1. బయానా = ముందుస్తుగా ఇవ్వడం (అడ్వాన్స్) (నాకు తెల్వకుండా తెల్లగొడ్డును బేరంబెట్టి బయానా కూడా తీస్కున్నవా? దాన్ని అమ్మితే అస్సలు బాగోదు. ఎవుసంల ఎట్ల చేతికి అడ్డమొచ్చిందో ఎర్కలేదా?)
2. అసువావులు = పనిముట్లు, ఆయుధాలు (ఉత్త చేతుల్తో యాడికెళ్లినా ఎవ్వరూ పనియ్యరు. అసువావులు లేకుంట యాడికీ పోవద్దు బిడ్డా..)
3. పెద్దలల్ల కల్సుడు = చనిపోవడం (చిన్నబిడ్డెను కల్సెటందుకు ఊరికిపోయిన పెద్దబాపు మళ్లీ తిరిగి రాలే. ఆడ్నే జీవమిడ్సి పెద్దలల్ల కల్సిండు)
4. నిర్రనీల్గుడు = మునికాళ్లమీద బలంగా నుంచోవడం (ఏం మల్లి కాకా ఇయ్యాల ఎల్లిందాంక తాగినవా ఏంది? నిర్రనీల్గుతున్నవ్?)
5. పావురం = ప్రేమ (మా బాపుకు మేమంటే ఎంత పావురమో మీకేం ఎర్క? మూడొద్దులు తినకపోయినా.. మా కడ్పు మాడ్చలె. ఏదోటి తెచ్చేటోడు. అంత గొప్పోడు మా అయ్య)