Hair fall | హెయిర్ ఫాల్ ఎక్కువైందా? ఈ చిట్కాలతో నివారించుకోండి!
Hair fall | హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటే ఎవరికైనా బాధగానే ఉంటుంది. రోజులో 50 నుంచి 100 వరకు జుట్టు రాలడం సాధారణం. అయితే, ఈ రాలడం మరీ పెద్ద మొత్తంలో ఉంటే...
జుట్టు రాలిపోవడం అనేది ప్రస్తుత రోజుల్లో సర్వసాధారణ సమస్యగా మారింది. మారిన వాతావరణ పరిస్థితులు, కాలుష్యం కారణాలతోపాటు సరైన పోషకాలు అందకపోవడం వల్ల జుట్టు రాలిపోతున్నది. ఈ సమస్యను నివారించేందుకు ఒక్కొక్కరు ఒక్కో రకంగా శ్రమిస్తున్నారు. అయితే, చాలా మంది ఫలితంతో సంతృప్తి చెందడం లేదన్నది నగ్నసత్యం. హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటే ఎవరికైనా బాధగానే ఉంటుంది. రోజులో 50 నుంచి 100 వరకు జుట్టు రాలడం సాధారణం. అయితే, ఈ రాలడం మరీ పెద్ద మొత్తంలో ఉంటే ఏంచేయాలి..? ఎలా నివారించుకోవాలి..? అనే అంశాలపై కొన్ని చిట్కాలు మీకోసం..
1) జుట్టును బిగుతుగా ఉండే హెయిర్ స్టైల్స్‌లో లేదా ఎత్తైన పోనీటెయిల్స్లో కట్టుకోకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఇది జుట్టుకు మరింత రాపిడి, మరింత బిగుతును కలిగిస్తుంది. ఫలితంగా ఇది జుట్టు రాలడానికి దారితీస్తుంది.
2) సిల్క్ పిల్లో కవర్ని ఉపయోగించడం అలవాటు చేసుకోవాలి. ఇది రాపిడిని తగ్గించి జుట్టు పగలకుండా చేయడంతోపాటు రాలిపోకుండా కాపాడుతుంది.
3) హెయిర్ బాండ్స్ విచ్చిన్నానికి దారితీసే జుట్టుకు స్టైలింగ్ లేదా రసాయన చికిత్సలను నివారించండి.
4) జుట్టు రకం కోసం ఉద్దేశించిన షాంపూలు, కండీషనర్లను మాత్రమే ఉపయోగించడం అలవాటు చేసుకోండి.
5) జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడమే కాకుండా జుట్టు చిట్లడం, జుట్టు రాలడాన్ని తగ్గించడానికి ప్రతిరోజూ కొన్ని హెయిర్ సీరమ్‌లను వాడాలి.
6) కంటి నిండా నిద్ర, ఒత్తిడి లేని జీవనశైలి ఎల్లప్పుడూ జుట్టు గట్టింగా ఉండేందుకు సహాయపడతాయి. అలాగే, ఆహారం విషయంలో హైడ్రేటెడ్‌గా ఉండేలా చూసుకోవాలి.
7) తల స్నానం చేసేటప్పుడు, నూనే మర్ధన చేసేటప్పుడు గోర్లతో గట్టిగా గీకకుండా చూసుకోవాలి.
8) వారంలో రెండు రోజులకు ఒకసారైనా తలస్నానం అలవాటు చేసుకోవాలి. అది కూడా చల్లటి లేదా గోరువెచ్చని నీటితో స్నానం చేయడం అలవాటు చేసుకోవాలి.
9) తలస్నానం చేసిన తర్వాత జుట్టును బాగా ఆరబెట్టాలి. హెయిర్ డ్రయ్యర్‌ను ఎట్టిపరిస్థితుల్లో వాడకూడదు.
10) హెయిర్ ఫాల్ లేకుండా చూసుకునేందుకు నిత్యం విటమిన్స్, మినరల్స్, ఖనిజాలు ఉండే ఆహారాలను తీసుకోవాలి. ఆకు కూరలు, కూరగాయలు, ఓట్స్, తృణధాన్యాలతోపాటు ప్రోటీన్స్, బీటా కెరోటిన్ ఎక్కువగా ఉండే ఆహారాలను తినాలి.
చివరగా, జుట్టు పోషణకు ఆముదం, కొబ్బరి నూనె వంటి వాటిని వాడుకోవటం మంచిది. రకరకాల ఆకృత్తుల్లో హెయిర్ స్టైల్స్ ఎదుటి వారికి చూసేందుకు బాగే ఉన్నా జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని మరిచిపోవద్దు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

