తెలుగు రాష్ర్టాల్లోని విద్యార్థులలో మొబైల్ ఫోన్ వ్యసనంపై జరిగిన వివిధ పరిశోధనలు, సర్వేల ఫలితాలు చూస్తే రేపటి తరం ఎంత ప్రమాదంలో ఉన్నారో అర్థమవుతుంది. ఈ రాష్ర్టాల్లోని వైద్య, డెంటల్, ఇతర ఉన్నత విద్యా విద్యార్థులపై చేసిన అధ్యయనాల ప్రకారం, దాదాపు 53% నుంచి 59% మంది విద్యార్థులు మొబైల్ అడిక్షన్ బారిన పడే తీవ్ర ముప్పులో ఉన్నట్లు తేలింది.
సుదీర్ఘకాలం మొబైల్ వాడకం వల్ల విద్యార్థుల్లో మానసిక ఆరోగ్య సమస్యలతో పాటు చదువుపై కూడా ప్రతికూల ప్రభావం పడుతున్నది. హైదరాబాద్‌లోని పాఠశాల విద్యార్థులపై (11-14 సంవత్సరాలు) చేసిన ఒక అధ్యయనంలో, మొబైల్ అడిక్షన్ పెరిగేకొద్దీ పిల్లల్లో ఆందోళన, ఒంటరితనం, కోపం, చిరాకు వంటి ప్రవర్తనా లోపాలు గణనీయంగా పెరుగుతున్నట్లు రుజువైంది. సర్వేలో పాల్గొన్న విద్యార్థులలో కేవలం 22% మంది మాత్రమే క్లాస్ జరుగుతున్నప్పుడు ఫోన్ వాడటం లేదని చెప్పారు. మిగిలిన 78% మంది క్లాస్ రూమ్‌లోనే దొంగచాటుగా టెక్ట్సింగ్ లేదా సోషల్ మీడియా బ్రౌజ్ చేస్తున్నట్లు ఒప్పుకొన్నారు. అధిక స్క్రీన్ టైమ్ కారణంగా ఏకాగ్రత లోపించడం, చదువును వాయిదా వేయడం వల్ల విద్యార్థుల అకడమిక్ గ్రేడ్స్ మార్కులు తగ్గిపోతున్నాయని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
మొబైల్ అడిక్షన్ బారిన పడిన విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇవ్వడానికి కంపాషనేట్ ఎంక్వైరీ అనే పద్ధతి ఉంది. కౌన్సెలర్ లేదా థెరపిస్ట్ విద్యార్థితో సంభాషించేటప్పుడు నాలుగు దశల ద్వారా వారి అడిక్షన్ మూలాల్లోకి వెళ్తారు
కౌన్సెలర్ మార్గదర్శనం: నువ్వు పనికిరానివాడివి కావు. ఆ రోజు నీకు జరిగిన అవమానం వల్ల కలిగిన బాధను తట్టుకోవడానికి నీ మెదడు ఈ ఫోన్ అనే సాధనాన్ని వాడుకుంది. ఇప్పుడు ఆ చిన్నపాటి బాధకు మనం కరుణతో ఎలా స్వస్థత చేకూర్చవచ్చో చూద్దాం.
కంటిన్యూస్‌గా ఈ కంపాషనేట్ ఎంక్వైరీని ఉపయోగించడం వల్ల విద్యార్థులు తమ అడిక్షన్‌ను అసహ్యించుకోవడం మానేసి, తమ లోపల ఉన్న అసలు సమస్యను ధైర్యంగా అంగీకరిస్తారు. ఎప్పుడైతే మూల కారణంపై కరుణతో పనిచేస్తామో అప్పుడు సోషల్ మీడియాపై ఆధారపడటం ఆటోమేటిక్‌గా తగ్గిపోతుంది.
సామాజిక మాధ్యమాలు అనేవి ఒక పదునైన కత్తి లాంటివి. వాటిని ఎలా వాడుతున్నామనే దానిపైనే మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. విద్యార్థులు సోషల్ మీడియాను కేవలం జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఒక సాధనంగా మాత్రమే ఉపయోగించుకుంటూ, తమ అమూల్యమైన సమయాన్ని కెరీర్ నిర్మాణానికి కేటాయించినప్పుడే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమవుతుంది.
– బి. కృష్ణ, సీనియర్ సైకాలజిస్ట్
ఇగ్నిషియో చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్,
హైదరాబాద్, 99854 28261