Beauty Tips | తులసి ఆకులతో జుట్టు రాలకుండా కాపాడుకోవచ్చు.. ఎలాగంటే..?
Basil leaves and Hairfall | జుట్టు ఊడిపోవడం అనేది ఏదాడి పొడవునా కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా వానాకాలంలో మరింత ఎక్కువగా ఉంటుంది. చుండ్రు, హార్మోన్ స్థాయిల్లో మార్పుల కారణంగా కూడా జుట్టు రాలిపోతుంది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే తులసి ఆకులు...
Beauty Tips |జుట్టు రాలడం అనేది ప్రస్తుతం మహిళలు, పురుషుల్లో కూడా సాధారణ సమస్యగా మారింది. జుట్టు రాలకుండా ఉండేందుకు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నో షాంపూలు, కండీషనర్లు వాడుతున్నారు. మార్కెట్లో దొరికే ప్రతీ మందును వాడుతున్నారు. అయినప్పటికీ వెంట్రుకలు రాలిపోతుంటే చాలా బాధగా ఉంటుంది. మన పెరట్లో పెరిగే తులసి మొక్క ఆకులతో జుట్టు రాలడాన్ని తగ్గించొచ్చనంటున్నారు ఆయుర్వేద నిపుణులు.
జుట్టు ఊడిపోవడం అనేది ఏదాడి పొడవునా కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా వానాకాలంలో మరింత ఎక్కువగా ఉంటుంది. చుండ్రు, హార్మోన్ స్థాయిల్లో మార్పుల కారణంగా కూడా జుట్టు రాలిపోతుంది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే తులసి ఆకులు ఒక్కటే పరిష్కార మార్గం అని సెలవిస్తున్నారు నిపుణులు. పవిత్రమైన మొక్కగా భావించే ఈ తులసి ఆకుల్లో వివిధ యాంటీ బయోటిక్ లక్షణాలు ఉంటాయి. చర్మ ఆరోగ్యం, జుట్టు ఆరోగ్యానికి చాలా ఉపయోగకరమైనది.
తులసి పేస్ట్
తులసి మొక్కను అడాప్టోజెనిక్ హెర్బ్గా పిలుస్తారు. కొన్ని తులసి ఆకులను తీసుకుని మిక్సీలో వేసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. పేస్ట్‌గా మారేందుకు కొంచెం నీరు కలపాలి. ఈ పేస్ట్‌ను వెంట్రుకలకు పట్టించి కొద్దిసేపు అలాగే వదిలేయాలి. పేస్ట్ ఆరిపోయిన తర్వాత తేలికపాటి షాంపూను వాడి తలను బాగా కడగాలి. వారానికి ఒకసారి ఈ పేస్ట్ పూసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు.
తులసి నూనె
జుట్టుకు క్రమం తప్పకుండా నూనె రాయడం మంచి అలవాటు. ఇలా చేయడం వల్ల జుట్టు కుదుళ్లు ఆరోగ్యకరంగా ఉంటాయి. అయితే, నూనె ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తులసి ఆకుల నుంచి తీసిన నూనెను వెంట్రుకలను పట్టించడం ద్వారా రాలిపోకుండా చూసుకోవచ్చు. వారంలో రెండు, మూడు సార్లు తులసి ఆకుల నూనెతో మర్ధన చేసుకోవడం వల్ల రక్తప్రసరణ కూడా మెరుగై జుట్టు రాలకుండా ఉంటుంది. వెంట్రుకలు తెలుపు రంగులోకి మారకుండా ఉండటంలో తులసి ఆకుల నూనె గొప్పగా సహాయపడుతుంది.
తులసి, ఉసిరి పొడి
తులసి పొడిని ఉసిరి పొడితో కలిపి మిశ్రమాన్ని రాత్రంతా బాగా నానబెట్టి ఉంచాలి. ఈ మిశ్రమాన్ని ఉదయాన్నే తలకు పట్టించాలి. అర గంట పాటు ఇలా ఉంచి తర్వాత కడిగేయాలి. దీని వల్ల జుట్టు రాలడం సమస్యను తగ్గించుకోవచ్చు. వారానికి రెండు సార్లు ఈ విధానాన్ని పునరావృతం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
తులసి రసం పెరుగు
సాధారణంగా జుట్టు రాలడానికి ప్రధాన కారణం చుండ్రు. ఈ సమస్య నుంచి బయటపడటానికి పెరుగులో తులసి ఆకుల రసాన్ని కలిపి పేస్టుల తయారుచేసి తలకు పట్టించాలి. కొంత సమయం తర్వాత కడిగేయాలి. ఇలా చేయడం వల్ల చుండ్రు సమస్య తగ్గిపోయి వెంట్రుకలు రాలకుండా ఉంటాయి.
తులసి, గోరింటాకు పొడి
గోరింటాకు పొడి మహిళల అర చేతులను ఎర్రబడేట్లుగా చేయడమే కాకుండా జుట్టుకు కూడా చాలా ఉపయోగకరమైనది. తులసి ఆకులను గోరింటాకుతో కలిపి పొడి చేసుకోవాలి. ఈ పొడిలో కాసిన్ని నీరు కలిపి ఆ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించడం ద్వారా వెంట్రుకలు రాలకుండా చూసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని ఇలా వారంలో ఒకసారి పెట్టుకోవడం వల్ల జుట్టు రాలే సమస్యను నివారించడమే కాకుండా జుట్టుకు మెరుపును కూడా తీసుకొస్తుంది.
గమనిక: ఈ కథనం కేవలం పాఠకుల అవగాహన కోసమే అందిస్తున్నాం. ఆరోగ్యానికి సంబంధించి ఏ సమస్యకైనా వైద్యులను సంప్రదించడం శ్రేయస్కరం.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

