కాలేజీ ఫ్రెండ్స్ ట్రిప్ వెళ్లినా.. కొలీగ్స్‌తో అవుటింగ్ ప్లాన్ చేసినా… ఫ్యామిలీ ఫంక్షన్ అయినా.. ఫోన్‌తోపాటు.. సెల్ఫీ స్టిక్ కూడా ఉండాల్సిందే. ఈ క్రమంలో ఎక్కువగా అవసరం ఏర్పడేది షటర్ రిమోట్ కంట్రోల్‌తోనే. బ్లూటూత్‌తో ఫోన్‌కి కనెక్ట్ అయ్యి పనిచేసే ఈ రిమోట్‌ని కార్ కీలా ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. రిమోట్లో ఆండ్రాయిడ్ ఐఓఎస్‌లకు ప్రత్యేకంగా బటన్స్ ఉంటాయి. ఒక్కసారి ఫోన్ బ్లూటూత్‌కి కనెక్ట్ చేశాక ఫొటోలు, సెల్పీలు క్లిక్ మనిపించొచ్చు. పది మీటర్ల దూరం నుంచి కూడా రీమోట్ పనిచేస్తుంది. కెమెరా 360 యాప్‌తోనూ రిమోట్‌ని సింక్ చేసి వాడుకోవచ్చు. రిమోట్లోని బ్యాటరీ ఆదా చేసేందుకు ఆన్/ఆఫ్ స్విచ్ కూడా ఉంది.
ధర: రూ. 169
దొరికేచోటు: https://rb.gy/6esa05
వెదురుతో యూఎస్బీ హబ్.. అదిరే!!
టెక్ జనరేషన్‌కు ల్యాపీ, పీసీల్లో డీఫాల్ట్‌గా ఉండే యూఎస్బీ డ్రైవ్‌లు సరిపోవు. అందుకే కచ్చితంగా అదనపు యూఎస్బీ హబ్‌ల అవసరం వస్తుంది. అలాంటివాళ్లకు ఇదో చక్కని చాయిస్. చూస్తే ఇదేదో చెక్కముక్కలా ఉందే అనుకుంటున్నారా? ఎస్.. దీనిపేరు Bamboo 2-in-1 USB Hub with C Port. వెదురుతో హబ్‌ని రూపొందించారు. పర్యావరణ హితంగా దీన్ని తీర్చిదిద్దారు. రెండు యూఎస్బీ పోర్టులు, ఒక టైప్ పోర్టుతో హబ్ పనిచేస్తుంది. ప్రింటర్, ల్యాపీ, ఫోన్, ట్యాబ్లెట్లకు కనెక్ట్ చేసుకుని వాడుకోవచ్చు. దీంట్లో మరో ప్రత్యేకత ఉంది. అదేంటంటే… ఒక ఫోన్ నుంచి మరో ఫోన్‌కి దీంతో చార్జ్ చేసుకునే వీలుంది. అందుకు అనువుగానే హబ్‌లో ఉన్న కేబుల్‌ని డిజైన్ చేశారు. ఎలాంటి డ్రైవర్ టూల్స్ ఇన్ స్టాల్ చేయకుండా ‘ప్లగ్ అండ్ ప్లే’ మోడ్‌లో వాడుకోవచ్చు.
బ్లూటూత్ స్పీకర్లు, స్మార్ట్‌వాచ్, నెక్బ్యాండ్లను కూడా దీనిసాయంతో చార్జ్ చేసుకోవచ్చు.
ధర: రూ. 749
దొరికేచోటు: https://rb.gy/0mjkml
చిటికెలో సీల్ చేస్తుంది
ఇల్లాలి అవసరాలు అన్నీ.. ఇన్నీ కాదు. అందుకే ఎక్కడ ఏం దొరుకుతాయా? డిస్కౌంట్ ఉందా? ఎక్కడ ఆర్డర్ పెట్టొచ్చు?.. అంటూ నిత్యం అన్వేషిస్తుంటారు. అలాంటివారికే ఈ పోర్టబుల్ మినీ సీలింగ్ మెషిన్. దీన్ని చాలా యూజర్ ఫ్రెండ్లీగా వాడుకోవచ్చు. ఇంట్లో అవసరానికి కావాల్సిన వాటిని చక్కగా ప్యాక్ చేసుకుని దీంతో సీల్ చేసేయొచ్చు. ముఖ్యంగా స్నాక్స్‌ను గాలి తగలకుండా చక్కగా కవర్లలో ప్యాక్ చేయొచ్చు. ఒకవేళ మీరేదైనా చిన్నపాటి బిజినెస్ చేస్తున్నట్టయితే ప్యాకింగ్‌కి ఇదో చక్కని ఎంపిక. అంతేకాదు.. సీల్ చేసిన వాటిని కట్టర్‌లా కత్తిరించేస్తుంది కూడా. డివైజ్ పైన ఏర్పాటుచేసిన రెండు బటన్లతో సీలింగ్, కటింగ్ చేయొచ్చు. యూఎస్బీ పోర్ట్‌తో పరికరం చార్జ్ అవుతుంది. ఒక్కసారి చార్జ్ చేస్తే సుమారు వారంపాటు పనిచేస్తుంది. ఎక్కడికైనా తీసుకెళ్లడమేకాదు.. దీంట్లో ఉన్న అయస్కాంతంతో ఇనుముకు ఇట్టే అతుక్కుంటుంది. ఎక్కడైనా జారి పడిపోతుందేమో అనుకుంటే ఏ ఫ్రిడ్జ్కో అంటించేస్తే సరి. కాబట్టి, బయటి నుంచి తెచ్చుకున్న చిప్స్ ప్యాకెట్లో చిప్స్ మిగిలిపోతే ఎక్కడపెట్టాలా? అని ఆలోచించకుండా..
దీంతో రీసీల్ చేసేయండి.
ధర: రూ. 279 దొరికేచోటు: https://rb.gy/t1oo5t
స్మార్ట్ లాకర్లోభద్రం ఇలా!!
విలువైన వస్తువుల్ని భద్రంగా దాచుకోవడం మామూలే. ఇనుప బీరువాలు.. లాకర్లు.. సీక్రెట్ స్థావరాల్లో దాచిపెట్టడడం చూస్తుంటాం. కానీ, టెక్నాలజీని అందిపుచ్చుకున్న నేటితరం మాత్రం స్మార్ట్ లాకర్లను వాడేస్తున్నారు. ‘ఓజోన్’ లాకర్ అలాంటిదే. వై-ఫై, బయోమెట్రిక్, ఫింగర్‌ప్రింట్ సెక్యూరిటీతో వస్తువుల్ని భద్రంగా దాచిపెట్టొచ్చు. లాకర్‌పై కీప్యాడ్‌తో పాస్‌వర్డ్‌ని పెట్టుకునే వీలుంది. 30 ఫింగర్ప్రింట్స్ని రిజిస్టర్ చేయొచ్చు. ఎమర్జెన్సీ అవసరాలకు తాళాల్ని కూడా వాడొచ్చు. ఓజోన్ లైఫ్ మొబైల్ యాప్‌ని ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుని ఎక్కడినుంచి అయినా లాకర్ని ఆపరేట్ చేయొచ్చు. తాళం వేయడం మర్చిపోకుండా ‘లాక్ రిమైండర్’ని సెట్ చేసుకోవచ్చు. ఎవరైనా లాకర్ని బ్రేక్ చేయడానికి చూస్తే ‘టాంపర్ డిటెక్షన్’తో అలారం మోగుతుంది. అత్యంత సురక్షితంగా తయారుచేసిన ఈ లాకర్ బరువు 18 కిలోలు. రెండు అరల్లో ముఖ్యమైన డాక్యుమెంట్స్, బంగారం.. లాంటి విలువైన వస్తువుల్ని పెట్టి స్మార్ట్‌లాక్ చేయొచ్చు. లాకర్ వారంటీ రెండేళ్లు.
ధర: రూ. 6,288
దొరికేచోటు: https://rb.gy/wg0vr6