Prepaying Home Loan | హోమ్ లోన్ ముందస్తుగా కట్టిస్తే లాభమా? నష్టమా?
Prepaying Home Loan | గృహప్రవేశం చేసిన రోజు నుంచే హోమ్ లోన్ వీలైనంత త్వరగా తీర్చేయాలని ఆరాటపడుతుంటారు. 25 ఏండ్లు వాయిదాలు కడుతూ పోతే తీసుకున్న లోన్‌పై రెండింతలు కట్టాల్సి వస్తుందని లెక్కలు వేసుకుంటారు
Prepaying Home Loan | సుధాకర్, ప్రభాకర్ ఇద్దరూ సహోద్యోగులు. ఇద్దరి వయసూ 35 ఏండ్లు. ఇద్దరి జీతాలూ సుమారు రూ.70 వేలు. ఇద్దరూ ఒకే అపార్ట్మెంట్లో ఎదురెదురు ఫ్లాట్లు తీసుకున్నారు. ఒకే ముహూర్తానికి గృహప్రవేశం చేసుకున్నారు. హోమ్ లోన్ వీలైనంత త్వరగా తీర్చేయాలని నిశ్చయించుకున్నాడు సుధాకర్. ప్రతినెలా వాయిదాలు కడితే చాలు అనుకున్నాడు ప్రభాకర్. అయితే, ఈ కథ చదివాక గృహ రుణం ముందస్తుగా తీర్చాలో, వద్దో అర్థమవుతుంది.
సుధాకర్, ప్రభాకర్ ఇద్దరి ఫ్లాట్ల విలువ కూడా రూ.40 లక్షలు. రూ.10 లక్షలు బయానా ఇచ్చారు. 25 సంవత్సరాల కాల పరిమితితో బ్యాంక్ నుంచి రూ.30 లక్షలు గృహ రుణం తీసుకున్నారు. 7.5 శాతం వడ్డీతో నెల వాయిదా రూ.22,169గా తేలింది. సుధాకర్ లెక్కలు వేసుకున్నాడు. పాతికేండ్లపాటు వాయిదాలు చెల్లిస్తూ పోతే దాదాపు రూ.66,50,700 చెల్లిస్తున్నట్టుగా తేలింది. రూ.30 లక్షల రుణానికి రూ.36 లక్షలు అదనంగా కడుతున్నానని కంగారుపడ్డాడు. పదేండ్లలో బాకీ మొత్తం కట్టేయాలని నిశ్చయించుకున్నాడు. అప్పుడు నెలకు వాయిదా రూ.35,610గా తేలింది. పదేండ్లలో రూ.42,73,200 కట్టాడు. కేవలం రూ.12,73,200 మాత్రమే వడ్డీ కట్టానని సంతోషించాడు సుధాకర్. అదే సమయంలో ప్రభాకర్ గృహరుణానికి నెలవారీ వాయిదా రూ.22,169 పోనూ రూ.14,400 లార్జ్‌క్యాప్ మ్యూచువల్ ఫండ్‌లో ప్రతి నెలా ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టాడు. పదేండ్ల తర్వాత, సుధాకర్ ఇంటి లోన్ తీరేనాటికి ప్రభాకర్ మ్యూచువల్ ఫండ్ ద్వారా రూ.35,00,000 రిటర్న్ వచ్చింది. అప్పటికి ఆయన గృహరుణ బకాయి రూ.23,91,000. మ్యూచువల్ ఫండ్ రాబడి నుంచి ఇంటి లోన్ పూర్తిగా కట్టేసిన తర్వాత ప్రభాకర్ దగ్గర రూ.11 లక్షలు నికరంగా మిగిలాయి.
ఉద్యోగం పోతే..
వీరిద్దరి విషయంలోనే మరో కోణం చూద్దాం. ఏడేండ్ల తర్వాత ఇద్దరూ పనిచేస్తున్న సంస్థ మూతపడింది. సుధాకర్, ప్రభాకర్ ఉద్యోగాలు కోల్పోయారు. ఇంటి లోన్ త్వరగా తీర్చేయాలని పొదుపు మంత్రం పక్కనపెట్టి బ్యాంక్‌కు అధిక మొత్తంలో వాయిదాలు చెల్లిస్తూ వచ్చాడు సుధాకర్. అదే ఏడేండ్ల తర్వాత ప్రభాకర్ మ్యూచువల్ ఫండ్‌లో రూ.19.5 లక్షలు ఉన్నాయి. ఆ మొత్తాన్ని నెలకు రూ.60 వేల చొప్పున వాడుకున్నా 32 నెలలు ఏ ఒత్తిడీ లేకుండా రోజులు గడిచిపోతాయి. ఈలోపుగా మరో ఉద్యోగం సాధించడం పెద్ద కష్టమేమీ కాదు! సుధాకర్ మాత్రం ఇల్లు గడవడానికి, బ్యాంక్ రుణం తీర్చడానికి బయట అధిక వడ్డీలకు రుణాలు తీసుకోవాల్సి వచ్చింది. ఒత్తిడి పెరిగింది. ఆ ప్రభావం ఆరోగ్యంపైనా పడింది.
మంచి అప్పు..
ఈ ఇద్దరి మిత్రుల కథ.. విలువైన ఆర్థిక పాఠం. సాధారణంగా మధ్యతరగతి ఉద్యోగులు రుణబాధలు ఉండకూడదని భావిస్తూ ఉంటారు. గృహప్రవేశం చేసిన రోజు నుంచే హోమ్ లోన్ వీలైనంత త్వరగా తీర్చేయాలని ఆరాటపడుతుంటారు. 25 ఏండ్లు వాయిదాలు కడుతూ పోతే తీసుకున్న లోన్‌పై రెండింతలు కట్టాల్సి వస్తుందని లెక్కలు వేసుకుంటారు. ఆ చిక్కుల్లోంచి త్వరగా బయటపడాలని వాయిదాతోపాటు అదనంగా డబ్బులు చెల్లిస్తూ ఉంటారు. కానీ, గృహరుణాన్ని మంచి అప్పుగా పరిగణించాలి. హోమ్ లోన్‌పై వడ్డీరేటు 7 నుంచి 8.5 శాతం కన్నా మించదు. పైగా, ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు కూడా లభిస్తుంది. దానిని పరిగణనలోకి తీసుకుంటే ఇంటి రుణంపై వడ్డీ 5.5 శాతం నుంచి 6 శాతం దాటదు. ఇంత తక్కువ వడ్డీకి మరెక్కడా అప్పు దొరకదు. అలాంటి రుణాన్ని త్వరగా తీర్చడం అంటే, ఆర్థిక విధానాలను సరిగ్గా అర్థం చేసుకోకపోవడమే అవుతుంది. మంచి అప్పును వీలైనంత ఎక్కువ కాలం కట్టడం వల్ల ప్రభాకర్ పొందిన ప్రయోజనం మనమూ పొందొచ్చు.

నగదు రూపంలో..
ఆస్తులు కొనుగోలు చేయడం తప్పుకాదు. స్థిరాస్తులు అవసరానికి అమ్మాలంటే అనుకున్నంత డిమాండ్ ఉండకపోవచ్చు. అందుకే కొంత ఆస్తి లిక్విడ్ అసెట్ (నగదు రూపంలో) ఉండటం మంచిది. మ్యూచువల్ ఫండ్స్ ఈ రకమే! ఆదాయాన్ని ఇచ్చే స్థిరాస్తులు కూడా మంచివే! కానీ, అలాంటి ఆస్తులను వాయిదాల రూపంలో కొనుగోలు చేయడం సాధ్యపడకపోవచ్చు. అలాంటప్పుడు ఎస్ఐపీ వైపు మొగ్గుచూపడం ఉత్తమం. అవకాశం ఉంటే, ఆదాయం పెరిగే కొద్దీ, ఎస్ఐపీ వాయిదా మొత్తం పెంచడం ద్వారా మరింత లాభం పొందవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో మీకు ఉన్నంత మొత్తం తీసుకోవచ్చు. ఆ డబ్బు మూడు రోజుల్లో మీ బ్యాంక్ ఖాతాలో జమవుతుంది. నగదు రూప ఆస్తిగా బంగారం కూడా కొనొచ్చు. అయితే, బంగారాన్ని చాలామంది సెంటిమెంట్‌గా భావిస్తారు. అవసరం వచ్చినప్పుడు అమ్మడం కన్నా, కుదువ పెట్టడానికే ప్రాధాన్యం ఇస్తారు. అప్పుడు ఇన్నాళ్లూ పోగు చేసిన ఆస్తి మీద వడ్డీ భారం తప్పదు!!
గడిచిన పదేండ్ల లెక్కలు చూస్తే మ్యూచువల్ ఫండ్స్ సరాసరి రిటర్న్ 13.40 శాతంగా ఉంది. హెచ్చుతగ్గులు ఉన్నా.. సరాసరి 13.50 శాతంగా ఉండవచ్చు. మన పెట్టుబడికి మంచి రాబడి వస్తుంది. ఎస్బీఐ బ్లూచిప్ ఫండ్, యాక్సిస్ బ్లూచిప్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ బ్లూచిప్, నిప్పాన్ ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడి ఉంటుందని గత అనుభవాలు చెబుతున్నాయి.
– ఎం. రాం ప్రసాద్, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్
ram@rpwealth.in, www.rpwealth.in
Read More :
Home Loan EMI | ఇంటి రుణ వాయిదాలు పే చేయకుంటే ఇవీ ఇబ్బందులు!”
“Home Loan | హోమ్ లోన్ తీసుకున్నాక మరణిస్తే.. ఆ అప్పు ఎవరు కట్టాలి?”
“జీవిత బీమా ఎందుకు తీసుకోవాలి? టర్మ్ పాలసీ ప్రీమియం ఎలా సెట్ చేసుకోవాలి?”
“Health Insurance | హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు వీటి గురించి తెలుసుకోవడం చాలా అవసరం”
“Personal Finance Tips | స్మార్ట్‌గా ఖర్చు.. సొమ్ము ఆదాకు ఈ టిప్స్ పాటిస్తే సరి!”
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

