Road Accident Sign Board | మీరు హైవే మీద వాయువేగంతో దూసుకువెళ్తున్నారు. అదే సమయంలో ఓ మలుపు దగ్గర ‘ఈ ఏడాది ఇప్పటివరకూ ఇక్కడ 183 ప్రమాదాలు జరిగాయి… 50 మంది చనిపోయారు’ అన్న బోర్డు కనిపిస్తే, ఆ ప్రభావం ఎలా ఉంటుంది? ఇలాంటి ప్రకటనలతో వాహన చోదకులు మరింత జాగ్రత్తగా ఉంటారన్నది అధికారుల నమ్మకం. కానీ ఇది నిజం కాదని ఓ పరిశోధన నిరూపిస్తున్నది.
టెక్సాస్‌లో సేకరించిన గణాంకాలతో… ఈ తరహా ప్రకటన వల్ల అక్కడి రహదారి మీద ప్రమాదాలు 5 శాతం పెరిగాయనీ, వాహనాల సగటు వేగం పెరిగిందనీ తేలింది. నిజానికి హైవే మీద వెళ్లేవారు చాలా ఏకాగ్రతతో వాహనం నడపాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో వాళ్ల దృష్టిని మళ్లించే ఈ ప్రకటన కనిపిస్తే, పైగా అందులోని భావం భయపెడితే… కచ్చితంగా వారి నిర్ణయ సామర్థ్యం మీద ప్రతికూల ప్రభావం పడుతుంది. అది మరిన్ని ప్రమాదాలకు దారితీస్తుంది. కాబట్టి మరీ ప్రమాదం జరిగే చోట, భయపెట్టే తీరులో హెచ్చరికలు చేయడం అంత మంచిది కాదని అంటున్నారు.
Diabetes | ఇలా చేస్తే డయాబెటిస్ తగ్గిపోతుందట !!
నేను ప్రేమించిన వాడికి అబ్బాయిలంటేనే ఇష్టం.. అతన్ని అసలైన మగాడిగా ఎలా చేయాలి?
ఆస్తమాకు వ్యాక్సిన్ ఉందా? చేపమందుతో ఉబ్బసం పోతుందా?