ఆస్తమాకు వ్యాక్సిన్ ఉందా? చేపమందుతో ఉబ్బసం పోతుందా?
World Asthma Day | ఆస్తమా… తీవ్రమైన దగ్గు, జలుబుతో ఊపిరాడనివ్వకుండా ఇబ్బంది పెట్టే వ్యాధి. ఆధునిక జీవన శైలి, వాయు కాలుష్యం కారణంగా ఆస్తమా కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ దీని బారిన పడుతున్నారు. ప్రపంచ జనాభాలో సుమారు 30 కోట్లకు పైగా జనాభా ఆస్తమాతో బాధపడుతున్నారు. మన దేశ జనాభాలో 3 శాతానికి పైగా పెద్దలు, 6 శాతానికి పైగా పిల్లలు ఆస్తమా వ్యాధితో బాధపడుతున్నారని వైద్య నివేదికలు చెబుతున్నాయి. అయితే ముందుగానే మేల్కొని తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఆస్తమాను పూర్తిగా తగ్గించవచ్చని అంటున్నారు వైద్య నిపుణులు. ప్రపంచ అస్తమా నివారణ దినోత్సవం సందర్భంగా రెనోవా హాస్పిటల్స్ (కొంపల్లి) కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ అండ్ స్లీప్ స్పెషలిస్ట్ డాక్టర్ బి మురళీమోహన్ చెప్పిన పలు సూచనలు..
ఊపిరితిత్తుల్లో సమస్య
ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో పెరుగుతున్న కాలుష్యం, పట్టణీకరణ వంటి అనేక అంశాలు ఆస్తమా బారినపడటానికి కారణం అమవుతున్నాయి. ఆస్తమా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి. దీని బారినపడిన వారిలో ఛాతి బిగుతుకావడంతోపాటు ఊపిరితిత్తులు మూసుకుపోతాయి. దీంతో తీవ్రమైన దగ్గు, శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. ఈ వ్యాధి ఎక్కువగా శీతాకాలంలో ప్రభావం చూపుతుంది. ఆయాసం, దగ్గు వంటి లక్షణాలతో ఇది ప్రారంభమవుతుంది. ఈ ఆస్తమా వ్యాధి వంశపారంపర్యంగా ఒకరి నుంచి మరొకరికి వచ్చే అవకాశం ఉన్నది.
ఆస్తమా రావడానికి గల కారణాలు
♦ వాతావరణంలో మార్పులు
♦ పొగ, దుమ్ముతో నిండిన పరికరాలు
♦ బాడీ స్ప్రేలు
♦ అగరబత్తీల పరిమళాలు
♦ దోమల నివారణకు వాడే కాయిల్స్
♦ పెంపుడు జంతువులు
♦ టపాసుల వల్ల వచ్చే పొగ
♦ పూల పుప్పొడి
ఆస్తమా లక్షణాలు
♦ ఆయాసము ప్రధాన లక్షణం
♦ పిల్లికూతలు, దగ్గు
♦ ఛాతి బరువుగా ఉండటం
♦ జలుబు, తుమ్ములు రావడం
♦ ముక్కు నుంచి నీరు రావడం
♦ జన్యు సంబంధిత కారణాలు
♦ చలి కాలంలో ఆయాసము ఎక్కువ
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
♦ ధూమపానానికి దూరంగా ఉండటం
♦ దుమ్ము, ధూళికి దూరంగా ఉండటం
♦ శీతల పానీయాలు, ఐస్‌క్రీమ్‌లు, ఫ్రిజ్ వాటర్ వంటి చల్లని పదార్థాలు తీసుకోకుండా ఉండటం
♦ ఇంట్లో బూజు దూలపడము వంటివి చేయకూడదు
♦ ఇన్హేలర్ (Inhalers) కలిగి ఉండటం చాలా ముఖ్యం
ఆయాసం లేనప్పుడు కూడా మందులు వాడాలా?
ఆస్తమా దీర్ఘకాలిక సమస్య. ఆయాసం అప్పుడప్పుడు వస్తూ తగ్గుతుండవచ్చు. కాలం గడిచేకొద్ది శ్వాసనాళాల్లో శాశ్వతమైన మార్పులు వస్తాయి. ఈ మార్పులను నిరోధించాలంటే క్రమం తప్పకుండా వైద్యులు సూచించిన విధంగా మందులు వాడుకోవాలి.
పిల్లల వయసు పెరిగే కొద్దీ ఆస్తమా తగ్గుతుందా?
ప్రతి ముగ్గురిలో ఇద్దరికి తగ్గే అవకాశము ఉంది. అయితే చిన్నతనంలో వచ్చే ఆస్తమా ఎటాక్‌లను నివారించడానికి, నయం చేయడానికి తగిన వైద్యం చేయించకుంటే పెద్ద అయిన తర్వాత కూడా ఈ సమస్య వెంటాడొచ్చు. కాబట్టి చిన్న వయసులో వచ్చే ఆస్తమాకు తప్పనిసరిగా వైద్యం చేయించుకోవాలి.
ఆస్తమా ఉన్న పిల్లలు సాధారణ జీవితం గడపగలరా? పెరుగుదల ఉంటుందా?
ఆస్తమా నియంత్రణలో ఉన్న పిల్లవాడు సాధారణమైన జీవితాన్ని గడుపుతున్నట్లే భావించాలి. పెరుగుదలలో కూడా ఏమి తేడా ఉండదు.
ఆస్తమా నయం కాదా?
ఆస్తమా ఒక ఇన్ఫ్లమేటరీ జబ్బు. ఇన్ఫ్లమేషన్ అనేది శరీరంలో ఒక్క సహజమైన రక్షణ గుణం. ఇది ఎక్కువ కావడం, తక్కువ కావడము ఉంటుంది. అంటే బాగా నియంత్రించవచ్చు.
ఆస్తమాకు వ్యాక్సిన్ ఉందా?
ఆస్తమాకు వ్యాక్సిన్ లేదు. కానీ ఫ్లూ వల్ల ఆస్తమా ఎక్కువ అవుతుంది. ముఖ్యంగా చిన్న పిల్లల్లో ఫ్లూ ఎక్కువగా వస్తుంది కాబట్టి ఫ్లూ వ్యాక్సిన్ వాడితే కాస్త ఉపశమనం ఉంటుంది.
యోగాతో ఆస్తమాకు తగ్గుతుందా ?
ఆస్తమాకు యోగా, ప్రాణాయామము మంచి వ్యాయామాలు. వృద్దులు, ఊబకాయం ఉన్నవాళ్లు, ఆస్తమా తొలి దశలో ఉన్న వ్యక్తులు బ్రీతింగ్ ఎక్సర్సైజులు, ప్రాణాయామం చేయడం వల్ల ఉపయోగం ఉంటుంది. శ్వాసను లోతుగా తీసుకొని దాన్ని పట్టి ఉంచడం, తర్వాత నెమ్మదిగా వదలడం వంటి ట్రిక్స్ ఆస్తమా ఎటాక్‌ను కొంతవరకు తగ్గిస్తాయి.
ఆస్తమా vs వ్యాయామం
ఆస్తమా ఉన్నవాళ్లు వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. నిజానికి వ్యాయామం వల్ల ఆస్తమా ఎటాక్స్ తగ్గుతాయి. వ్యాయామం వల్ల రక్తప్రసరణ పెరుగుతుంది. బరువు తగ్గుతారు. బరువు తగ్గే కొద్ది ఆస్తమా రిస్క్ తగ్గుతుంది. రక్త ప్రసరణ వల్ల అవయవాలు అన్నింటికీ ఆక్సిజన్ అంది శక్తిమంతంగా అవుతాయి. ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గుతాయి.
చేపమందుతో ఆస్తమా పోతుందా?
ఆస్తమాకీ, చేప మందుకీ సంబంధం లేదు. నిజానికి, కొంతమంది పేషెంట్లలో ఇలాంటి మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. అంతేగాక చేప మందుకు ఎటువంటి శాస్త్రీయత లేదు. దానితో ఆస్తమా పోతుందనుకోవడం అపోహ.
Read More :
ఆస్తమా ఉన్న మహిళలకు ఆ టైమ్ చాలా డేంజర్.. ప్రాణాలు కూడా పోవచ్చట!!”
“Asthma in children | ఆస్తమా ఉన్న పిల్లలకు కరోనా వస్తే ప్రమాదమే”
ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని కచ్చితంగా తినాల్సిందే!!”
asthma | ఆస్తమా ఎందుకు వస్తుంది? దీనికి ఇన్హేలర్ థెరపీ ఎంతవరకు పనిచేస్తుంది?”
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

