సంపాదకుడు: అనిల్ అట్లూరి
పేజీలు: 278; వెల: రూ. 250/-
ప్రతులకు: నవోదయ బుక్ హౌస్
కాచిగూడ, హైదరాబాద్ – 500 027.
మొబైల్ : +91-90004 13413
‘అట్లూరి పిచ్చేశ్వరరావు కథలు’ సంకలనంలో కథలన్నీ కాలక్షేపానికో, ఉబుసుపోక రాసినవో కాదు. సిసలైన జనాభ్యుదయం కోసం రాసినవి. దేశాధినేతలకు కర్రు కాల్చి వాతపెట్టేలా చెప్పడం రచయిత శైలి. కథ నడపడంలో ఆయనది అద్వితీయ ప్రతిభ.
‘చిరంజీవి’ కథ తీసుకుంటే సామాన్యుడు మాన్యుడిగా ఎలా మారాడో అర్థమవుతుంది. కథ చివరికి వచ్చేసరికి మనమే చిరంజీవిగా మారిపోతాం. అంతటి విషయం దానిలో దట్టించి చెప్పాడు. ‘ఇది ఇప్పుడు మన దేశమే’ కథ చదివి దేశం కోసం కాలు పోగొట్టుకున్న ఒక సైనికుడికి లభించింది ఏమిటో తెలిసి నివ్వెరపోతాం. కడుపు మండిపోతుంది. అందులో పాత్రల నడుమ నడిచిన వ్యంగ్య సంభాషణలు అధికార వర్గాలకు చురకలు. రజాకార్లు, భూస్వాముల నేపథ్యంలో సాగిన ‘విముక్తి’ కథ గొప్పశిల్పంతో సాగుతుంది. విషయమే కాదు కాలంలో ముందుకీ వెనక్కీ నడుస్తూ ఆ కథ సాగిన తీరు అనుపమానం. కొన్ని కథలు అప్పుడప్పుడే దేశీయ సాహిత్యంలోకి ప్రవేశిస్తున్న సర్రియలిజం వగైరా నవీన పోకడలకు అద్దం పడతాయి. సరళంగా కాక, అర్థమయ్యీ కానట్టు చెప్పడం, ధ్వని ప్రధానంగా చెప్పడం కథకైనా కవితకైనా ప్రాణం. పిచ్చేశ్వరరావు కథలు చూస్తుంటే ఈ మర్మం 70 ఏళ్ల క్రితమే ఆయన గుర్తించారని అనిపిస్తుంది. కథలకు శీర్షికలు పెట్టడంలో కూడా ఆయనది
విలక్షణ మార్గం. ‘గడవని నిన్న’, ‘బ్రతకడం తెలియనివాడు’, ‘గడిచిన దినాలు’, ‘ఆగస్టు 15న’.. లాంటి 26 కథలతో వెలువడిన ఈ పుస్తకంలో ప్రతి అక్షరం ఆణిముత్యమే! రావాల్సిన దానికంటే తక్కువ పేరు సంపాదించుకున్నా అమూల్యమైన కథలను తెలుగువారికి అందించాడు పిచ్చేశ్వరరావు. ఆయన కథలు నేటి రచయితలకు పాఠ్యగ్రంథాలు.
సృజనోదయము
రచన: నేరెళ్ల రంగాచార్య
పేజీలు: 184
వెల: రూ. 260
ప్రతులకు:
ఫోన్: 94414 23330
ఆకుపచ్చని ముగ్గు
రచన: వేంపల్లె షరీఫ్
పేజీలు: 16
వెల: రూ.100
ప్రతులకు: విశాలాంధ్ర;
నవోదయ బుక్ హౌస్
చెఱకుగడలు
రచన: చెఱకు
సత్యనారాయణ రెడ్డి
పేజీలు: 64
వెల: రూ. 100
ప్రతులకు:
ఫోన్: 94921 36195
పంచనామా
(కవిత్వం)
రచన: గుండు కరుణాకర్
పేజీలు: 94
వెల: రూ. 100
ఫోన్: 98668 99046
-కార్తికేయ నండూరి, 80081 53507