– ఎన్ రమేశ్, వికారాబాద్.
ఇవాళ ఇదొక ఫ్యాషన్ అయింది. ఇంటికి చాలాపెద్ద ద్వారాన్ని భారీగా పెట్టడం. కానీ, అది నోరు పెద్దగా.. కడుపు చిన్నగా అన్నట్టు అవుతుంది. ఇంటి ఎత్తును బట్టి ద్వారాల ఎత్తు నిర్ణయం అవుతుంది. ఆరు అడుగులు, ఏడున్నర అడుగులు, తొమ్మిది అడుగులు.. ఇలా ద్వారాలను పెడతారు. సాధారణంగా ‘ఆరు అడుగుల తొమ్మిది అంగుళాలు’ అందరూ పెట్టే ద్వారం కొలత. అలాగని.. అదే పాటించాలని కాదు. సింహద్వారం ఎత్తు నిర్ధారించాక.. ఇంట్లోని అన్ని ద్వారాలు దానితో సమానంగా ఉండాలి.
టాయిలెట్ ద్వారాలు కూడా! అంతేకానీ, అందంకోసం, ఆడంబరం కోసం ఒక్క ముఖద్వారం ఎత్తు మాత్రమే పెంచవద్దు. ఇంట్లో వాతావరణం సమతుల్యంగా ఉంచడంలో, క్రాస్ వెంటిలేషన్‌లో ద్వారాలు ప్రముఖ పాత్ర వహిస్తాయి. అయితే, ప్రతి ద్వారం వెడల్పు ఒకేవిధంగా ఉండాల్సిన అవసరం లేదు. దానిని ఆయా గదుల కొలతలను బట్టి మార్పు చేసుకోవచ్చు. అయితే, తూర్పు – ఉత్తరం ద్వారాలు మాత్రం పొడవు – వెడల్పు సమానంగానే ఉండాలి. ఇంటిని సంప్రదాయబద్ధంగా కట్టాలి. ప్రయోగాలు మంచివి కావు.
– డి. కిశోర్, ఉప్పల్.
కొత్తగా నిర్మించేవారు అన్నిటినీ శాస్ర్తానికి అనుగుణంగా నిర్మించడంలో తప్పులేదు కదా! ఆరోగ్యం – ఆనందం అన్ని వర్గాల వారికీ అవసరమే కదా! ఎవరైనా శాస్ర్తానుసారం ప్లాన్ చేసుకొనే కడతారు. అయితే.. మీరు ఇప్పటికే కట్టినవాటిని కూడా తప్పకుండా వాస్తుకు అనుగుణంగా మార్పులు చేయండి. అందరికీ ఉండబుద్ధి అవుతుంది.
ప్రధానంగా ఆ హోటల్ యాత్రికులకు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని పంచాలి అంటే.. చక్కని వెలుతురు వచ్చేలా తప్పకుండా ఒక బాల్కనీ ఉండేలా, గదులకు కుదిరించాలి. నిజానికి ఈ యాత్రా స్థలాలు ఎంతో ప్రశాంతతను అందిస్తాయి. కాబట్టి, వాస్తు పాటించడం వల్ల ఆయా నిర్మాణాల్లో మంచి వాతావరణం నెలకొంటుంది. అందులోకి దిగినవారు కోరుకునే ఆనందం, శాంతి అందిస్తాయి. అందుకనే.. తప్పకుండా వాస్తు ప్లాన్ చేసి కట్టండి. వ్యాపార అభివృద్ధి కూడా ఉంటుంది. స్థలం కోసం చీకటి గదులను కట్టవద్దు.
– సీహెచ్. ధనలక్ష్మి, కరీంనగర్.
వ్యాపారం అనగానే.. ‘దక్షిణం, పడమర ఉండాలి’ అనుకుంటారు చాలామంది. కానీ, అన్ని దిశలకూ వ్యాపారం చేయవచ్చు. దిశ కుదిరిన స్థలం దొరికితే.. ఉత్తరం – తూర్పు కూడా చాలాబాగా సాగే వ్యాపార కేంద్రాలు ఎన్నో ఉన్నాయి.. మన రాష్ట్రంలో. మీకున్న స్థలాన్నిబట్టి చక్కని పార్కింగ్ పెట్టుకొని, హోటల్ కట్టండి. వ్యాపార స్థలాలకు సెల్లార్లు తప్పకుండా అవసరం అవుతాయి.
సరైన పార్కింగ్ లేకపోతే.. ప్రభుత్వ అనుమతి కూడా దొరకదు. వీలున్న మేరకు సెల్లార్‌ను దక్షిణం రోడ్డు లేదా పడమర రోడ్డున్న స్థలాలకు మాత్రమే ఏర్పాటు చేసుకొని వ్యాపారం చేయండి. ఆ విధంగా ఆ దిశలు సెల్లార్లకు ఎంతో మేలుచేస్తాయి. మిగతా తూర్పు – ఉత్తరాలకు మాత్రం స్టిల్ట్ లేదా సెమీసెల్లార్ ప్లాన్ చేసి, హోటల్ నిర్మించండి.
– కె. భారతి, ఆత్మకూర్.
స్థలానికి నాలుగు మూలలు తెగినప్పుడు.. అది పెద్దస్థలం కాకపోతే ఇల్లు కట్టడం మానేయాలి. దానిని వ్యాపారానికి వాడుకోవాలి. దక్షిణం రోడ్డు ఉంది కాబట్టి, దక్షిణ – ఆగ్నేయం, పశ్చిమ – నైరుతి మూలలను వదిలి, సమంగా చేసుకున్నప్పుడు.. ఆ దిశకు స్థలం సమానంగా అవుతుంది.
అప్పుడు మూలలు కలుపుకొని, పెరిగిన దక్షిణం వదలాలి. అలాగే, ఉత్తరంవైపు పెరిగిన ఉత్తరం ముక్కను సమానంగా తెంపినట్లయితే.. ఆ స్థలం మొత్తం చతుర్భుజంగా మారుతుంది. అప్పుడు ఆ స్థలంలో వ్యాపారం చేయడం మంచిది. స్థలం ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా దక్షిణ – ఉత్తరాలు వదిలి, భూమిని నాలుగు మూలలకు సరిచేసిన తర్వాత.. దక్షిణంలో సింహద్వారం పెట్టుకొని ఇల్లు కట్టుకోవచ్చు. ఏదైనా, అన్నీ తెలుసుకొని చేయండి.
-సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 98492 78143