కొన్ని కథలు ఆసక్తిగా ఉంటాయి. కొన్ని ఆలోచింపజేసేవిగా ఉంటాయి. మరికొన్ని వింతగా అనిపిస్తాయి. ఒక సంకలనంలోని అన్ని కథలూ అద్భుతంగా ఉండాల్సిన పనిలేదు. చిల్ చేసేవి కొన్ని, థ్రిల్ పంచేవి కొన్ని ఉన్నా.. ఆ కథా సంకలనం స్పెషల్ అనిపించుకుంటుంది. రచయిత తపస్వి (కార్తీక్) రాసిన చిల్ & థ్రిల్ (తెలుగు స్టోరీస్) కథా సంపుటి కూడా స్పెషల్ అనిపించుకుంటుంది. ఇందులోని కథలన్నీ బాగున్నాయని చెప్పలేం కానీ కొన్ని కథలు మాత్రం భలేగా ఉన్నాయనిపిస్తాయి. రచయిత కథాంశాలు తీసుకునే తీరు చూసినప్పుడు (కొన్ని కథలలో) విశ్వకవి రవీంద్రనాథ్ కథలు మనోఫలకంలో తిరుగాడాయి. మొదటి కథ ‘బుడబుక్కలోడు’లో మనకు విశ్వకవి ఛాయలు కనిపిస్తాయి.
‘ఇల్లు అద్దెకు ఇవ్వబడును’ చదివినప్పుడు కూడా అలాంటి భావనలు కలుగుతాయి. కొత్తదనం లేకపోతేనేమి? ‘చిరిగిన నోటు’ మంచి కథ. ‘రాము గారి పాతకుర్చీ’ ఆసక్తికరంగా సాగింది. ఈ కాలపు కుర్రకారు ఆలోచనలకు అద్దంపట్టే కథ ‘టైం వేస్ట్’ పాఠకులకు నచ్చుతుంది. ‘పోలయ్య తాత’, ‘మురళి’, ‘అసత్య హరిశ్చంద్రుడు’ లాంటి కథలన్నీ చదివించేవే. ఈ సంకలనానికి శీర్షిక అయిన ‘చిల్&థ్రిల్’ కథ దెయ్యాల పాత్రలతో సాగుతూ, టైటిల్‌కు న్యాయం చేసింది. చిల్ సంగతేమో కానీ, చాలా కథలు ‘థ్రిల్లర్ వస్తువులతో’ చదివింపజేస్తాయి. మరికాస్త శ్రద్ధ వహిస్తే.. రచయిత నుంచి మరిన్ని గొప్ప కథలు ఆశించొచ్చు. వారికి ఆసక్తి, ఆ శక్తి ఉందని ఈ 20 కథల సంపుటి నిరూపిస్తుంది.
రచన: తపస్వి
పేజీలు: 157 వెల: రూ. 175/-
ప్రతులకు: తపస్వి మనోహరం పబ్లికేషన్స్, హైదరాబాద్ ,78934 67516
-చంద్ర ప్రతాప్ కంతేటి
రచన : డా. ఎస్. నారాయణ రెడ్డి
పేజీలు : 262;
ధర : రూ.250
ప్రచురణ : యువభారతి ప్రచురణలు
ప్రతులకు : అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
ఫోన్ : 93913 73684
రచన : పెన్మెత్స సుబ్బరాజు
పేజీలు : 200;
ధర : రూ.200
ప్రతులకు : అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
ఫోన్ : 94911 84911