Pet Photography | నయా ట్రెండ్.. శునకాలకు కూడా డిఫరెంట్ ఫొటోషూట్
Pet Photography | పెట్ కల్చర్ స్టేటస్ సింబల్. విదేశీ పెట్స్ ఒక ట్రెండ్. బాధ్యతగా చూసుకోవడం, అందంగా ముస్తాబు చేయడం ఒక ప్యాషన్. అదిరిపోయేలా ఫొటో షూట్ చేయడం ఒక కళ. జంతు ప్రేమికులకు అందమైన జ్ఞాపకాలను పంచుతున్నది.. పెట్ ఫొటోగ్రఫీ.

పెట్స్ ఫొటోగ్రఫీ అంత సులభం కాదు. వాటిని నవ్వించాలి, ఎగిరించాలి, తోకాడించేలా చేయాలి. అయినా, పెట్ ఫొటోగ్రఫీపై ఆసక్తి కనబరుస్తూ పెంపుడు జంతువులపై ప్రేమను చాటుతున్నారు కొంతమంది. ప్రతిమ, ఆయేషా, సలోనీ, కృతి, రీతూ వంటి యువతులు ఈ కోవకు చెందినవారే.

పాక్స్ చనిపోయిందని..
ప్రతిమది హైదరాబాద్. తనకు చిన్నప్పటి నుంచే ఫొటోగ్రఫీ అంటే ఇష్టం. కనిపించే ప్రతీదాన్ని ఫొటో తీస్తుంది. ఫొటోగ్రఫీ పోటీల్లో గెలిచిన డబ్బుతో మొట్టమొదటి కెమెరాను కొనుక్కొని క్రమంగా పుట్టినరోజు వేడుకల వైపు మళ్లింది. వాళ్ల నాన్న పాక్స్ అనే కుక్కపిల్లను కొనిచ్చారు. పాక్స్ అంటే ప్రతిమకు చాలా ఇష్టం. ముద్దుచేసి, అందంగా ముస్తాబుచేసి రకరకాల యాంగిల్స్‌లో ఫొటోలు తీస్తూ మురిసిపోయేది. రెండేండ్ల తర్వాత పాక్స్ చనిపోయింది. ఈ సంఘటన ప్రతిమ మనసుకు బాధ కలిగించింది. పాక్స్‌ను తలుచుకుంటూ పాత ఫొటో ఆల్బమ్స్ తిరగేసేది. తనలాంటి అనుభవం మరెవరికీ రావద్దని ‘పాపరాజీ’ ఫొటోగ్రఫీని మొదలుపెట్టింది.

తన ప్రపంచం
ఢిల్లీకి చెందిన ఆయేషా ఫ్రామ్జికి పెట్ ఫొటోగ్రఫీ అంటే ఇష్టం. మనుషుల కంటే.. పెట్స్‌తోనే ఆమె ఎక్కువ కాలం గడుపుతుంది. అందులోనూ సైరస్ను విడిచి అసలు ఉండలేదు. సైరస్ సైబీరియన్ హస్కీ. నిజానికి ఢిల్లీ వాతావరణాన్ని సైబీరియన్ హస్కీలు తట్టుకోలేవు. తట్టుకున్నా పునరుత్పత్తి జరగనే జరగదు. కానీ ఆయేషా మాత్రం సైబీరియన్ హస్కీనే ఎంచుకున్నది. ఇండియా వచ్చిన తర్వాత దానికోసం ప్రత్యేకంగా షెడ్ కూడా ఏర్పాటుచేసి ప్రాణంగా చూసుకుంటున్నది. వారానికి ఒకసారి పొలానికి తీసుకెళ్తుంది. ప్రతి కదలికను ఫొటోషూట్ చేస్తుంది.

పిల్లులతో కొంచెం కష్టమే
సలోని ఖత్రి, కృతి త్రెహాన్, రీతూ మెహమనీ వంటి ఆసక్తిగల యువ ఫొటోగ్రాఫర్లు కూడా పెట్స్‌కు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. వాటి చిలిపి చేష్టల్ని కెమెరాలో బంధించి అందమైన ఆల్బమ్స్‌లో భద్రపరుస్తున్నారు. వీరందరికీ ‘పాపరాజీ’ ప్రతిమ పింగళి ఆదర్శం. కుక్కల కంటే పిల్లులను ఫొటోలు తీయడం కొంచెం కష్టమైన పనే అంటున్నారు వీళ్లంతా. ఎందుకంటే కెమెరాను చూడగానే పిల్లులు భయపడి పోతాయి. ఫ్లాష్ రాగానే మీదికి దూకుతాయి, అసలు ముస్తాబు చేయనీయవు. పెట్ ఫొటోగ్రఫీ అంటే ఒక్క ఫొటోలు తీసి ఆల్బమ్స్ తయారుచేయడమే కాదు. వాటి ఆరోగ్యం ఎలా ఉంది? జీవితకాలం ఎంత?.. తదితర విషయాలపైనా దృష్టిపెట్టాల్సి ఉంటుంది. పిల్లల పెంపకంతో పోలిస్తే పెట్స్ పెంపకం చాలా కష్టం అని తెలిసినప్పటికీ వాటితో స్నేహం చేయడానికి నేటితరం ఆసక్తి చూపిస్తున్నది.




Read More :
Inshah Bashir | కాలం కాళ్లు లాగేసుకుంటే.. వీల్‌చైర్‌తోనే గమ్యానికి పరుగెత్తింది
Migraine | ఆఫీస్‌లో మైగ్రేన్ సమస్యలా..? ఈ టిప్స్ పాటించండి!
తన ఫొటోలతో తెలంగాణ అస్తిత్వానికి అంతర్జాతీయ గుర్తింపు తెస్తున్న పాలంపేట యువకుడు”
లవ్ మ్యారేజి చేసుకోవాలని అనుకుంటున్నారా? ఇక్కడి అమ్మాయిల ఓపెన్ ఆఫర్
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
- Tags
- dogs
- Pet
- photography
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

