Hair Fall | పెరుగుతో రోజూ ఇలా చేస్తే జుట్టు రాలడం తగ్గుతుంది
Hair fall and Curd for Hair | ఓ ఆహారంగా జిహ్వ రుచిని పెంచే పెరుగు, కేశాలనూ సంరక్షిస్తుంది. అందులోని పోషకాలు జుట్టుకు బలాన్నిస్తాయి.
› జుట్టును గోరువెచ్చని నీటితో తడిపిన తర్వాత, బాగా తుడుచుకోవాలి. అనంతరం గడ్డపెరుగును జుట్టుకు పట్టించాలి. 15 నిమిషాలు ఆగి, గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. దీనివల్ల పెరుగులోని విటమిన్-బి, హెయిర్ ప్రొటీన్ చుండ్రును నివారిస్తాయి.
› రెండు కప్పుల పెరుగులో అర టీస్పూన్ మెంతి పొడి కలపాలి. ఆ ప్యాక్ను జుట్టుకు పట్టించాలి. పది నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే కేశాలు రాలడం తగ్గిపోతుంది.
› ఒక స్పూన్ పెరుగు, ఒక స్పూన్ ఉసిరి పొడిని ఒక గిన్నెలో బాగా కలిపి జుట్టుకు పట్టించాలి. అరగంట తర్వాత షాంపూతో తలస్నానం చెయ్యాలి. దీనివల్ల వెంట్రుకలకు కొత్త జీవం వస్తుంది. కుదుళ్లకు బలం చేకూరుతుంది. జుట్టు మళ్లీ పెరుగుతుంది.
› కప్పు పెరుగు, గుడ్డు పచ్చసొనను మెత్తని పేస్టులా కలిపి జుట్టుకు రాసుకోవాలి. 25 నిమిషాల తర్వాత షాంపూతో తలస్నానం చేస్తే.. జుట్టు పొడిబారకుండా ఉంటుంది. పచ్చసొన జుట్టుకు తేమను అందిస్తుంది.
› ఒక కప్పు పెరుగులో, గుడ్డు పచ్చసొన, ఒకటిరెండు రోజ్మేరీ చుక్కలు వేసి, బాగా కలిపి జుట్టుకు పట్టించాలి. గంట తర్వాత షాంపూతో శుభ్రం చేసుకుంటే జుట్టుకు బలం వస్తుంది. చిట్లి పోకుండానూ ఉంటుంది.
› కప్పు పెరుగులో రెండు టీస్పూన్ల తేనె కలిపి జుట్టుకు పట్టించాలి. 20 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే జుట్టు రాలడం ఆగిపోతుంది. కేశాలకు కండిషనర్గానూ పనిచేస్తుంది.
› కొబ్బరినూనె, పెరుగు మిశ్రమం జుట్టుకు సహజమైన మాయిశ్చరైజర్. ఇందుకు మొదట.. కొబ్బరినూనెను వేడిచేయాలి. చల్లారిన తర్వాత తేనె, పెరుగు కలపాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి జుట్టు మొదళ్లకు పట్టించాలి.
Read More :
ఎర్ర ఉల్లిగడ్డల నూనెతో ఇలా చేస్తే కొత్త వెంట్రుకలు పుడతాయా? ఉన్నవి ఊడుతాయా?”
“Hair fall | ఆకుకూరలు తింటే జుట్టు ఊడటం తగ్గుతుందా?”
Hair Fall | రోజూ ఈ నూనె వాడితే జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పెరుగుతాయి”
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

