నవ్వుల పువ్వుల ఇంద్రచాపం
తన తాజా రచన ‘నవ్వుల పువ్వుల వెన్నెల హాసం’లో చంద్రప్రతాప్ (సీపీ) తనదైన హాస్య ప్రియత్వాన్ని ప్రతిభావంతంగా ప్రదర్శించారు. ఈ ‘వెన్నెల హాసం’ ఆకాశం నుంచి ఊడి పడలేదు. దైనందిన జీవితానుభవాల్లోంచి పుట్టిన వెన్నెల వెలుగు ఈ పుస్తకం. భాషపై చంద్రప్రతాప్ పట్టుకు ఈ పుస్తకంలో ఎన్నో దృష్టాంతాలు. పత్రికల జిల్లా డెస్కులలో పనిచేసే వారికి, చేసిన వారికి ఎదురయ్యే అనుభవాలు, అందులో నవ్వించే అంశాలను ‘వెన్నెల హాసం’ వెలికి తీసింది.
సీరియస్ సందర్భాలలోనూ అలవోకగా దొర్లిన నవ్వులకు కొదవే లేదు. ఇవన్నీ హాస్య ప్రియత్వంతోనే సాధ్యం. ఆ దృష్టి ఉన్నవారికే అవి కనబడతాయి. భాషలో మెరుపులు, విరుపులు… పర్యవసానాలపై అవగాహన ఉన్న జర్నలిస్ట్, రచయిత కాబట్టే చంద్రప్రతాప్కు ఆయా అనుభవాలు రచనలకు వస్తువులయ్యాయి. విలేఖరులు, విలేకరులు… మధ్యతరగతి… దోర, దొర… ఈ పదాలు మారితే…? ఆ తరహా అనుభవాలు రచయిత వివరించిన తీరు పడీపడీ నవ్వేలా చేస్తుంది. ‘కుర్చీ విలువ’ రచయితకు అర్థమైన తీరు ఆసక్తికరం! పదాల అర్థాలు తెలియకుండా ఉపయోగించే వారికి ఇందులో చురకలు బాగా పెట్టారు. గంభీరంగా ఉందని పిల్లకు ‘ఆక్రందన’ పేరు పెట్టుకున్న వాళ్లు ఇప్పుడు ఎక్కువయ్యారు. వెన్నెల హాసంలో ‘లెజెండ్ VS సెలెబ్రిటీ’ హైలైట్. శ్రీమతికి ఈ పుస్తకాన్ని అంకితం ఇస్తూ రాసుకున్న వాక్యాలు రచయిత నిజాయతీకి నిదర్శనం. ప్రతి పేజీలో ఏదో ఒక మెరుపు మెరుస్తుంది. నవ్వు నానా రకాలు. వాటన్నిటి కూర్పు ‘వెన్నెల హాసం’.
నవ్వుల పువ్వుల వెన్నెలహాసం
రచన: చంద్రప్రతాప్ కంతేటి
పేజీలు: 104, ధర: రూ.125,
ప్రతులకు: ఫోన్: 80081 43507
ఔషధం (ఓ జీవధుని కవితా చికిత్స)
Books2
రచన: డాక్టర్ రవిశంకర్ ప్రజాపతి
పేజీలు: 215,
ధర: రూ. 250
ప్రచురణ: తెలుగు అసోసియేషన్ ప్రచురణలు
ఫోన్: 94407 68894
మధుఘంటికలు
Books1
రచన: డా. సుధాకర్ రెడ్డి
పేజీలు: 98, ధర: అమూల్యం
ప్రచురణ: ముదుగంటి ప్రచురణలు
ప్రతులకు: ఫోన్: 94901 93969
ఉపకారి (తెలంగాణ భాషానుశీలన వ్యాసాలు)
Books
రచన: బూర్ల వేంకటేశ్వర్లు
పేజీలు: 116, ధర: రూ. 150
ప్రచురణ: కరీంనగర్ సాహితి
ఫోన్: 94915 98040
అద్దేపల్లి నరసింహారావు