Surety Signature for Bank loan | ష్యూరిటీ సంతకం చేస్తున్నారా.. ఈ కష్టాలు తప్పవు
Surety Signature for Bank loan | ఒక సంతకం.. ఆటోగ్రాఫ్ బుక్‌లో పెడితే మరపురాని జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ఒక సంతకం.. ప్రేమజంటను కలపడానికి పెడితే పెండ్లి పెద్దన్న కీర్తి కట్టబెడుతుంది. అదే సంతకం హామీపత్రం మీద పెడితే.. హానికరంగా మారుతుంది.
Surety Signature for Bank loan | ఒక సంతకం.. ఆటోగ్రాఫ్ బుక్‌లో పెడితే మరపురాని జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ఒక సంతకం.. ప్రేమజంటను కలపడానికి పెడితే పెండ్లి పెద్దన్న కీర్తి కట్టబెడుతుంది. అదే సంతకం హామీపత్రం మీద పెడితే.. హానికరంగా మారుతుంది. స్నేహితుడికి పూచీకత్తు ఇవ్వడంలో తప్పేంటి? అనుకోవచ్చు. కానీ, ‘నేను జిమ్మేదారు’ అనే ఒక్కమాట అత్యవసర పరిస్థితుల్లో సదరు హామీదారుడి దారులు మూసుకుపోయేలా చేసే ప్రమాదం ఉంది. ష్యూరిటీలో ఉండే రియాలిటీ తెలుసుకుంటే.. చిన్న సంతకం ఎలాంటి విపత్తులను తీసుకొస్తుందో అవగతమవుతుంది.
రంగారావు పొదుపరి. మంచి ఉద్యోగం చేస్తున్నాడు. చక్కగా సంపాదిస్తున్నాడు. రూపాయి రూపాయి కూడబెట్టాడు. నగర శివారులో అందమైన విల్లా ఒకటి చూశాడు. చూడగానే నచ్చేసింది. నచ్చగానే బిల్డర్‌కు బయానా ఇచ్చేశాడు. వారం తిరక్కుండా తను పొదుపు చేసుకున్న పది లక్షలు అడ్వాన్స్‌గా చెల్లించాడు. పత్రాలన్నీ తీసుకొని గృహ రుణం కోసం బ్యాంకు తలుపుతట్టాడు. రంగారావు ఉద్యోగ వివరాలు, పే-స్లిప్ చూసి మేనేజరు ‘పక్షం రోజుల్లో ఇల్లు మీ పక్షం అవుతుంద’ని చెప్పాడు. తీరా పదిహేను రోజుల తర్వాత తను దరఖాస్తు చేసుకున్న రుణం తిరస్కరణకు గురైనట్టు వచ్చిన మెసేజ్ చూసి రంగారావు కంగుతిన్నాడు. కంగారుగా బ్యాంకుకు వెళ్లాడు. విషయం ఏంటని అడిగాడు.
“సిబిల్’ స్కోర్ సరిగ్గా లేకపోవడంతో మీ రుణం తిరస్కరణకు గురైంది’ అన్నాడు బ్యాంకు మేనేజర్. ఆరా తీస్తే, గతంలో రంగారావు పెట్టిన హామీ సంతకం.. ఇప్పుడు ఆయనకు రుణం రాకుండా అడ్డుపడింది. అదెలా..?

సిబిల్ స్కోర్‌పై ప్రభావం
మధ్యతరగతి ఉద్యోగికి సంపాదన తక్కువ.. బాధ్యతలు ఎక్కువ. దీనికితోడు మొహమాటమూ ఎక్కువే! తను మంచివాణ్ని అని రుజువు చేసుకోవడానికి అడిగిందే తడవుగా ష్యూరిటీలు ఇచ్చేస్తుంటాడు. ఒక వ్యక్తికి హామీ ఇవ్వడం అంటే.. తర్వాత జరిగే పరిణామాలకు పూర్తిగా తనే బాధ్యుడు అని ఒప్పుకోవడమే! సాధారణంగా చిట్స్, వ్యక్తిగత రుణం విషయంలో సంస్థలు గ్యారెంటీ అడుగుతుంటాయి. తమ పైకంలో పైసా కూడా నష్టపోవొద్దని సంస్థలు హామీ కోరుతాయి. అంటే, రుణగ్రహీత వాయిదాలు చెల్లించకున్నా, అనుకోకుండా మరణించినా ఆ సొమ్మంతా పూచీకత్తు ఇచ్చిన వ్యక్తి దగ్గర వసూలు చేసుకునేలా చట్టపరమైన భద్రత ఆ సంస్థలకు ఉంటుంది. అంతేకాదు, రుణం పొందిన వ్యక్తి వాయిదాలు ఆలస్యంగా చెల్లించినా.. ఆ ప్రభావం ష్యూరిటీ ఇచ్చిన వ్యక్తి సిబిల్ స్కోర్‌పై పడుతుంది. పైన పేర్కొన్న రంగారావు విషయంలో అచ్చంగా జరిగింది ఇదే! అతనికి ఎలాంటి రుణాలు లేకున్నా.. ఎవరికో హామీ ఇవ్వడం, అతను సరిగ్గా వాయిదాలు చెల్లించకపోవడం రంగారావు సిబిల్ స్కోర్ పతనానికి కారణమయ్యాయి. సంపాదన బాగానే ఉన్నా.. అవసరానికి రుణం పొందలేని దుస్థితి ఏర్పడింది. మీ తప్పు వల్ల పిల్లల చదువుకు రుణం దొరకని పరిస్థితీ తలెత్తవచ్చు.
మనవాడే అనుకుంటే..
ష్యూరిటీల విషయంలో చాలాసార్లు ప్రభుత్వ ఉద్యోగులు నష్టపోవాల్సి వస్తుంటుంది. చిట్స్, బ్యాంకులు ప్రభుత్వ ఉద్యోగుల ష్యూరిటీ కోరుతాయి. ‘మనవాడే కదా!’ అనే చిన్న అభిమానం ముందూవెనుకా ఆలోచించకుండా గ్యారెంటీ సంతకం చేయిస్తుంది. మంచివ్యక్తికే ష్యూరిటీ ఇచ్చినా.. ఆ తర్వాత అతని పరిస్థితి తలకిందులు అవ్వదన్న గ్యారెంటీ ఏముంది? అప్పుడే అసలు కథ మొదలవుతుంది. అప్పు ఇచ్చిన సంస్థలు చట్టపరంగా వాయిదాలు వసూలు చేసుకోవడం మొదలుపెడతాయి. ఒక్కోసారి అసలు లక్ష రూపాయలే అయినా.. వడ్డీతో మూడు లక్షలు కట్టాల్సిన పరిస్థితీ రావచ్చు. మంచికిపోతే చెడు ఎదురైనట్టు, స్నేహితుడికి ఇచ్చిన హామీ.. కుటుంబానికి హానిగా పరిణమించే ప్రమాదం ఉంది. ఒక్కసారి పూచీకత్తు ఇస్తే ఆ ఉచ్చు తొలగిపోయే వరకు మెడమీద కత్తి వేలాడుతున్నట్టే అని గుర్తించాలి. అడిగిందే తడవుగా హామీ పత్రాలపై సంతకాలు చేయకుండా ఉండటమే
అసలైన స్థితప్రజ్ఞత.

నొప్పింపక తానొవ్వక
✓ ‘అంత్య నిష్టూరం కన్నా.. ఆది నిష్టూరం మేలు’ అని పెద్దల మాట. ఎవరైనా పూచీకత్తు ఇవ్వమని అడిగినప్పుడు మీ ఆర్థిక పరిస్థితి వారికి వివరించండి. హామీ ఇవ్వలేనని నిర్మొహ
మాటంగా చెప్పేయండి. అవతలి వ్యక్తి మెహర్బానీ కోసం సంతకం చేస్తే సమస్యలు కొనితెచ్చుకున్నట్టే!
✓ స్నేహితులు అన్నాక ఒకరికొకరు ఆ మాత్రం సాయం చేసుకోలేరా అనుకోవచ్చు. అంతగా కావలసినవాడు అయితే, ఉన్నదాంట్లో లక్షో, రెండు లక్షలో అప్పుగా ఇవ్వండి. వాయిదాల పద్ధతిలో తిరిగి చెల్లించమని చెప్పండి.
✓ ‘గ్యారెంటీ ఇవ్వకపోతే మిత్రత్వం, బంధుత్వం దెబ్బతినవచ్చు’ అని భయపడుతున్నారా? ఆర్థికాంశాలే ప్రధానంగా భావించే వ్యక్తులు ఇలాగైనా మీకు దూరమవడం మంచిదే కదా!
✓ హామీ ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడితే.. ఆ అప్పు మీదిగా భావించి సంతకం పెట్టండి. రుణం తీరే వరకు మీరు, మీ కుటుంబం ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నారన్న సంగతి విస్మరించవద్దు.
– ఎం. రాం ప్రసాద్, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్
ram@rpwealth.in, www.rpwealth.in
Read More :
“Want to Buy A Car | ఈ కారణాలతో కారు కొనాలని అనుకుంటున్నారా? అయితే ఇంకోసారి ఆలోచించండి”
అప్పులు తీర్చడానికి కొత్త అప్పులు చేస్తున్నారా.. అయితే ఇలా బయటపడండి
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026 సూపర్ స్ట్రయికర్.. కొత్త కారు అందుకున్న వైభవ్ సూర్యవంశీ
Sharwanand | శర్వానంద్ ‘భోగి’ మళ్లీ వాయిదా పడనుందా .. ఇంకా క్లారిటీ ఇవ్వని మేకర్స్!
Gas cylinder | మేడ్చల్‌లో పేలిన గ్యాస్ సిలిండర్ .. తృటి తప్పిన పెను ప్రమాదం
Katrina Kaif | దీపావళికి కత్రినా కైఫ్ స్పెషల్ గిఫ్ట్.. తొలిసారి కొడుకు విహాన్ ఫొటో షేర్ చేసిన స్టార్ కపుల్!
Road accident | గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. రైలింగ్‌ను ఢీకొట్టిన కారు, ఐదుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

