ఫోన్‌ను జేబులో, బ్యాగులో పెట్టుకున్నప్పుడు మనకు తెలియకుండానే చార్జింగ్ పోర్ట్‌లోకి దుమ్ము, ధూళి చేరుతుంటాయి. దీంతో చార్జింగ్ స్లో అవ్వడం, పోర్ట్ పాడయ్యే అవకాశం ఉంటుంది. ఈ సమస్యకు వెరీ సింపుల్ సొల్యూషన్.. ఈ యూఎస్బీ-సి యాంటీ డస్ట్ ప్లగ్. ఇది చిన్నదే అయినా, మీ ఫోన్ మన్నిక పెంచే స్మార్ట్ గ్యాడ్జెట్. ఇది ఫోన్ చార్జింగ్ పోర్ట్ కొలతలకు తగ్గట్టుగా తయారైంది. దీంతో పోర్ట్ లోపలికి ఇసుక, తేమ, దుమ్ము వెళ్లకుండా పూర్తి రక్షణ అందిస్తుంది. హై-క్వాలిటీ అల్యూమినియంతో తయారైంది. దీనికి రెండు వైపులా సాఫ్ట్ సిలికాన్ ఉంటుంది. దీంతో పోర్ట్‌కి ఎలాంటి గీతలు పడవు. యూఎస్బీ-సి పోర్ట్ ఉన్న అన్ని రకాలఫోన్లకు ఇది సెట్ అవుతుంది.
ధర: సుమారు రూ. 400
దొరుకు చోటు: అమెజాన్, ఫ్లిప్ కార్ట్
రిపేర్ టూల్ కిట్!

మొబైల్ ఫోన్లు, ట్యాబ్లెట్లు, గడియారాలు, కళ్లద్దాలు.. ఇలా చిన్నచిన్న వస్తువులు రిపేర్ చేయాల్సి వచ్చినప్పుడు సాధారణ స్క్రూడ్రైవర్లు పనికిరావు. వాటికోసం చాలా సన్నని.. కచ్చితమైన టూల్స్ కావాలి. Tukzer 24-ఇన్-1 మినీ స్క్రూ డ్రైవర్ సెట్ అలాంటిదే! గ్యాడ్జెట్లను మీరే రిపేర్ చేసుకునేలా ఉపయోగపడే అద్భుతమైన కిట్ ఇది. ఇందులో ఒకే హ్యాండిల్‌కు సరిపోయే 24 రకాల బిట్స్ వస్తాయి. దీంతో మొబైల్స్, ల్యాప్టాప్స్, పీసీలు, గేమింగ్ కన్సోల్స్.. ఇలా దేన్నయినా ఈజీగా ఓపెన్ చేయొచ్చు. బిట్స్ అన్నీ ఎస్2 అలాయ్ స్టీల్‌తో తయారయ్యాయి. బలంగా ఉండటం వల్ల త్వరగా అరిగిపోవు. గట్టి స్క్రూలను తిప్పినా వంగవు. హ్యాండిల్, బిట్స్ మాగ్నెటిక్ పవర్ కలిగి ఉంటాయి. హ్యాండిల్ లైట్ వెయిట్ అల్యూమినియంతో తయారైంది. దీనిపైన ఉండే రొటేటబుల్ క్యాప్‌తో చేయి మొత్తం తిప్పకుండానే.. వేళ్లతో స్క్రూలను సులభంగా తిప్పొచ్చు.
ధర: సుమారు రూ. 800 (ఆఫర్లను బట్టి మారుతుంది).
దొరుకు చోటు: అమెజాన్, ఫ్లిప్ కార్ట్
ఏది మర్చిపోకుండా స్మార్ట్ ట్యాగ్

చాలామందికి తాళం చెవులు, వాలెట్, హ్యాండ్ బ్యాగులను ఎక్కడో పెట్టి మర్చిపోయే అలవాటు ఉంటుంది. ఆఫీస్‌కు వెళ్లే హడావుడిలో అవి దొరకకపోతే వచ్చే చిరాకు అంతా ఇంతా కాదు. ఇలాంటి టెన్షన్లు లేకుండా ఓ స్మార్ట్ సొల్యూషన్ వచ్చేసింది. అదే Portronics Worldtag. ఇది మీ వస్తువులను ఎప్పుడూ మీ కళ్ల ముందే ఉంచే సెక్యూరిటీ గ్యాడ్జెట్. మీ ఐఫోన్ (iPhone) లేదా ఐప్యాడ్‌లోని ఆపిల్ ‘Find My’ యాప్ ద్వారా మీ వస్తువులు ఎక్కడ ఉన్నాయో సులభంగా తెలుసుకోవచ్చు. వాలెట్ లేదా తాళం చెవులను ఎక్కడైనా మర్చిపోయి ముందుకు వెళ్తే.. వెంటనే మీ ఫోన్‌కు నోటిఫికేషన్ వస్తుంది. దీంతో మీరు వస్తువులను మర్చిపోయే అవకాశమే ఉండదు. వస్తువు ఇంట్లోనే ఉన్నా దొరకకపోతే.. యాప్ ద్వారా బజర్ ఆన్ చేయొచ్చు. 20 మీటర్ల దూరం వరకు వినిపించేలా పెద్ద శబ్దం వస్తుంది. బ్యాటరీ ఏడాది పాటు వస్తుంది. ఇది కొన్ని గ్రాముల బరువు మాత్రమే ఉంటుంది. చిన్నగా ఉండటంతో దీన్ని బ్యాగులకు, తాళాలకు తగిలించినా బరువనిపించదు.
ధర: సుమారు
రూ. 1,200 (ఆఫర్లను బట్టి మారుతుంది).
దొరుకు చోటు:అమెజాన్, ఫ్లిప్‌కార్ట్
ఫొటోలకు లైట్.. స్టాండ్!

ఏదైనా ట్రిప్స్‌కి వెళ్లినప్పుడు ఫొటో దిగాలా? నిత్యం ఎవరినో ఒకరిని ఫొటో తీయమని అడగాల్సి వస్తున్నదా? రాత్రిపూట సెల్ఫీలు తీస్తే క్లారిటీగా రావడం లేదా? ఈ సమస్యలన్నిటికీ వన్‌స్టాప్ సొల్యూషన్ ఈ Amazon Basics బ్లూటూత్ సెల్ఫీ స్టిక్. ఇది సెల్ఫీ స్టిక్ మాత్రమే కాదు.. ట్రైపాడ్ లైట్ ఉన్న మల్టీ-టాస్కింగ్ గ్యాడ్జెట్. ఇందులో ఇన్‌బిల్ట్ ఎల్ఈడీ లైట్ ఉంది. తక్కువ వెలుతురులో, చీకటిలో సెల్ఫీలు దిగుతున్నప్పుడు ఫేస్ బ్రైట్‌గా, క్లియర్‌గా కనిపిస్తుంది. ఫొటో క్వాలిటీ పెరుగుతుంది. దీనికింద ఉండే కాళ్లను విడదీస్తే చాలు.. ఇది ట్రైపాడ్ స్టాండ్‌లా మారిపోతుంది. దీంతో మీరు ఫోన్‌ను ఎక్కడైనా పెట్టి వీడియోలు తీసుకోవచ్చు. గ్రూప్ ఫొటోలు దిగొచ్చు. ఇందులో చిన్న బ్లూటూత్ రిమోట్ ఉంటుంది. దీంతో ఫోన్‌కు దూరంగా ఉండి కూడా రిమోట్ నొక్కి ఫొటోలు క్లిక్ చేయొచ్చు. 360 డిగ్రీలు తిరిగే స్టిక్‌తో.. మీరు ఫోన్‌ను నిలువుగా లేదా అడ్డంగా నచ్చిన కోణంలో సెట్ చేసుకోవచ్చు. ఇది గోప్రోకెమెరాలకు కూడా సపోర్ట్ చేస్తుంది. ఐఫోన్, వన్‌ప్లస్, సామ్సంగ్, ఒప్పో, వివో.. ఇలా దాదాపు అన్నిరకాల స్మార్ట్ఫోన్లకు సెట్
అవుతుంది. ట్రావెలర్స్, కంటెంట్ క్రియేటర్లకు ఇది ఒక పర్ఫెక్ట్ కంపానియన్.
ధర: సుమారు రూ.1,000 (ఆఫర్లను బట్టి మారుతుంది).
దొరుకు చోటు: అమెజాన్