రకుల్ ప్రీత్ సింగ్ తన మొదటి సంపాదనను ఏం చేసిందో తెలుసా!!
Rakul Preet Singh | రకుల్‌ప్రీత్ సింగ్.. టాలీవుడ్లోకి ఓ ‘కెరటం’లా వచ్చింది. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’తో వరుస అవకాశాలు కొట్టేసింది. ‘నాన్నకు ప్రేమతో’, ‘సరైనోడు’ వంటి సినిమాలు హిట్ కావడంతో దశాబ్ద కాలం నుంచీ స్టార్ హీరోయిన్గా రాణిస్తున్నదీ సొగసరి. త్వరలోనే పెండ్లిపీటలెక్కనున్న రకుల్ గురించి కొన్ని ముచ్చట్లు..

2009లో కన్నడ సినిమా ‘గిల్లీ’తో వెండితెరకు పరిచయమైన రకుల్ టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అనే తేడాలేకుండా వరుస సినిమాలు చేసి.. స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ‘కెరటం’ సినిమాలో ఓ చిన్న పాత్ర పోషించిన రకుల్ ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమాకు ఫిలింఫేర్ అవార్డు అందుకుంది.

టాలీవుడ్లో నేటితరం హీరోలతోపాటు సీనియర్ స్టార్ నాగార్జున సరసన ‘మన్మథుడు-2’ సినిమాలో నటించింది. తెలుగులో ‘నాన్నకు ప్రేమతో’ సినిమాకు తానే డబ్బింగ్ చెప్పుకొని శభాష్ అనిపించుకుంది. ‘కొండపొలం’లో డీ గ్లామర్ రోల్ చేసి ప్రయోగాలకూ సై అంది.

హిందీలో అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్, అజయ్ దేవగణ్ వంటి సీనియర్లతో పాటు సిద్ధ్దార్థ్ మల్హోత్రా, ఆయుష్మాన్ ఖురానా వంటి యువ హీరోలతోనూ జతకడుతున్నది రకుల్. భారతీయుడు-2లో విశ్వనటుడు కమల్‌హాసన్ సరసన కనిపించనున్నది.

తొలినాళ్ల నుంచీ రకుల్ సోషల్ మీడియాలో యమ యాక్టివ్. యోగ, వ్యాయామం వీడియోలు, ఫొటోలు ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటున్నది. తిండి విషయంలో మహా జాగ్రత్తగా ఉంటుంది రకుల్. ‘దే దే ప్యార్ దే’ సినిమాకోసం 50 రోజుల్లో 10 కేజీల బరువు తగ్గి హీరోలే కాదు, హీరోయిన్లూ సినిమా కోసం శరీరాకృతిని మార్చుకోగలరని నిరూపించింది. ప్రస్తుతం తొమ్మిది సినిమాలతో బిజీగా ఉన్న రకుల్, గతంతో పోలిస్తే మరీ సన్నబడింది. బాలీవుడ్లో వరుస అవకాశాలు వస్తుండటంతో తెలుగు సినిమాల్లో బొత్తిగానల్లపూసైపోయింది.

‘సినిమాల్లో నటిస్తానని నేనెప్పుడూ అనుకోలేదు. పాకెట్ మనీకోసం మొదటి సినిమాకు ఒప్పుకొన్నా. ఆ తర్వాత నా భవిష్యత్తును ఇందులోనే వెతుక్కున్నా. ఇదే మంచి ఎంపిక అనిపించింది. నా మొదటి సంపాదనతో కారు యజమాని అయ్యాను. నిజంగా అదో గొప్ప అనుభూతి’ అంటూ తన కెరీర్ కథను కళ్లింతలు చేసుకుని చెబుతుంది రకుల్. 2011లో ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో రకుల్ ఐదు రౌండ్లలో గెలిచింది. ఐదు సబ్ టైటిళ్లనూ అందుకుంది.

కాబోయే భర్త జాకీ భగ్నానీతో దిగిన ఫొటోను షేర్ చేస్తూ తాను పెండ్లి చేసుకోనున్నట్టు ప్రకటించింది రకుల్. అంతేకాదు ‘రకుల్’ అనే యూట్యూబ్ చానల్ స్టార్ట్ చేసి వంటలు, ఫ్యాషన్‌కు సంబంధించిన వీడియోలు పోస్ట్ చేయబోతున్నట్టు వెల్లడించింది. తన సినిమాల సంగతులు కూడా ఆ చానల్ ద్వారా అభిమానులతో పంచుకుంటానని చెప్పింది.

Read More :
“Rakul Preet Singh | స్లీవ్ లెస్ అందాలతో పిచ్చెక్కిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్..”
Rakul Preet Singh | స్టార్ హీరోతో రకుల్ రొమాన్స్..అఫీషియల్ అప్డేటే తరువాయి..!”
“Rakul Preet Singh | బాయ్‌ఫ్రెండ్ గురించి అందుకే చెప్పేశానంటున్న రకుల్”
Rakul Preet Singh | రకుల్ ప్రీత్ ఫేవరెట్ తెలుగు హీరో ఎవరో తెలుసా..?”
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

