జుట్టు రాలే సమస్యలకు ఈ ఆయిల్‌తో చెక్.. బామ్మ, తాతల చిట్కా అదుర్స్
Hair fall | జుట్టు రాలడం అన్నది చాలా మంది ఆడవాళ్లలో ఉండే సమస్యే. ఒత్తయిన కురుల కోసం రకరకాల తైలాలను వాడుతుంటారు. ప్రాచీన పద్ధతుల్లో నూనెలను తయారు చేస్తూ .. ఎనభయ్యేండ్ల వయసులోనూ ఆంత్రప్రెన్యూర్లుగా మారినవారూ ఉన్నారు
Hair fall | జుట్టు రాలడం అన్నది చాలా మంది ఆడవాళ్లలో ఉండే సమస్యే. ఒత్తయిన కురుల కోసం రకరకాల తైలాలను వాడుతుంటారు. ప్రాచీన పద్ధతుల్లో నూనెలను తయారు చేస్తూ .. ఎనభయ్యేండ్ల వయసులోనూ ఆంత్రప్రెన్యూర్లుగా మారినవారూ ఉన్నారు. బిడ్డ కోసం ఒక తండ్రి, నలుగురి కోసం ఒక మహిళ… పేటెంట్లు తీసుకుని మరీ సొంత బ్రాండ్లను ప్రారంభించారు. మలి వయసులో ఆ ఆవిష్కరణల యాత్ర ఆసక్తికరం.

మహిళలు కేశ సంరక్షణకు అధిక ప్రాధాన్యమిస్తారు. అలాంటిది అడ్డూ అదుపూ లేకుండా జుట్టు రాలిపోతుంటే ఎంత ఆందోళనకు గురవుతారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇలా జుట్టు రాలే సమస్యతో తమ కూతురు ఇబ్బంది పడటం చూసి తట్టుకోలేకపోయారో తండ్రి. బిడ్డ కోసం ప్రత్యేకంగా ఒక నూనెనే తయారుచేశారు గుజరాత్‌లోని సూరత్‌కి చెందిన ఎనభై అయిదేళ్ల రాధాకృష్ణ చౌదరి. కూతురు వినీత తన సమస్యను చెప్పగానే ఆయన అందరిలా నెట్లో ఎలాంటి నూనెలు అందుబాటులో ఉన్నాయో వెతకలేదు. తనకున్న ఆయుర్వేద పరిజ్ఞానంతో పాటు రకరకాల పుస్తకాలు శోధించి యాభై రకాల నూనెలు, నూనెగింజల మిశ్రమంతో ఒక ఫార్ములాను రూపొందించారు. స్వచ్ఛమైన కొబ్బరినూనెతో పాటు ఆముదం, గుమ్మడిగింజల నూనె, నువ్వుల నూనె, జోజోబా, టీ ట్రీ, రోజ్మేరీలాంటి ఎసెన్షియల్ ఆయిల్స్‌తో దీన్ని ప్రత్యేక పద్ధతుల్లో తయారుచేశారు. వివిధ ప్రాంతాల నుంచి కొన్ని మూలికల్ని సంపాదించారు. ఆయన భార్య శకుంతల కూడా సాయంగా నిలిచారు. అలా తయారు చేసిన నూనెను కూతురితోపాటు ఇంట్లో వాళ్లు కూడా వాడి చూశారు. జుట్టు రాలడం తగ్గిపోవడమేకాదు.. కొత్త వెంట్రుకలు మొలవడం కూడా గమనించారు. అక్కడితో ఆగకుండా, బంధువులకు కూడా ఇచ్చి చూశారు. ఫలితాలు బావుండటంతో.. అందరికీ ఉపయోగ
పడేలా మార్కెట్లోకి తెస్తే బాగుంటుందని నిర్ణయించారు.

‘కేశ్ పల్లవ్’ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో తమ కథను షేర్ చేశారు. దీనికి అనూహ్యమైన స్పందన వచ్చింది. బాలీవుడ్ నటుడు షాహిద్‌కపూర్ భార్య మీరా కపూర్ కూడా వాడి చూశారు. ఈ నూనె తనకెంతో ఉపయోగపడిందని సోషల్ మీడియాలో సర్టిఫికెట్ ఇచ్చారు. దీంతో మరింత పాపులారిటీ వచ్చింది. దీంతో రాధాకృష్ణ ‘అవిమీ హెర్బల్స్’ పేరిట సొంత సంస్థను స్థాపించారు. వివిధ ప్రాంతాల్లో అమ్మకాలు మొదలుపెట్టారు. గతంలో తన భార్య కోసం తయారుచేసిన ఆర్థో ఆయిల్, షాంపూ, ఇతర చర్మసౌందర్య సాధనాలు కూడా ఇక్కడ అమ్ముతున్నారు. ఇప్పటిదాకా దాదాపు 13 కోట్ల రూపాయల వ్యాపారం చేశారు. అలా, ఎనభై అయిదేళ్ల వయసులో తన వ్యాపార లాభంతో మొదటి కారు కొన్నారు రాధాకృష్ణ. కొత్తగా ఆలోచించడానికి వయసుతో పనేముంది?

అందరికీ పంచాలని?
ఒక్కోసారి మన సమస్యలకోసం మనం సృష్టించుకునే పరిష్కారాలు పదిమందికీ ఉపయోగపడవచ్చు. అప్పుడవి మంచి వ్యాపార ఆలోచనలుగానూ మారవచ్చు. బెంగళూరుకు చెందిన నాగమణి అనే పెద్దావిడ విషయంలోనూ ఇదే జరిగింది. ఇప్పుడామెకు 88 సంవత్సరాలు. కొన్నేండ్ల క్రితం నాగమణి స్థాపించిన మిస్సెస్ మణీస్ రూట్స్ అండ్ షూట్స్ సంస్థ ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని మంచి పాపులారిటీని సంపాదించింది. నాగమణికి 24 సంవత్సరాల వయసులో జుట్టు విపరీతంగా ఊడిపోయేది. అప్పుడు 60 ఏండ్ల స్నేహితురాలు ఒక నూనె తయారీ విధానాన్ని చెప్పారు. అది ఆమెకు మంచి ఫలితాన్ని ఇచ్చింది. ఆ తర్వాత అడపాదడపా ఆ నూనెను తయారుచేసి దగ్గరివారికి ఇచ్చేవారు నాగమణి. ఆ తర్వాత ఆ స్పందనను బట్టి నెమ్మదిగా వ్యాపారాన్ని ప్రారంభించారు. ఈ నూనెను తయారుచేయడం ఎంతో కష్ట సాధ్యమైన పని అని చెబుతారామె. కొబ్బరి నూనెలో నాలుగు రకాల ప్రత్యేక నూనె గింజలు వేసి ఆ మిశ్రమాన్ని ఆరు వారాల పాటు ఎండలో ఉంచాలి. ఇందులో వాడే రెండు రకాల గింజలు దొరకడం అరుదే కాదు, వాటిని కొనడం కూడా చాలా ఖరీదైన వ్యవహారం కూడా అంటారు నాగమణి. వీటిని హిమాచల్‌ప్రదేశ్‌లోని ఒక ప్రాంతం నుంచి తీసుకువస్తారు. అందుకే ఏడాదికి ఒక్కసారి మాత్రమే ఈ నూనెను ఉత్పత్తి చేయగలుగుతున్నామనీ, సాధ్యమైనంత ఎక్కువమందికి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామనీ చెబుతున్నారు. దీన్ని తొలుత బెంగళూరులోని బ్యూటీ సెలూన్లకు విక్రయించారు. ప్రస్తుతం వీటి అమ్మకాల కోసం హండ్రెడ్ హ్యాండ్స్ అనే ట్రస్టుతో కలిసి పని చేస్తున్నారు నాగమణి. ఫేస్బుక్ పేజీ ద్వారా కూడా వీళ్లను సంప్రదించవచ్చు. లాభాల కోసం కాకుండా 150 సంవత్సరాల కిందటి ఈ తయారీ విధానాన్నీ, నూనెనూ పదిమందికీ చేరువ చేయాలనే సత్సంకల్పంతో తాను పనిచేస్తున్నానని వివరిస్తారామె.
Read More :
Beauty Tips | తులసి ఆకులతో జుట్టు రాలకుండా కాపాడుకోవచ్చు.. ఎలాగంటే..?”
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

