రాత్రిపూట సరిగ్గా కనిపించడం లేదా..? అయితే, ఇదే కారణం.. ఏం తినాలంటే?
మీకు రాత్రి కళ్లు సరిగ్గా కనిపించడం లేదా? మసక మసకగా ఉంటోందా? తరుచూ నోరు ఎండుకపోతున్నదా? ఏ పనిచేసినా కొద్దిసేపటికే అలసిపోతున్నారా? అయితే, మీకు విటమిన్ 'ఏ' లోపం ఉన్నట్లే. ఆకు కూరలు, టమోటాలు, సీతాఫలాలు, మామిడిపండ్లు, బీఫ్ కాలేయం, గుడ్లు, పాలు, చేప నూనెలు లాంటి ఆహారాల్లో ఈ విటమిన్ 'ఏ' ఉంటుంది. మాయో క్లినిక్ ప్రకారం, ఈ పోషకం దృష్టి, రోగనిరోధక శక్తి, పెరుగుదల, కణ విభజన, పునరుత్పత్తికి తోడ్పడుతుంది. ఇది యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది ఆక్సీకరణ ఒత్తిడిని విడుదల చేయడానికి, వాపు, దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది.
మీకు రాత్రి కళ్లు సరిగ్గా కనిపించడం లేదా? మసక మసకగా ఉంటోందా? తరుచూ నోరు ఎండుకపోతున్నదా? ఏ పనిచేసినా కొద్దిసేపటికే అలసిపోతున్నారా? అయితే, మీకు విటమిన్ ‘ఏ’ లోపం ఉన్నట్లే. ఆకు కూరలు, టమోటాలు, సీతాఫలాలు, మామిడిపండ్లు, బీఫ్ కాలేయం, గుడ్లు, పాలు, చేప నూనెలు లాంటి ఆహారాల్లో ఈ విటమిన్ ‘ఏ’ ఉంటుంది. మాయో క్లినిక్ ప్రకారం, ఈ పోషకం దృష్టి, రోగనిరోధక శక్తి, పెరుగుదల, కణ విభజన, పునరుత్పత్తికి తోడ్పడుతుంది. ఇది యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది ఆక్సీకరణ ఒత్తిడిని విడుదల చేయడానికి, వాపు, దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది.
విటమిన్ ‘ఏ’ లోపం ఉంటే కనిపించే లక్షణాలు!!
విటమిన్ ‘ఏ’ లోపం వల్ల దృష్టిలో మార్పులు కనిపిస్తాయి. ఈ లోపం చాలా తీవ్రంగా ఉంటే అది శాశ్వత అంధత్వానికి దారితీయవచ్చు. అంతకంటే ముందు ఈ కింది లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు చెబతున్నారు.
1. రాత్రిపూట మసకగా కనిపించడం
2. తరుచూ నోరు ఎండుకపోవడం
3. గోర్లు చిట్లిపోవడం
4. జుట్టు పొడిబారడం
5. చర్మపొడిబారడం, చర్మం దురద, చర్మం చిట్లిపోవడం
6. అలసట
7. డ్రై ఐస్
8.కళ్లలో పుండ్లు
9.అతిసారం
10.మూత్రాశయ అంటువ్యాధులు
11.యోని అంటువ్యాధులు
12. నోటిలో పుండ్లు
13. పెదవులు పొడిబారడం, పెదవులు పగలడం
14. గాయం మానడంలో ఆలస్యం
15. శ్వాసకోశ అంటువ్యాధులు
విటమిన్ ‘ఏ’ ఎందులో పుష్కలంగా ఉంటుందంటే?
1.పాల ఉత్పత్తులు
2.పాలకూర
3.కాలేయం
4.క్యారెట్లు
విటమిన్ ‘ఏ’ లోపం చాలా ఎక్కువగా ఉంటే నోటిద్వారా సప్లిమెంట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే, ఈ సప్లిమెంట్లలో యాంటీఆక్సిడెంట్లు ఉండకపోవచ్చు. మాయో క్లినిక్ ప్రకారం, వయోజన పురుషులు 900 మైక్రోగ్రాములు, మహిళలు 700 మైక్రోగ్రాముల విటమిన్ ‘ఏ’ సప్లిమెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. గర్భిణులు విటమి ‘ఏ’ సప్లిమెంట్ తీసుకునేముందు తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

