e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, May 18, 2021
Home బతుకమ్మ శ్రీ ప్లవ నామ సంవత్సర పంచాంగం (2021-22)

శ్రీ ప్లవ నామ సంవత్సర పంచాంగం (2021-22)

శ్రీ ప్లవ నామ సంవత్సర పంచాంగం (2021-22)

మేషం
అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం
ఆదాయం: 8 వ్యయం: 14
రాజపూజ్యం: 4 అవమానం: 3
చైత్రం: ఈ నెలలో గ్రహస్థితి అనుకూలం. ప్రారంభించిన పనులు నిర్విఘ్నంగా కొనసాగుతాయి. ఆర్థికంగా పురోగతి ఉంటుంది. స్నేహితులు, బంధువుల సహకారంతో పనులు పూర్తవుతాయి. ఉద్యోగంలో బాధ్యతలు పెరుగవచ్చు.
వైశాఖం: వృత్తి, వ్యాపారాల్లో బరువు, బాధ్యతలు పెరుగుతాయి. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. కొత్త పరిచయాల వల్ల సమస్యలు తలెత్తవచ్చు. కొత్త ఒప్పందాలు, ఆర్థిక లావాదేవీల్లో ఏమరుపాటు తగదు.
జ్యేష్ఠం: ఈ నెలలో సూర్య సంచారం అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. ఉద్యోగంలో పైఅధికారుల మెప్పు లభిస్తుంది. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. అనవసరమైన ప్రయాణాలకు దూరంగా ఉండండి.
ఆషాఢం: పనులు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. రావాల్సిన ఆదాయం వచ్చినా, అనుకోని ఖర్చులు ముందుకురావొచ్చు. వాహనాల మూలంగా ఖర్చులు ఏర్పడవచ్చు. బంధుమిత్రులతో సఖ్యతతో వ్యవహరించండి.
శ్రావణం: మంచి ఆలోచనలు వస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో స్వల్ప చికాకులు ఎదురైనా ఆలస్యంగా అయినా వాటిని అధిగమిస్తారు. పైఅధికారులతో మనస్పర్ధలు రావొచ్చు. విద్యార్థులు, ఉద్యోగులు శ్రమకు తగిన ఫలితం పొందుతారు.
భాద్రపదం: ఉత్సాహంతో ఉంటారు. పనులు నిరాటంకంగా పూర్తవుతాయి. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం లభిస్తుంది. అధికారుల ప్రశంసలు అందుకుంటారు. దూర ప్రయాణాల వల్ల కలిసి వస్తుంది.
ఆశ్వీయుజం: స్నేహితులు, బంధువులతో పనులు నెరవేరుతాయి. నెల ద్వితీయార్థంలో పనిభారం పెరుగొచ్చు. రావలసిన సొమ్ము ఆలస్యంగా చేతికి అందుతుంది. సర్దుబాట్లు అవసరం పడతాయి. ఆరోగ్య సూత్రాలు పాటించండి.
కార్తీకం: ఈ నెలలో శుభకార్యాల ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికంగా ఒడుదొడుకులు ఎదురవ్వొచ్చు. ఉద్యోగ, వ్యాపారాల్లో పనిభారం పెరుగొచ్చు. ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉంటుంది.
మార్గశిరం: ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సమయానికి తగినట్లుగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళితే సమస్యలను అధిగమిస్తారు. ఖర్చుల నియంత్రణ అవసరం. స్నేహితుల సహకారం లభిస్తుంది.
పుష్యం: ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. కొత్త పనులు ప్రారంభిస్తారు. ఫలితాలు సంతృప్తికరంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది.
మాఘం: చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. స్వయం వృత్తిలో అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్లకు అవకాశం. అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి.
ఫాల్గుణం: సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే సత్ఫలితాలు పొందుతారు. పిల్లల చదువు, ఉద్యోగం, విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. మంచి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి.
ఈ రాశి వారికి దశమంలో గురుశనులు, జన్మ, ద్వితీయ స్థానంలో రాహువు, సప్తమంలో కేతువు సంచారం ప్రతికూలం. ఆయా గ్రహాలకు జపాలు చేయించి, రుద్రాభిషేకం, లలితా-విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల దోషాలు తొలగి శుభఫలితాలు కలుగుతాయి.

వృషభం
కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2 పాదాలు
ఆదాయం: 2 వ్యయం: 8
రాజపూజ్యం: 7 అవమానం: 3
చైత్రం: ఈ నెల మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. పనుల్లో ఆటంకాలు ఎదురైనా సకాలంలో పూర్తవుతాయి. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. పై అధికారుల మెప్పు పొందుతారు.
వైశాఖం: శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం బాగున్నా ఖర్చుల నియంత్రణ అవసరం. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. ప్రభుత్వ, కోర్టు వ్యవహారాల్లో అనుకూలం.
జ్యేష్ఠం: ఈ నెల అనుకూలం. కుటుంబంలో సంతోషాలు వెల్లివిరుస్తాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. అన్నదమ్ముల సహకారం లభిస్తుంది. కార్యసిద్ధి ఉంది. పెట్టుబడులకు అనుకూల సమయం.
ఆషాఢం: చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆర్థికంగా స్థిరంగా ఉంటుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి.
శ్రావణం: శ్రమ అధికం అవుతుంది. కొత్త ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు. ఒప్పందాల విషయంలో ఏమరుపాటు తగదు. వ్యాపార భాగస్వాములతో వివాదాలకు దూరంగా ఉండండి. ఆత్మీయులతో మనస్పర్ధలకు అవకాశం.
భాద్రపదం: పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. ఆదాయం స్థిరంగా ఉంటుంది. అయితే ఖర్చులకు సరిపడా ఉండకపోవచ్చు. ఆరోగ్య సూత్రాలు పాటించండి. ఉద్యోగంలో ఒత్తిడికి లోనవుతారు. వివాదాల్లో తలదూర్చకండి.
ఆశ్వీయుజం: ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకొని పనులు చేపట్టండి. బంధువులతో వైరం వద్దు. పిల్లల చదువు, విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. క్రయవిక్రయాల్లో జాగ్రత్త.
కార్తీకం: కొత్త అవకాశాలు వస్తాయి. నలుగురికీ ఉపయోగపడే పనులు చేస్తారు. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. వ్యాపార విస్తరణకు అవకాశం ఉంది. అయితే, ఆర్థికంగా సర్దుబాట్లు తప్పవు. విద్యార్థులకు మంచి కాలం.
మార్గశిరం: ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. ఆదాయం క్రమేపీ పెరుగుతుంది. శ్రమకు తగిన ఫలితం పొందుతారు. దూరప్రయాణాలు వాయిదా పడతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది.
పుష్యం: వృత్తి, వ్యాపారాల్లో సంతృప్తిగా ఉంటుంది. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. భూలావాదేవీల్లో జాగ్రత్త వహించండి.
మాఘం: కలహాలకు దూరంగా ఉండండి. ఆర్థికంగా ఫర్వాలేదు. అనవసర ఖర్చులు తగ్గించుకోండి. మంచివారితో స్నేహం వల్ల కలిసివస్తుంది.
ఫాల్గుణం: పనులు సకాలంలో పూర్తవుతాయి. పెండింగ్‌ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. కుటుంబ సౌఖ్యం. పైఅధికారుల మన్ననలు పొందుతారు. పలుకుబడితో పనులు నెరవేరుతాయి.
దశమంలో గురువు, తొమ్మిదింట శని, జన్మ, ద్వాదశ స్థానాల్లో రాహువు, సప్తమంలో కేతువు సంచారం ప్రతికూలం. ఆయా గ్రహాలకు జపాలు చేయించి, రుద్రాభిషేకం, లలితా-విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల దోషాలు తొలగి శుభఫలితాలు కలుగుతాయి.

మిథునం
మృగశిర 3,4 ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు
ఆదాయం: 5 వ్యయం: 5
రాజపూజ్యం: 3 అవమానం: 6
చైత్రం: అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అందరి సహకారంతో పనులు పూర్తవుతాయి. కుటుంబ వాతావరణం బాగుంటుంది. ఉన్నతాధికారులతో స్నేహభావంతో మెలగండి.
వైశాఖం: ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవాలి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. ఒత్తిళ్లు ఎక్కువవుతాయి. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.
జ్యేష్ఠం: గత నెలతో పోలిస్తే అనుకూలంగా ఉంటుంది. పని విధానంలో మార్పులు అవసరం. రావలసిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. వృథా కాలయాపన చేస్తారు. వాహనాల మూలంగా డబ్బు ఖర్చు. బంధువులతో కొన్ని పనులు నెరవేరుతాయి.
ఆషాఢం: ఎంచుకున్న పనులు సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో ప్రయత్నిస్తారు. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. పెద్దల సహకారం లభిస్తుంది. ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉంటాయి.
శ్రావణం: కుటుంబసభ్యుల సహకారం లభిస్తుంది. నలుగురిలో గుర్తింపు లభిస్తుంది. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. విందు, వినోదాలకు హాజరవుతారు. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది.
భాద్రపదం: ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధువుల రాకతో ఖర్చులు పెరుగవచ్చు. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. వ్యాపార విస్తరణ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగులకు పని పెరిగినా, అధికారుల ఆదరణ లభిస్తుంది.
ఆశ్వీయుజం: ప్రతికూల ఫలితాలు ఉంటాయి. పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. అనవసర ఖర్చుల కారణంగా డబ్బుకు ఇబ్బంది ఏర్పడుతుంది. ఒప్పందాల విషయంలో ఏమరుపాటు తగదు.
కార్తీకం: నెల ప్రారంభంలో ఇబ్బందులున్నా క్రమేపీ అనుకూలంగా మారుతుంది. అవసరానికి డబ్బు అందుతుంది. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి.
మార్గశిరం: ఆర్థిక పురోగతి సంతృప్తికరంగా ఉంటుంది. కొత్త పరిచయాలతో పనులు నెరవేరుతాయి. పిల్లల చదువులు, విదేశీ ప్రయాణాల విషయంలో అనుకూల ఫలితాలు రావచ్చు.
పుష్యం: నలుగురిలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పిల్లల చదువు ఆశాజనకంగా ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. భూ, వాహన లావాదేవీల్లో జాగ్రత్త అవసరం.
మాఘం: మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి. గృహోపకరణాలు కొనుగోలు చేయవచ్చు. వృథా ఖర్చుల కారణంగా సర్దుబాట్లు అవసరం అవుతాయి. కొత్త వ్యక్తులతో జాగ్రత్త అవసరం.
ఫాల్గుణం: ఆహార నియమాలు పాటించాలి. ఆదాయంలో హెచ్చుతగ్గులుంటాయి. వృత్తివ్యాపారాల్లో లాభాలున్నా ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చు. విద్యార్థులు ఏకాగ్రతతో చదివితే కోరుకున్న ఫలితం సిద్ధిస్తుంది.
ఈ రాశి వారికి అష్టమంలో గురుశనులు, ద్వాదశంలో రాహువు సంచారం ప్రతికూలం. ఆయా గ్రహాలకు జపాలు చేయించి, రుద్రాభిషేకం, లలితా-విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల దోషాలు తొలగి శుభఫలితాలు కలుగుతాయి.

కర్కాటకం
పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఆదాయం: 14 వ్యయం: 2
రాజపూజ్యం: 6 అవమానం: 6
చైత్రం: కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఓపికతో, శ్రద్ధతో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. ఆర్థికంగా పురోగతి ఉంటుంది. అనవసరమైన విషయాలను స్నేహితులతో చర్చించకుండా ఉండటం మంచిది. కుటుంబ సభ్యులతో సంతృప్తిగా ఉంటారు.
వైశాఖం: అన్ని రంగాల్లో విజయం లభిస్తుంది. అందరితో స్నేహపూర్వకంగా మెలగుతారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. శుభకార్యాల్లో పాలుపంచుకుంటారు.
జ్యేష్ఠం: ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. నియమాలకు లోబడి కార్యాలు నెరవేరుస్తారు. సంఘంలో కీర్తిప్రతిష్ఠలు ఇనుమడిస్తాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి.
ఆషాఢం: అన్ని విషయాల్లో పట్టుదలతో వ్యవహరిస్తారు. అత్యవసర పనులకు ప్రాధాన్యమిస్తారు. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరిస్తారు. విద్యార్థులకు అనుకూల సమయం. ప్రజాప్రతినిధులు సత్ఫలితాలు
సాధిస్తారు.
శ్రావణం: ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది. ఆత్మీయులతో కాలక్షేపం. వివాదాలకు దూరంగా ఉంటారు. విద్యార్థులు ఏకాగ్రతతో విజయం సాధిస్తారు.
భాద్రపదం: ఆటంకాలను అధిగమించి అన్నిటా విజయం సాధిస్తారు. ఇంట్లో వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది. పిల్లల చదువుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.
ఆశ్వీయుజం: నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకుంటారు. కుటుంబ సౌఖ్యం ఉంది. అధికారుల మెప్పు లభిస్తుంది. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార విషయాల్లో ఆచితూచి వ్యవహరించండి.
కార్తీకం: ఈ నెల అనుకూలంగా ఉంటుంది. శుభకార్యాలు చేస్తారు. వ్యాపారంలో పురోభివృద్ధి సాధిస్తారు. కార్యసాఫల్యం ఉంది. కొత్త పనులు చేపడుతారు. వివాదాలకు దూరంగా ఉంటారు.
మార్గశిరం: వృత్తి, వ్యాపారాల్లో స్వల్ప ఆటంకాలు ఉన్నా, అంతిమంగా అనుకూల ఫలితాలు పొందుతారు. స్నేహితులు, బంధువులతో సత్సంబంధాలు పెరుగుతాయి. భార్యాబిడ్డలతో సంతోషంగా ఉంటారు.
పుష్యం: శ్రమ అధికంగా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఆదాయంలో
ఒడుదొడుకులు ఎదురవ్వొచ్చు.
మాఘం: రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ప్రయాణాల మూలంగా ఖర్చులు పెరుగవచ్చు. బంధువర్గంతో సఖ్యత పెరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. దైవసేవ చేసుకుంటారు.
ఫాల్గుణం: ఇంట్లో వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది. ప్రారంభించిన పనులు ధైర్యంగా పూర్తిచేస్తారు. వ్యాపార ఒప్పందాల్లో ఏమరుపాటు తగదు. విద్యార్థులు ఏకాగ్రతతో విజయం సాధిస్తారు.

 • ఈ రాశివారికి అష్టమంలో గురువు, సప్తమంలో శని, దశమంలో రాహువు, చతుర్థంలో కేతువు సంచారం వల్ల కొన్ని ప్రతికూల ఫలితాలు కలుగుతాయి. ఆయా గ్రహాలకు జపాలు చేయించి, రుద్రాభిషేకం, లలితా-విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల దోషాలు తొలగి శుభఫలితాలు కలుగుతాయి.

సింహం
మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆదాయం: 2 వ్యయం: 14
రాజపూజ్యం: 2 అవమానం: 2
చైత్రం: ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆలోచనలను ఆచరణలో పెట్టి సత్ఫలితాలు పొందుతారు. మానసికంగా సంతృప్తి చెందుతారు. ఆదాయం స్థిరంగా ఉంటుంది. విద్యార్థులకు మంచి సమయం.
వైశాఖం: వివాహాది శుభకార్యాల ప్రయత్నాలు ఫలిస్తాయి. చేసే పనిలో తృప్తి లభిస్తుంది. ఉద్యోగంలో పైఅధికారుల మెప్పు పొందుతారు. స్నేహితులు, ఆత్మీయుల సహకారం లభిస్తుంది.
జ్యేష్ఠం: ఈ నెల అనుకూలంగా ఉన్నా, అధిక శ్రమతో పనులు పూర్తవుతాయి. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఊరట లభిస్తుంది. శుభకార్యాలు చేపడతారు.
ఆషాఢం: ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. రావలసిన డబ్బు చేతికి ఆలస్యంగా అందుతుంది. పిల్లల చదువుల విషయంలో అనుకూలత ఉంటుంది. రుణబాధలు తీరుతాయి.
శ్రావణం: ఆదాయం స్థిరంగా ఉంటుంది. అవసరానికి డబ్బు అందుతుంది. సహోద్యోగులతో స్నేహంగా మెలగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అనవసర ఆలోచనలు కట్టిపెట్టండి.
భాద్రపదం: ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. దేవతా, గురుభక్తి పెరుగుతుంది. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారంలో లాభాలు గడిస్తారు.
ఆశ్వీయుజం: ఆరోగ్యం బాగుంటుంది. శుభకార్యాల ప్రయత్నాలు ఫలిస్తాయి. మంచి వ్యక్తుల సహకారం లభిస్తుంది. ఉద్యోగంలో పనిభారం పెరిగినా విజయం సాధిస్తారు.
కార్తీకం: కొత్త పరిచయాలతో కార్యానుకూలత. శుభకార్యాలకు హాజరవుతారు. ఆదాయం పెరుగుతుంది. బంధువుల సహకారం లభిస్తుంది. తోటి ఉద్యోగులతో సఖ్యత పెరుగుతుంది.
మార్గశిరం: ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. పనులు వాయిదా పడొచ్చు. ప్రయాణాల మూలంగా ఖర్చులు పెరుగుతాయి. మాసాంతంలో పరిస్థితి ఆశాజనకంగా మారుతుంది.
పుష్యం: ఉద్యోగ ప్రయత్నాలు తాత్కాలికంగా ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో అనుకూలత ఉంటుంది. సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు. పెద్దల సహకారం లభిస్తుంది. విదేశీ ప్రయాణానికి అనుకూల సమయం.
మాఘం: మంచివ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. పూర్వం కన్నా ఆదాయం పెరుగుతుంది. విద్యార్థులకు అనుకూల సమయం. పోటీ పరీక్షల్లో రాణిస్తారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు.
ఫాల్గుణం: సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగంలో స్థాన చలనం వల్ల సంతోషిస్తారు. వ్యాపారస్తులకు అనుకూల సమయం. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా సాగుతాయి.

 • ఈ రాశి వారికి ఆరింట గురువు, తొమ్మిది, పది స్థానాల్లో రాహువు, నాలుగింట కేతువు సంచారం ప్రతికూలం. ఆయా గ్రహాలకు జపాలు చేయించి, రుద్రాభిషేకం, లలితా-విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల దోషాలు తొలగి శుభఫలితాలు కలుగుతాయి.

కన్య
ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2 పాదాలు
ఆదాయం: 5 వ్యయం: 5
రాజపూజ్యం: 5 అవమానం: 2
చైత్రం: ఈ నెల సామాన్యంగా ఉంటుంది. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకుంటారు. కొత్త పనుల్లో ఆచితూచి వ్యవహరించండి. వివాదాలకు దూరంగా ఉండండి.
వైశాఖం: ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. అన్నదమ్ములలో సఖ్యత నెలకొంటుంది. రావలసిన డబ్బు ఆలస్యంగా చేతికందుతుంది. ధార్మిక, సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటారు. నలుగురికీ సాయమందిస్తారు.
జ్యేష్ఠం: కుటుంబంలో పెద్దల సహకారం లభిస్తుంది. కుటుంబంతో కాలం సంతృప్తిగా గడుపుతారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. అనవసరమైన విషయాల్లో తలదూర్చడం వల్ల చికాకులు కలుగవచ్చు.
ఆషాఢం: ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగవచ్చు. అయినా, అధికారుల ఆదరణ, సహోద్యోగుల సహకారం లభిస్తుంది. ఆదాయంలో అస్థిరత కారణంగా పనుల్లో జాప్యం జరుగవచ్చు.
శ్రావణం: మానసికంగా ఒత్తిళ్లు ఉంటాయి. అన్ని వేళలా అత్యుత్సాహం వద్దు. ఆచితూచి పనులు చక్కబెట్టండి. నెలాఖరున విద్యార్థులకు అనుకూల సమయం. పోటీపరీక్షల్లో సత్ఫలితాలు సాధిస్తారు.
భాద్రపదం: పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో సంతృప్తి ఉన్నా పనివారితో ఇబ్బందులు ఎదురవ్వొచ్చు. స్నేహితుల వల్ల కొన్ని పనులు నెరవేరుతాయి. వివాదాల జోలికి వెళ్లకండి.
ఆశ్వీయుజం: బంధువులు, స్నేహితులతో వాగ్వివాదాల్లోకి వెళ్లకుండా జాగ్రత్తపడండి. శ్రమ ఎక్కువైనా చేపట్టిన కార్యాల్లో విజయం సాధిస్తారు. నలుగురికీ ఉపయోగపడే పనులు చేస్తారు. అనవసరమైన ప్రయాణాలు తగ్గించుకోండి.
కార్తీకం: ఆదాయం క్రమేపీ పెరుగుతుంది. కొత్త పనులు చేపట్టే ముందు ఆచితూచి వ్యవహరించండి. స్నేహితుల సహకారం తీసుకోండి. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది. అధికారుల మెప్పు లభిస్తుంది.
మార్గశిరం: ఈ నెలలో సంతృప్తికరమైన ఫలితాలు ఉంటాయి. కొత్త పరిచయాల వల్ల కలిసి వస్తుంది. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారు.
పుష్యం: పట్టుదలతో విజయం సాధిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో సంతృప్తికరంగా ఉంటుంది. విద్యార్థులు అనుకూల ఫలితాలు సాధిస్తారు. కొత్త ఒప్పందాల విషయంలో ఆచితూచి స్పందించండి. రుణ ప్రయత్నాలు సఫలం అవుతాయి.
మాఘం: ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉంటుంది. బయటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. వివాదాలకు దూరంగా ఉండండి. సంఘంలో ఉన్నతస్థానంలో ఉన్న వ్యక్తుల సహకారంతో కొన్ని పనులు చక్కబడతాయి.
ఫాల్గుణం: శ్రమకు తగిన ఫలితం పొందుతారు. ఆలస్యంగా అయినా రావలసిన డబ్బు చేతికి అందుతుంది. అధికారులతో సత్సంబంధాలు కొనసాగించండి. ప్రయాణాలు అనుకూలిస్తాయి.

 • ఈ రాశి వారికి ఆరోస్థానంలో గురువు, ఐదింట శని, అష్టమ, నవమ స్థానాల్లో రాహువు, ద్వితీయంలో కేతువు సంచారం ప్రతికూలం. ఆయా గ్రహాలకు జపాలు చేయించి, రుద్రాభిషేకం, లలితా-విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల దోషాలు తొలగి శుభఫలితాలు కలుగుతాయి.

తుల
చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు
ఆదాయం: 2 వ్యయం: 8
రాజపూజ్యం: 1 అవమానం: 5
చైత్రం: ప్రారంభించిన పనులను శ్రద్ధతో పూర్తి చేస్తారు. ఆదాయం స్థిరంగా ఉన్నా, ఖర్చులు పెరుగుతాయి. ఆహార నియమాలు పాటిస్తూ ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి.
వైశాఖం: వృత్తి, వ్యాపారాల్లో పనివారితో ఇబ్బందులు తలెత్తవచ్చు. పనుల్లో జాప్యం ఏర్పడుతుంది. ఆర్థికంగా సర్దుబాట్లు అవసరం కావొచ్చు. కొత్త నిర్ణయాలు వాయిదా వేసుకోవడం మంచిది.
జ్యేష్ఠం: రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆలస్యమైనా చేపట్టిన పనులు పూర్తవుతాయి. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. ఉద్యోగంలో తోటివారి సహకారం లభిస్తుంది. భూలావాదేవీలు కొంత వరకు కలిసివస్తాయి.
ఆషాఢం: ఈ నెల మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆటంకాలు ఎదురైనా అన్నిటా విజయం సాధిస్తారు. ఉద్యోగంలో సంతృప్తి లభిస్తుంది. విద్యార్థులు చదువులో రాణిస్తారు. కొత్త వ్యక్తుల వల్ల ఆర్థిక నష్టం. జాగ్రత్త వహించండి.
శ్రావణం: ఉద్యోగులకు కొత్త అవకాశాలు వస్తాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. ప్రయాణాల వల్ల ప్రయోజనం పొందుతారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది.
భాద్రపదం: ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. అందుకు తగ్గ గుర్తింపు కొరవడటంతో నిరాశకు గురవుతారు. కోర్టు వివాదాలు తలెత్తవచ్చు. స్నేహితుల సహకారం లభిస్తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.
ఆశ్వీయుజం: బంధువర్గంతో వైరం ఏర్పడే సూచనలు ఉన్నాయి. అనవసర విషయాల్లో తలదూర్చొద్దు. ఆరోగ్యం పట్ల అశ్రద్ధ కూడదు. ఖర్చులు పెరుగుతాయి. మాసాంతంలో ఆర్థికంగా కొంత పురోగతి కలుగుతుంది.
కార్తీకం: చేసే పనిలో అనుకూలత ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వివాదాలకు దూరంగా ఉండండి. మంచి వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. పైఅధికారులతో సంయమనంతో వ్యవహరించండి.
మార్గశిరం: ఆదాయం బాగున్నా, ఖర్చులూ ఎక్కువగానే ఉంటాయి. ముఖ్యమైన పనుల్లో ఆలస్యం జరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండండి. అందరితో సామరస్యంగా ఉండండి. అనవసరమైన ప్రయాణాలు వాయిదా వేయండి.
పుష్యం: స్నేహితుల సహకారం లభిస్తుంది. పనులు కలిసి వస్తాయి. గృహ నిర్మాణ అవకాశాలు ఉన్నాయి. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో లాభాలు కలుగుతాయి. దైవభక్తి పెరుగుతుంది.
మాఘం: సకాలంలో పనులు పూర్తి చేస్తారు. బాధ్యతతో నడుచుకుంటారు. కుటుంబ సహకారం లభిస్తుంది. సహోద్యోగులతో మనస్పర్ధలు ఏర్పడవచ్చు. ప్రయాణాలు కలిసి వస్తాయి.
ఫాల్గుణం: ఆరోగ్యం బాగుంటుంది. ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. వృథా ఖర్చులు తగ్గించుకోండి. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటే సత్ఫలితాలు పొందుతారు. విద్యార్థులకు మంచి సమయం.

 • ఈ రాశి వారికి నాలుగింట గురువు, అష్టమంలో శని, సప్తమ, అష్టమాల్లో రాహువు, జన్మ, ద్వితీయంలో కేతువు సంచారం ప్రతికూలం. ఆయా గ్రహాలకు జపాలు చేయించి, రుద్రాభిషేకం, లలితా-విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల దోషాలు తొలగి శుభఫలితాలు కలుగుతాయి.

వృశ్చికం
విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ
ఆదాయం: 8 వ్యయం: 14
రాజపూజ్యం: 4 అవమానం: 5
చైత్రం: ఉత్సాహంగా పనులు చేస్తారు. ఇంట్లో సుఖశాంతులు ఉంటాయి. ఆటంకాలు ఎదురైనా చేపట్టిన పనులు పూర్తిచేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు ఏకాగ్రత అవసరం.
వైశాఖం: శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆత్మీయులతో పనులు నెరవేరుతాయి. నలుగురిలో మాట చెల్లుబాటు అవుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రయాణాల వల్ల ఖర్చులు పెరుగుతాయి.
జ్యేష్ఠం: అనవసరమైన ఆలోచనలు పక్కనపెట్టి పనులపై మనసు నిలపండి. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. పిల్లల చదువు, శుభకార్యాల విషయంలో సహాయ సహకారాలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది.
ఆషాఢం: ఈ నెల మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. వివాదాల్లోకి వెళ్లకుండా ఉండండి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించండి. శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. రావలసిన డబ్బు అందుతుంది.
శ్రావణం: ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉత్సాహంతో పనులు చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి.
భాద్రపదం: విశ్వాసంతో పనులు చేస్తారు. ఉద్యోగులకు పైఅధికారుల అండదండలు లభిస్తాయి. పదోన్నతులు, స్థానచలన సూచనలు ఉన్నాయి. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. ఆర్థికంగా మంచి మార్పు వస్తుంది.
ఆశ్వీయుజం:ఈ నెల మిశ్రమ ఫలితాలు ఉంటాయి. స్వయంశక్తితో పనులు పూర్తి చేసుకోవాలి. పనిభారం పెరుగవచ్చు. అధికారుల ఆదరణ, సహోద్యోగుల సహకారం లభిస్తాయి. బంధువర్గంతో మనస్పర్థలు రావచ్చు.
కార్తీకం:ప్రతి విషయంలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. కొత్త వ్యక్తులను గుడ్డిగా నమ్మరాదు. వృథా ఖర్చులను నియంత్రించాల్సిన అవసరం ఉంది. వాహన, భూముల విషయంలో నిర్ణయాలు అప్రమత్తతతో తీసుకోవాలి.
మార్గశిరం: ప్రారంభించిన పనులు శ్రద్ధగా పూర్తిచేస్తారు. వివాదాలకు దూరంగా ఉంటారు. వృత్తి, వ్యాపారాల్లో అనుకూల సమయం. వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. అన్నదమ్ములు, ఆత్మీయుల సహకారం లభిస్తుంది.
పుష్యం: ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఎక్కువ ఆందోళనకు గురవుతారు. క్షేత్రాలను సందర్శిస్తారు. పెద్దల సహకారం లభిస్తుంది.
మాఘం: శుభకార్యాలకు హాజరవుతారు. కుటుంబంతో సఖ్యతతో ఉంటారు. ఓపిక చాలా అవసరం. రాజకీయంగా పలుకుబడి పెరుగుతుంది. ప్రజాప్రతినిధులకు మంచి సమయం.
ఫాల్గుణం: ప్రయాణాలు కలిసి వస్తాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. మాట పలుకుబడి పెరుగుతుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది.

 • ఈ రాశి వారికి తృతీయ, చతుర్థ స్థానాల్లో గురువు, మూడింట శని, ఏడింట రాహువు, జన్మ, వ్యయ స్థానాల్లో కేతువు సంచారం ప్రతికూలం. ఆయా గ్రహాలకు జపాలు చేయించి, రుద్రాభిషేకం, లలితా-విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల దోషాలు తొలగి శుభఫలితాలు కలుగుతాయి.

ధనుస్సు
మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం
ఆదాయం: 11 వ్యయం: 5
రాజపూజ్యం: 7 అవమానం: 5
చైత్రం: ప్రారంభించిన పనులు శ్రద్ధగా పూర్తిచేస్తారు. డబ్బు విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి. రావలసిన సొమ్ము వివాదాలతో చేతికి అందుతుంది. కుటుంబంలో పెద్దల సహకారం లభిస్తుంది. వాహన మూలకంగా ధన వ్యయం.
వైశాఖం: వృత్తిలో సంతృప్తి లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తా యి. స్నేహితులు, బంధువుల వల్ల పనులు నెరవేరుతాయి. అన్నదమ్ముల సహకారం లభిస్తుంది. విద్యార్థులు చదువులో సత్ఫలితాలు సాధిస్తారు.
జ్యేష్ఠం: అనవసరమైన వివాదాల జోలికి వెళ్లొద్దు. దూర ప్రయాణాలు తగ్గించుకోవడం మంచిది. ఉద్యోగులకు ఆఫీసులో సంయమనం పాటించడం అవసరం. ఖర్చులను నియంత్రించండి.
ఆషాఢం: ప్రారంభించిన పనులు త్వరగా పూర్తవుతాయి. పట్టుదలతో ప్రయత్నించండి. వాహనాల వల్ల ధన వ్యయ సూచన. సంయమనంతో నిర్ణయాలు తీసుకోవాలి. కుటుంబంలో ప్రశాతంత నెలకొంటుంది. అధికారుల ఆదరణ లభిస్తుంది.
శ్రావణం: భార్యాపిల్లలతో సంతృప్తిగా ఉంటారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. అధికారుల అండదండలు లభిస్తాయి. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ అన్నిటా విజయం వరిస్తుంది.
భాద్రపదం: ఆర్థికంగా కలిసి వస్తుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. రావలసిన డబ్బు చేతికి అందడంతో రుణ బాధలు కొంత వరకు తీరుతాయి.
ఆశ్వీయుజం: ఈ నెల సత్ఫలితాలు ఉన్నాయి. బంధువుల రాకతో ఖర్చు పెరిగినా, సంతోషం పొందుతారు. సమయానికి డబ్బు అందుతుంది. ఉద్యోగులకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది.
కార్తీకం: భార్యాపిల్లల సహకారం లభిస్తుంది. అనవసరమైన వివాదాల జోలికి వెళ్లొద్దు. ఆత్మీయుల తోడ్పాటుతో చాలా పనులు నెరవేరుతాయి. ఉద్యోగంలో సంతృప్తి. శుభకార్య ప్రయత్నాలు సఫలం అవుతాయి.
మార్గశిరం: ఆటంకాలు ఎదురైనా చేపట్టిన పనులు పూర్తిచేస్తారు. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. బంధువులతో భేదాభిప్రాయాలు రావచ్చు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించండి.
పుష్యం: ప్రారంభించిన పనులు పూర్తి చేయడానికి చిత్తశుద్ధి అవసరం. భార్యాపిల్లలతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి. విద్యార్థులకు ఏకాగ్రత అవసరం. ఒప్పందాల విషయంలో సంయమనంతో వ్యవహరించండి.
మాఘం: బంధువర్గంతో వైషమ్యాలు తలెత్తవచ్చు. రావలసిన డబ్బు చేతికి అందినా, వృథా ఖర్చులు తగ్గించుకోవడం అవసరం. ప్రయాణాల వ ల్ల అసలట, వృథా కాలయాపన గోచరిస్తున్నది. విద్యార్థులకు మంచి కాలం.
ఫాల్గుణం: పనిభారం పెరిగినా సంయమనంతో వ్యవహరిస్తారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. సాంస్కృతిక, ధార్మిక కార్యక్రమాల్లో పాలుపంచుకుంటారు. భూలావాదేవీల్లో అనుకూలత ఉన్నా ఆర్థిక ఇబ్బందుల వల్ల పనులు ఆలస్యం అవుతాయి.

 • ఈ రాశి వారికి మూడింట గురువు, రెండింట శని, పంచమంలో రాహువు, వ్యయంలో కేతువు సంచారం ప్రతికూలం. ఆయా గ్రహాలకు జపాలు చేయించి, రుద్రాభిషేకం, లలితా-విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల దోషాలు తొలగి శుభఫలితాలు కలుగుతాయి.

మకరం
ఉత్తరాషాఢ 2, 3, 4, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాలు
ఆదాయం: 14 వ్యయం: 14
రాజపూజ్యం: 3 అవమానం: 1
చైత్రం: ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంది. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. ఉద్యోగులకు మంచి కాలం. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. వ్యాపారం బాగున్నా, వినియోగదారులతో ఇబ్బందులు ఉండవచ్చు.
వైశాఖం: ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉన్నా శుభకార్యాలకు ఖర్చు చేస్తారు. వృత్తిలో సంతృప్తి పొందుతారు. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపార విస్తరణకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తవచ్చు.
జ్యేష్ఠం: శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి. బంధుమిత్రులతో సత్సంబంధాలు ఉంటాయి. వాహనాలు, భూలావాదేవీల్లో ఆచితూచి అడుగేయండి. పలుకుబడి పెరుగుతుంది. ఆదాయం స్థిరంగా ఉన్నా.. అనుకోని ఖర్చులు తప్పవు.
ఆషాఢం: అనవసరమైన విషయాల వల్ల ఆందోళన చెందుతారు. మిత్రులతో విభేదాలు తలెత్త వచ్చు. ఒప్పందాలు కలిసి వస్తాయి. ప్రయాణాల వల్ల వృథా ఖర్చులు పెరుగుతాయి. స్వశక్తిని నమ్ముకోండి.
శ్రావణం: ప్రారంభించిన పనులు సంయమనంతో పూర్తి చేయాలి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ సౌఖ్యం పొందుతారు. భూలావాదేవీల నిర్ణయాల్లో తొందరపాటు తగదు.
భాద్రపదం: స్నేహితులు, ఆత్మీయుల సహకారం లభిస్తుంది. మంచి పనుల కోసం డబ్బు ఖర్చవుతుంది. ఉత్సాహంతో పనులు చేస్తారు. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. విద్యార్థులకు మంచి సమయం.
ఆశ్వీయుజం: వృథా ఖర్చుల వల్ల ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. సద్దుబాట్లు చేసుకోవాల్సి రావచ్చు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. గృహ నిర్మాణ పనులు ముందుకు సాగుతాయి.
కార్తీకం: ఉద్యోగులు సంతృప్తికరమైన ఫలితాలు సాధిస్తారు. వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. ఆదాయంలో హెచ్చుతగ్గులున్నా ఆ ప్రభావం ఉండదు. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి.
మార్గశిరం: ప్రారంభించిన పనులను శ్రద్ధతో పూర్తి చేస్తారు. వివాదాలకు దూరంగా ఉండండి. ఆదాయం క్రమేపీ పెరుగుతుంది. కొత్త పనులు తలబెడతారు. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి.
పుష్యం: ప్రారంభించిన పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. కుటుంబ పెద్దలతో అభిప్రాయ భేదాలు రావచ్చు. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. విద్యార్థులు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు.
మాఘం: ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా వ్యవహరించండి. ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగంలో సంతృప్తి ఉంటుంది. అనవసరమైన ఖర్చుల వల్ల ముఖ్యమైన పనులు వాయిదా వేయాల్సి రావచ్చు. ధార్మిక కార్యక్రమాలకు హాజరవుతారు.
ఫాల్గుణం: ఖర్చులు పెరుగుతాయి. ఆదాయం పెరిగే మార్గాలను అన్వేషించుకోవాలి. నియంత్రణపై మనసు నిలపాలి. పని భారం పెరుగుతుంది. ప్రయాణాల వల్ల అలసట కలుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండండి.

 • జన్మస్థానంలో చతుర్థంలో గురు, శనులు, ఐదింట రాహువు, పదోస్థానంలో కేతువు సంచారం ప్రతికూలం. ఆయా గ్రహాలకు జపాలు చేయించి, రుద్రాభిషేకం, లలితా-విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల దోషాలు తొలగి శుభఫలితాలు కలుగుతాయి.

కుంభం

ఆదాయం: 14 వ్యయం: 14
రాజపూజ్యం: 6 అవమానం: 1
చైత్రం: ఆటంకాలు ఎదురైనా ప్రారంభించిన పనులు పూర్తి చేస్తారు. వృథా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. ఉద్యోగులకు ఇబ్బందులు ఎదురైనా తెలివిగా వాటిని అధిగమిస్తారు.
వైశాఖం: ఉద్యోగంలో సంతృప్తి ఉంటుంది. కానీ, రాబడికి మించి ఖర్చులు ఉండటంతో ఆందోళన చెందుతారు. ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. అధికారుల అండదండలు లభిస్తాయి.
జ్యేష్ఠం: ప్రయత్నపూర్వకంగా పనులు చక్కబెడతారు. వివాదాలకు దూరంగా ఉండటం అవసరం. సరదాలకు ఎక్కువగా వెచ్చిస్తారు. కుటుంబసభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఆదాయం పెంచుకునే మార్గాలు అన్వేషిస్తారు. శుభకార్య ప్రయత్నాలు ముందుకుసాగుతాయి.
ఆషాఢం: రావలసిన డబ్బు చేతికి అందుతుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. గురుభక్తి పెరుగుతుంది. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. వ్యాపార విస్తరణ ఆలోచన కొంతకాలం వాయిదా వేయండి.
శ్రావణం: భూ వివాదాలు పరిష్కారం అవుతాయి. పిల్లల చదువు, వివాహం, ఉద్యోగ విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు మంచి సమయం.
భాద్రపదం: రావలసిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. ఫలితంగా చేయవలసిన ముఖ్య పనులు వాయిదా వేయాల్సి రావచ్చు. అనవసరమైన ఖర్చులు ముందుకు వస్తాయి. సహోద్యోగులతో సఖ్యత అవసరం. మానసిక ఒత్తిళ్లు ఉంటాయి.
ఆశ్వీయుజం: కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. భార్యా పిల్లలతో సంతోషంగా గడుపుతారు. ఉద్యోగంలో అనుకున్నవి సాధిస్తారు. వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. విద్యార్థులకు ఏకాగ్రత అవసరం.
కార్తీకం: మంచి ఆలోచనలు స్ఫురిస్తాయి. వాటిని సమయానుకూలంగా అమలు చేయడం అవసరం. వ్యాపారం సంతృప్తిగా ఉంటుంది. భాగస్వాములతో కొన్ని ఇబ్బందులు రావచ్చు. ఉద్యోగులు అధికారులతో స్నేహంగా ఉండాలి.
మార్గశిరం: ప్రారంభించిన పనులను అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు. ఉత్సాహంతో ఉంటారు. శుభకార్యాల విషయంలో నలుగురి సహకారం లభిస్తుంది. పిల్లలు చదువులో రాణిస్తారు. గౌరవ మర్యాదలు పొందుతారు.
పుష్యం: ప్రారంభించిన పనులను శ్రద్ధతో, జాగ్రత్తగా పూర్తి చేస్తారు. రావలసిన డబ్బు అందుతుంది. శుభకార్యాలకు ఖర్చు చేస్తారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. అయితే, కొత్త పనులను కొంతకాలం వాయిదా వేసుకోవడం మంచిది.
మాఘం: సంఘంలో మంచి వ్యక్తుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. ఇంట్లోకి కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. విందులు, వినోదాలలో పాల్గొంటారు. భూలావాదేవీల్లో ఇబ్బందులు ఏర్పడవచ్చు.
ఫాల్గుణం: ఉద్యోగులకు అధికారుల నుంచి విమర్శలు ఎదురవ్వొచ్చు. అనవసరమైన ఖర్చులు ముందుకు వస్తాయి. విద్యార్థులకు ఏకాగ్రత, పట్టుదల అవసరం. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. రుణ బాధలు కొంత వరకు తీరుతాయి.

 • ఈ రాశి వారికి జన్మ, వ్యయస్థానాల్లో గురువు, ద్వాదశంలో శని, నాలుగింట రాహువు, తొమ్మిది, పది స్థానాల్లో కేతువు సంచారం ప్రతికూలం. ఆయా గ్రహాలకు జపాలు చేయించి, రుద్రాభిషేకం, లలితా-విష్ణు సహస్రనామ
  పారాయణం చేయడం వల్ల దోషాలు తొలగి శుభఫలితాలు కలుగుతాయి.

మీనం
పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
ఆదాయం: 11 వ్యయం: 5
రాజపూజ్యం: 2 అవమానం: 4
చైత్రం: ఆర్థిక పరిస్థితి పురోగతిలో ఉంటుంది. ప్రారంభించిన పనులు అనుకూలంగా పూర్తవుతాయి. స్నేహితులు, బంధువులతో విభేదాలు ఏర్పడవచ్చు. వాహనాల మూలంగా ఇబ్బందులు రావచ్చు. సాంస్కృతిక, ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
వైశాఖం: మంచివారితో పరిచయాలు ఏర్పడతాయి. తద్వారా పనులు నెరవేరుతాయి. భార్యా పిల్లలతో సంతృప్తిగా ఉంటారు. వృత్తిలో అనుకూలత. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. స్థిర, చరాస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది.
జ్యేష్ఠం: సమయానుకూల నిర్ణయాలను తీసుకొని సత్ఫలితాలు పొందుతారు. పిల్లల చదువు విషయంలో కలిసి వస్తుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది.
ఆషాఢం: వృత్తిలో పనివారి సహకారం లభిస్తుంది. వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. రుణాలు తీరుస్తారు. ఆదాయం మెరుగవుతుంది. వ్యాపార లావాదేవీలు జాగ్రత్తగా నిర్వహించడం అవసరం.
శ్రావణం: శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. పెద్దల సహకారం లభిస్తుంది. అనవసరమైన ఖర్చులు ముందుకు రావడంతో ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.
భాద్రపదం: అనవసరమైన విషయాలలో తల దూర్చడంతో వివాదాలలో చిక్కుకుంటారు. ఆదాయం స్థిరంగా ఉన్నా.. ఖర్చులు అనూహ్యంగా పెరగడం వల్ల సర్దుబాటు తప్పదు. వాహనాల మూలంగా ఖర్చులు. అనవసరమైన ప్రయాణాలతో అలసట కలుగుతుంది.
ఆశ్వీయుజం: ప్రారంభించిన పనులను శ్రమతో పూర్తి చేస్తారు. అనాలోచిత పెట్టుబడుల మూలంగా ఇబ్బందులు ఎదురవుతాయి. సంయమనం అవసరం. సహోద్యోగులతో మనస్పర్ధలు తలెత్తవచ్చు. భూములు, వాహనముల మూలంగా ఖర్చులు పెరుగుతాయి.
కార్తీకం: అధికారులతో సఖ్యత పెరుగుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పనులను జాగ్రత్తగా పూర్తి చేస్తారు. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. పిల్లల చదువు, ఉద్యోగం, వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి.
మార్గశిరం: ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. వివాహాది శుభకార్యాలు చేస్తారు. ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. దేవతా, గురు భక్తి పెరుగుతుంది. ఆరోగ్యంతో సంతోషంగా ఉంటారు.
పుష్యం: ప్రారంభించిన పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. ఆదాయం పెరుగుతుంది. కొత్త పనులు చేసే ఆలోచనలో ఉంటారు. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగు పడడంతో నలుగురికి సాయపడే పనులను చేపడతారు.
మాఘం: ఆలోచనలను సమయానుకూలంగా ఆచరణలో పెడతారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. పిల్లలు చదువులో రాణిస్తారు. మంచి స్థాయిలో నిలుస్తారు.
ఫాల్గుణం: పనులు కొంత ఆలస్యంతో పూర్తవుతాయి. రావలసిన డబ్బు సమయానికి చేతికి అందుతుంది. వ్యాపార విస్తరణకై ప్రయత్నాలు చేస్తారు. వివాదాల్లోకి వెళ్లకుండా పనిపై మనసు నిలపడం అవసరం.

 • ఈ రాశి వారికి పన్నెండింట గురువు, రెండింట రాహువు, అష్టమ, నవమంలో కేతువు సంచారం ప్రతికూలం. ఆయా గ్రహాలకు జపాలు చేయించి, రుద్రాభిషేకం, లలితా-విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల దోషాలు తొలగి శుభఫలితాలు కలుగుతాయి.
Advertisement
శ్రీ ప్లవ నామ సంవత్సర పంచాంగం (2021-22)
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement