క్వాంటమ్ కంప్యూటింగ్ రంగంలో సరికొత్త విప్లవం సృష్టించేలా.. గూగుల్ ఆవిష్కరించిన సరికొత్త చిప్ ఏది?
440 బిలియన్ డాలర్ల సంపదను సృష్టించి.. ఈ ఘనత సాధించిన మొట్టమొదటి వ్యక్తిగా రికార్డు సృష్టించిన అమెరికా వ్యాపార దిగ్గజం ఎవరు?
ఐక్యరాజ్య సమితి అత్యున్నత పర్యావరణ పురస్కారం ‘చాంపియన్స్ ఆఫ్ ఎర్త్ అవార్డ్’కు ఎన్నికైన భారతీయ పర్యావరణ శాస్త్రవేత్త ఎవరు?
నైపుణ్యాలు కలిగిన యువతకు కేంద్రంగా గుర్తింపు పొంది.. ఎమర్జింగ్ టాలెంట్ విభాగంలో జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో నిలిచిన నగరం ఏది?
గంటకు వెయ్యి కిలోమీటర్ల వేగంతో వెళ్లగలిగే వినూత్న ట్రైన్ నెట్‌వర్క్‌ను చైనా ఇంజినీర్లు ఇటీవలే ఆవిష్కరించారు. మాగ్లెవ్ ట్రైన్ నెట్వర్క్ సాయంతో ప్రయాణించే ఈ రైళ్లను ఏమని పిలుస్తున్నారు?
అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రష్యాలో తయారైన ఓ యుద్ధనౌక.. తాజాగా భారత నౌకాదళంలో చేరింది.
ఇండియన్ నేవీ సామర్థ్యాన్ని మరోమెట్టు ఎక్కించగలిగే సామర్థ్యమున్న ఆ యుద్ధనౌక పేరేంటి?
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు ఓ సంప్రదాయం ఉన్నది. క్రిస్మస్ పండుగ తరవాతి రోజు (డిసెంబర్ 26)న తప్పకుండా టెస్ట్ మ్యాచ్ ఆడుతుంది. ఆ మ్యాచ్‌ను ఏమని పిలుస్తారు?
సముద్రపు నీటిలో కలిసి, కొన్ని గంటల్లోనే కరిగిపోయే పర్యావరణహిత ప్లాస్టిక్‌ను తాజాగా ఏ ఆసియా దేశపు శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు?
అతిపిన్న వయసులోనే వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్న భారత గ్రాండ్‌మాస్టర్ ఎవరు?
తాజాగా తిరుగుబాటుదారుల ఆక్రమణతో దేశాన్ని వీడిన మధ్య ఆసియా దేశం సిరియా
అధ్యక్షుడు ఎవరు?