Home Loan EMI | ఇంటి రుణ వాయిదాలు పే చేయకుంటే ఇవీ ఇబ్బందులు!
Home Loan EMI | వరుసగా మూడు నెల రుణ వాయిదాలు చెల్లించకుంటే మేజర్ డిఫాల్ట్ గా బ్యాంకులు పరిగణిస్తాయి. క్రెడిట్ స్కోర్ పడిపోతుంది.
Home Loan EMI | సొంతిల్లు ప్రతి ఒక్కరి జీవితకాల ఆకాంక్ష.. ప్రతిదీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో ఇప్పుడు బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో రుణాలు తీసుకుంటేనే సొంతింటి కల నిజం చేసుకోగలం. అయితే, మన ఆదాయాన్ని బట్టే బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఇండ్ల రుణాలిస్తుంటాయి. దాదాపు 15 ఏళ్ల నుంచి 20 ఏండ్ల పాటు సుదీర్ఘ కాలం నెలవారీ వాయిదాలు చెల్లించాల్సి ఉంటుంది. రుణ వాయిదాలు చెల్లించడానికి ఆరు నెలలకు సరిపడా ఎమర్జెన్సీ ఫండ్ సిద్ధంగా ఉంచుకోవాలి. ఒక్క నెల వాయిదా చెల్లించకపోయినా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయి. ఒక్కోసారి ఆదాయ వనరులు ఉండకపోవచ్చు. అప్పుడు రుణం చెల్లించడం కష్ట సాధ్యంగా మారుతుంది. కానీ, ఇండ్ల రుణాలు చెల్లించకపోతే మాత్రం భవిష్యత్‌లోనూ, ప్రస్తుత ఆర్థిక వ్యవహారాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు.
భవిష్యత్‌లో ఏ రుణం తీసుకోవాలనుకున్నా.. కష్ట సాధ్యంగా మారుతుంది. సిబిల్ స్కోర్ మీద ప్రతికూల ప్రభావం పడుతుంది. అదే జరిగితే రుణ యోగ్యత దెబ్బ తింటుంది. అప్పు దొరకడం కష్ట సాధ్యంగా మారుతుంది. వరుసగా మూడు నెలవారీ రుణవాయిదాలు చెల్లించకపోతే పలు పర్యవసానాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అవేంటో ఓ లుక్కేద్దామా..
తొలి వాయిదా పే చేయకపోతే ఇలా
తొలిసారి.. నెలసరి రుణ వాయిదా (ఈఎంఐ) చెల్లించకపోతే సంబంధిత బ్యాంకు మిమ్మల్ని ఎస్సెమ్మెస్, ఈ-మెయిల్ ద్వారా సమాచారం ఇస్తుంది. మీ వెసులుబాటును బట్టి ఆన్ లైన్లో చెల్లించడానికి అవసరమైన లింక్ కూడా పంపుతుంది. ప్రతి నెలా చెల్లించాల్సిన ఈఎంఐతోపాటు బకాయి మొత్తం రుణంపై 1-2 శాతం ఫైన్ కూడా బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు వసూలు చేస్తాయి. ఒక నెలసరి వాయిదా చెల్లించాకే మీ రుణ ఖాతాను పునరుద్ధరిస్తారు.
మలి ఈఎంఐ పే చేయకుంటే వార్నింగ్
వరుసగా రెండో నెలలోనూ వాయిదా చెల్లించకపోతే బ్యాంకు మీకు హెచ్చరికలు జారీ చేస్తుంది. లేట్ పేమెంట్‌తోపాటు నెలవారీ వాయిదాల (ఈఎంఐల) మొత్తం వెంటనే చెల్లించాలని కోరుతుంది. అయితే, మీ ఆర్థిక పరిస్థితిని బట్టి ఈ చెల్లింపునకు కొంత టైం ఇచ్చే అవకాశం ఉంది. మూడో నెలలోనూ వాయిదా చెల్లించలేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కఠినమైన హెచ్చరికలు జారీ చేస్తుంది. అక్కడిదాకా వెళ్లొద్దనుకుంటే.. అప్పటి వరకు ఉన్న బకాయిలు మొత్తం చెల్లించాలని సూచిస్తుంది.
మూడు వాయిదాలు చెల్లించకుంటే ఇదీ పరిస్థితి
వరుసగా మూడు నెలవాయిదాలు చెల్లించకపోతే మీ రుణాన్ని బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ.. మేజర్ డిఫాల్ట్‌గా నిర్ణయిస్తుంది. అప్పటికీ మీకు హెచ్చరికలు జారీ అవుతూనే ఉంటాయి. బకాయిలను పూర్తిగా చెల్లించడానికి మూడు నెలల టైం ఉంటుంది. ఆ టైం దాటేలోపు గానీ, తర్వాత గానీ చెల్లించకపోతే సంబంధిత బ్యాంకు లేదా ఆర్థిక సంస్థలు.. మీ ఇంటిని వేలం ద్వారా ఇతరులకు విక్రయించి రుణం వసూలు ప్రక్రియ ప్రారంభిస్తాయి.
మొండి బకాయి జాబితాలో మీ రుణం
అయితే, ముందుగా మీకు బకాయిలు చెల్లించాలని బ్యాంకులు నోటీసులు పంపుతాయి. మూడు వాయిదాల డిఫాల్ట్.. అటుపై మూడు నెలల గడువు తర్వాత చెల్లించకపోతే మీరు తీసుకున్న రుణాన్ని మొండి బకాయిల జాబితాలో చేరుస్తాయి బ్యాంకులు. మీరు తీసుకున్న ఇతర రుణాలనూ మొండి బాకీలుగా వర్గీకరిస్తాయి.
క్రెడిట్ స్కోర్‌పై రిమార్క్
మీరు మూడు నెల రుణ వాయిదాలు (ఈఎంఐ) వరుసగా చెల్లించలేకపోతే మేజర్ డిఫాల్ట్ కింద మీ రుణం మారుతుంది. అదే జరిగితే మీ క్రెడిట్ స్కోర్ మీద తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుంది. క్రెడిట్ స్కోర్‌పై డిఫాల్టర్ లేదా ఎగవేత దారు అనే రిమార్క్ స్పష్టంగా కనిపిస్తుంది. అలా ఎగవేతదారు అనే రిమార్క్ వస్తే.. భవిష్యత్‌లో రుణం తీసుకోవడం కష్టతరంగా మారుతుందని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు. క్రెడిట్ స్కోర్ పడిపోతుంది. ఈ క్రెడిట్ స్కోర్ ఆధారంగా రుణాలిచ్చే బ్యాంకులు.. అది తగ్గితే.. రుణాలపై ఎక్కువ వడ్డీ వసూలు చేస్తాయి.
ఇబ్బందులుంటే ఆల్టర్నేటివ్ మార్గాలు ఎంచుకోవాలి
తీసుకున్న ఇంటి రుణం చెల్లించడానికే ప్రతి ఒక్కరూ ప్రాధాన్యం ఇస్తారు. తీవ్ర ఇబ్బందుల్లో చిక్కుకుని మీరు ఈఎంఐలు చెల్లించలేకపోతే వెంటనే బ్యాంకు అధికారులతో సంప్రదించి రుణ టెన్యూర్ పెంచాలని అభ్యర్థించడం ఉత్తమంగా ఉంటుంది. దీనివల్ల ఈఎంఐ భారం తగ్గుతుంది. అటుపై మీ రుణ చెల్లింపునకు అవసరమైన నిధులను సమీకరించుకోవడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి. బంధు మిత్రుల నుంచి చేబదుళ్లతో ఈఎంఐలు చెల్లించే అవకాశాన్ని ఉపయోగించుకోవాలి.
బ్యాంకు అధికారులతో సంప్రదిస్తే ఇలా మేలు
ఇతర పెట్టుబడి పథకాల్లో నగదు విత్ డ్రా చేసుకునే అంశాలు పరిశీలించాలి. అప్పటికీ కష్టాలు తీరకపోతే ఇతర ఆస్తులు రెంట్ లేదా లీజ్.. లేదా విక్రయించడమో చేయాలి. ఏ ప్రత్యామ్నాయం లేకపోతే మీరు కొన్న ఇంటినే అమ్మి రుణం చెల్లించాలి. విపత్కర పరిస్థితులు తలెత్తినప్పుడు బ్యాంకు అధికారులతో చర్చించి ఆల్టర్నేటివ్ మార్గాలు ఎంచుకుంటే మంచిదని ఆర్థిక వేత్తలు సూచిస్తున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- banks
- cibil score
- emi
- home loan
RELATED ARTICLES
తాజా వార్తలు
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

