ్రాంతి దొరుకుతుంది.
నియంత్రణ కాదు.. గైడెన్స్!
జెన్-జీ పిల్లలు ఉన్న పేరెంట్స్ వీటిని ఫాలో అయితే మంచిది. ఓపెన్ డైలాగ్ మెయింటైన్ చేయండి: ‘సోషల్ మీడియా వాడకూడదు’ అని చెప్పడం కంటే.. ‘దీన్ని ఎలా స్మార్ట్‌గా వాడాలి?’ అని డిస్కస్ చేయండి. ప్రాక్టీస్ మాడల్ బిహేవియర్: మీరు కూడా ఫోన్-ఫ్రీ టైమ్ తీసుకోండి.. పిల్లలు చూసి నేర్చుకుంటారు!
టూల్స్ పరిచయం చేయండి: స్క్రీన్ టైమ్ ట్రాకర్స్, యాప్ లిమిట్స్, డిజిటల్ వెల్ బీయింగ్ ఫీచర్స్ గురించి పిల్లలకు చెప్పండి. బిల్డ్ సపోర్ట్ సిస్టమ్: పిల్లలు ఆన్లైన్లో ఏదైనా అసౌకర్యంగా ఫీలైతే.. మీతో షేర్ చేసుకోవడానికి సేఫ్ స్పేస్ క్రియేట్ చేయండి.
– అనిల్ రాచమల్ల
వ్యవస్థాపకులు ఎండ్‌నౌ ఫౌండేషన్
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

