అక్షరాక్షరంలో గాంధీజీ ఆత్మ దర్శనం!
గాంధీజీ చరిత్రను బాగా అధ్యయనం చేస్తే చాలా విషయాలు తెలుస్తాయి. ఆయన కేవలం స్వాతంత్య్ర సముపార్జనకు దోహదం చేశారని మాత్రమే చాలామంది భావన. అది సరికాదు.
గాంధీజీ చరిత్రను బాగా అధ్యయనం చేస్తే చాలా విషయాలు తెలుస్తాయి. ఆయన కేవలం స్వాతంత్య్ర సముపార్జనకు దోహదం చేశారని మాత్రమే చాలామంది భావన. అది సరికాదు. అహింసా పోరాటం, స్వాతంత్య్ర సాధన బాపూజీకి తాను నిర్వహించదల్చిన కొండంత లక్ష్యంలో గోరంత భాగాలే. సమాజోద్ధరణకు, వ్యక్తి ఉన్నతికి అహరహం కృషి చేశారాయన. దేశ నవ నిర్మాణం వైపు ఆలోచించారు. అదే సమయంలో సగటు భారతీయుడి వ్యక్తిత్వం బహుముఖీనంగా విస్తరించడానికి ప్రణాళికలు రచించారు. బాపూజీని పాశ్చాత్యులు అర్థం చేసుకున్నట్టు భారతీయులు అర్థం చేసుకోలేదేమో అనిపిస్తుంది. సగటు మనిషి వ్యక్తిత్వ వికాసం వైపు ఆయన వేసిన అడుగులు చాలామంది గుర్తించనే లేదు. ఆయనది ఒక రాష్ర్టానికో, ఒక దేశానికో, ఒక మతానికో లేదా ఒక కులానికో పరిమితమైన లక్ష్యం కాదు. విశ్వ మానవుడి లక్ష్యం. ప్రకృతి వనరులు సమృద్ధిగా ఉన్న మనదేశంలో అందరికీ పని ఉండాలంటే, అందరి కడుపులు నిండాలంటే యాంత్రీకరణకు కొద్దిగా దూరంగా ఉండాలని భావించారు. అంతేతప్ప యాంత్రీకరణకు ఆయన పూర్తి వ్యతిరేకం కాదు. ఇవాళ ఆర్బిట్రేషన్ సెంటర్లు కావాలని ప్రధాన న్యాయమూర్తి ఆకాంక్షిస్తున్న నేపథ్యంలో, ఈ విషయాన్ని గాంధీ వందేళ్ల క్రితమే చెప్పిన సంగతి మనం మర్చిపోకూడదు. దీన్నిబట్టి ఆయన ఎంత దీర్ఘదర్శి అనేది అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి విషయాలన్నీ తెలియాలంటే కాటా చంద్రహాస్ రచన ‘మహాత్మా గాంధీ – సమగ్ర జీవిత కథ’ చదవాల్సిందే! ఇందులోని అక్షరాక్షరంలో గాంధీజీ ఆత్మ ప్రతిబింబించడం రచయిత ప్రతిభకు నిదర్శనం!
మహాత్మా గాంధీ – సమగ్ర జీవిత కథ
కాటా చంద్రహాస్
పేజీలు 514; వెల : రూ. 299/-
ప్రతులకు: CLS పబ్లిషర్స్ LLP,
రోడ్ నం. 7, బంజారా హిల్స్
ఫోన్: 91 63039 93642, 80084 49678
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
- Tags
- books
- New Books Released
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. రెండు రోజుల్లోనే రూ.209 కోట్ల వసూళ్లు!
LK Advani: ఛాతిలో ఇన్ఫెక్షన్.. ఆస్పత్రిలో చేరిన అద్వానీ
Indigo Flight | బాంబు కలకలం.. అహ్మదాబాద్ నుంచి వచ్చిన ఇండిగో విమానానికి బెదిరింపు
Donadl Trump: రష్యాతో లింకున్న ఆంక్షలను ఎత్తివేసిన ట్రంప్.. భారత్కు భారీ ఊరట
Japan | జపాన్లో సాయంత్రం సమయంలో ఆహార పదార్థాలపై రాయితీ.. ఎందుకో తెలుసా..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

