Personal Finance Tips | స్మార్ట్‌గా ఖర్చు.. సొమ్ము ఆదాకు ఈ టిప్స్ పాటిస్తే సరి!
Personal Finance Tips | ప్లాన్ప్రకారం కొన్ని సూత్రాలు పాటిస్తే దీర్ఘకాలిక లక్ష్యాల సాధనకు సొమ్ము ఆదా చేయొచ్చు.
Personal Finance Tips | విద్యాభ్యాసం పూర్తయి ఉద్యోగంలో చేరే ప్రతి ఒక్కరూ తమ ఆదాయంలో నిర్దిష్ట మొత్తం పొదుపు చేయడం అలవాటు చేసుకోవాలి.. కాదు కాదు అలా పొదుపు చేయడం మీ జీవితంలో భాగం కావాలి. మన సంపాదన ఎంత అనేదానికంటే ఎంత మొత్తం పొదుపు చేస్తున్నామనేదే ముఖ్యం. కొంత మంది ఎక్కువ ఆదాయం పొందుతున్నా.. సొమ్ము పొదుపు చేయడంలో ఫెయిలవుతుంటారు. ఖర్చుల నిర్వహణ, ఆర్థిక నియంత్రణ సరిగ్గా ఉండక.. డబ్బు కూడబెట్టలేక అప్పుల పాలవుతుంటారు. కనుక మన సంపాదన తక్కువైనా ఖర్చులు తగ్గించుకోవాలి.. ఎక్కువ మొత్తం ఆదా చేస్తే సరైన ఆర్థిక ప్రణాళికతో దీర్ఘ కాలిక లక్ష్యాలను సాధించుకోవడానికి అవసరమైన సంపద సిద్ధం అవుతుంది. ఇందుకు నెలవారీ పొదుపు, పెట్టుబడి సూత్రాలు పాటించడమే కాదు.. రోజువారీ ఖర్చుల నుంచి డబ్బు ఆదా చేయడం ఎలాగో తెలుసుకోవాలి.
పొదుపు అలవాటుగా మార్చుకుంటే సరి
ఆదాయం తక్కువగా ఉన్నా వీలైన త్వరగా పొదుపు మొదలు పెడితే.. దాన్ని అలవాటుగా మార్చుకోవచ్చు. భవిష్యత్‌లో మీ ఆదాయం పెరిగినా అనవసర ఖర్చులు చేయకుండా పొదుపు చేయడానికి ప్రోత్సహిస్తుంది. దాదాపుగా ప్రతి ఒక్కరూ ప్రతి నెలా తమకొచ్చే ఆదాయంలో ఖర్చులు పోగా మిగిలిన మొత్తం మాత్రమే పొదుపు చేస్తారు. దీనివల్ల పద్దతి.. ప్రణాళిక ప్రకారం పొదుపు విధానం దెబ్బ తింటుంది. అలా కాకుండా మీ సంపాదనలో అనుకున్న ప్లాన్ ప్రకారం ప్రతి నెలా పొదుపు చేసే మొత్తాన్ని పక్కన బెట్టాలి. మిగతా మొత్తంలోనే ఖర్చులన్నీ సర్దుబాటు చేసుకోవాలి. కనుక ప్రతి ఒక్కరూ ఆదాయంలో పొదుపు ప్లస్ ఖర్చులు అనే సూత్రం పాటించాలి సుమా..
నిరుపయోగ ఖాతాలు క్లోజ్ చేసేయడం బెటర్
ప్రతి ఒక్కరికి ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉంటాయి. వాటి స్టేట్మెంట్లను ప్రతి నెలా క్షుణ్ణంగా పరిశీలిస్తే.. ఆయా బ్యాంకులు వసూలు చేసే చార్జీలు తెలుసుకోవచ్చు. మినిమం సేవింగ్స్ ఖాతా నిర్వహణ డిపాజిట్ సొమ్ము ఉండేలా చెక్ చేసుకోవాలి. అయినా బ్యాంకులు ఇతర చార్జీలు విధిస్తూ ఉంటే, అలా పునరావృతం కాకుండా తదుపరి చర్యలు తీసుకోవాలి. నిరుపయోగంగా ఉండే బ్యాంకు ఖాతాలను క్లోజ్ చేయడం బెటర్ అనే అభిప్రాయం వినిపిస్తున్నది.
కుటుంబానికి ఆరోగ్య బీమా తప్పనిసరి
మీ కుటుంబంలో మీ ఆదాయంపైనే ఆధారపడి ఉన్న సభ్యులు ఉంటే.. తగిన కవరేజీతోకూడిన బీమా పాలసీ తప్పనిసరి తీసుకోవాలి. కరోనా తర్వాత ప్రతి ఒక్కరికీ కవరేజీ వచ్చేలా ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల మున్ముందు అనారోగ్య సమస్యలు తలెత్తినా కూడా, కుటుంబ దీర్ఘ కాలిక లక్ష్యాలు చెదరకుండా.. పొదుపు చర్యల నుంచి దారి మళ్లకుండా చూసుకోవచ్చు.
క్రెడిట్‌కార్డు వాడకంలో జాగ్రత వహించాలి
మధ్య తరగతి ఉద్యోగులకు వచ్చే ఆదాయం తక్కువగా ఉంటుంది. కనుక తమ అవసరాలను తీర్చుకోవడానికి క్రెడిట్ కార్డు వాడుతుంటారు. ఆ క్రెడిట్ కార్డు బిల్లు టైం ప్రకారం చెల్లించాలి. అలా కాకుండా కొందరు కనీస బ్యాలెన్స్ మాత్రమే పే చేస్తారు. ఇలా చేయడం వల్ల ప్రతి నెలా చార్జీలు, పెనాల్టీరూపంలో ఎక్కువ మొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది. దాదాపు అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డులపై 40%, అంతకంటే ఎక్కువ వార్షిక వడ్డీ చెల్లించాలి. ఇది మీ పొదుపు, ఇన్వెస్ట్మెంట్ మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. క్రెడిట్ స్కోర్‌పై ప్రతికూల ప్రభావం పడుతుంది. అంటే క్రెడిట్ స్కోర్ పడిపోతుంది. ఇది భవిష్యత్‌లో రుణ పరపతి అవకాశాలు సన్నగిల్లుతాయి. కనుక అధిక ఖర్చుల నివారణకు క్రెడిట్ కార్డు బిల్లులు సకాలంలో చెల్లించేయాలి.
హోంలోన్‌లో ఎక్కువ ఈఎంఐలతో ఇలా తేలిక
ప్రతి ఒక్కరూ సొంతిల్లు కావాలని కోరుకుంటారు. కానీ భారీగా పెట్టుబడి పెడితే తప్ప.. ఆ కల సాకారం కాదు.. ఆదాయాన్ని బట్టి బ్యాంకులో హోంలోన్ తీసుకుంటే వీలవుతుంది. అలా హోంలోన్ తీసుకున్న వారిలో చాలా మంది గడువు పెంచుకుని నెలసరి వాయిదా (ఈఎంఐ) తగ్గిస్తారు. దీనివల్ల తక్కువ ఈఎంఐ చెల్లించొచ్చనుకుంటారే తప్ప గడువు పెరిగినా కొద్దీ వడ్డీ కూడా పెరుగుతుంది. ఒకవేళ ఇప్పటికే ఇంటి రుణం తీసుకుంటే.. ఇతరఖర్చులు తగ్గించుకుని నెలసరి వాయిదా చెల్లింపుల మొత్తం పెంచడానికి ప్రయత్నించాలి. ఇలా చేస్తే వడ్డీ తగ్గి.. పెట్టుకున్న గడువు కంటే ముందే హోంలోన్ చెల్లింపులు పూర్తి చేయొచ్చు.
అన్నీ డిజిటల్ పేమెంట్స్ బెటర్
పాత పెద్దనోట్ల రద్దు.. కరోనా తర్వాత డిజిటల్ పేమెంట్స్ పెరిగాయి. దాదాపు ఆన్లైన్లోనే లావాదేవీలు పూర్తి చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. షాపింగ్‌తోపాటు ఇంటి అవసరాలు, ఇతర బిల్లుల పేమెంట్స్ ఆన్లైన్లో చేయడం వల్ల టైంతోపాటు డబ్బు కూడా ఆదా చేయొచ్చు. అలాగే జీవిత బీమా పాలసీ కొనుగోలు చేయడం మొదలు ప్రీమియం చెల్లింపులూ ఆన్లైన్లోనే చేసేస్తే కొంత ఖర్చు తగ్గుతుంది. ఆఫ్‌లైన్‌తో పోలిస్తే ఆన్లైన్లో టర్మ్ ప్లాన్ బీమా పాలసీ కొనుగోలు చేయడంతో 25 శాతం ప్రీమియం తగ్గించుకునే అవకాశాలు ఉన్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

