పుస్తక సమీక్ష – అందరికీ రాజ్యాంగం
ఏ దేశ పరిపాలనకైనా మౌలిక చట్టం తప్పనిసరి. దానినే ఆ దేశపు రాజ్యాంగంగా పేర్కొంటారు. మనల్ని మనం ఎలా పాలించుకోవాలనే విషయంలో ఉన్నంతలో మహోన్నతమైనవి అనుకున్న నియమాలను క్రోడీకరిస్తూ.. స్వాతంత్య్రోద్యమ నేతలు మనకు అందించిన గ్రంథమే భారత రాజ్యాంగం. దీని మూల ప్రతులు ఇంగ్లిష్, హిందీ భాషల్లో ఉన్నాయి. దీంతో ప్రాంతీయ భాషల ప్రజలు రాజ్యాంగ ప్రాథమిక విషయాల పట్ల అవగాహనను పెంచుకోలేకపోతున్నారు.
ఏ దేశ పరిపాలనకైనా మౌలిక చట్టం తప్పనిసరి. దానినే ఆ దేశపు రాజ్యాంగంగా పేర్కొంటారు. మనల్ని మనం ఎలా పాలించుకోవాలనే విషయంలో ఉన్నంతలో మహోన్నతమైనవి అనుకున్న నియమాలను క్రోడీకరిస్తూ.. స్వాతంత్య్రోద్యమ నేతలు మనకు అందించిన గ్రంథమే భారత రాజ్యాంగం. దీని మూల ప్రతులు ఇంగ్లిష్, హిందీ భాషల్లో ఉన్నాయి. దీంతో ప్రాంతీయ భాషల ప్రజలు రాజ్యాంగ ప్రాథమిక విషయాల పట్ల అవగాహనను పెంచుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో తెలుగులో సరళంగా రాజ్యాంగ భావనలను పరిచయం చేయడానికి శ్రీదేవీ మురళీధర్ నడుం బిగించారు. యువతరం, బాలల కోసం ‘సచిత్ర భారత సంవిధానం’ పుస్తకాన్ని తీసుకువచ్చారు. ఇందులో పదకొండు ప్రకరణాల్లో రాజ్యాంగ అవతరణ చరిత్ర, ప్రవేశిక, ప్రాథమిక హక్కులు, చట్టసభల స్వరూపం, న్యాయవ్యవస్థ, ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక విధులు, స్థానిక పాలన, ఓటు హక్కు ప్రాముఖ్యం గురించి సరళంగా వివరించారు. రాజ్యాంగ రూపకల్పనలో కీలకపాత్ర పోషించిన సరోజినీ నాయుడు, లీలా నాయర్, అమ్మూ స్వామినాథన్, హంసా మెహతా తదితర మహిళా నేతలు, ఆదివాసుల హక్కుల కోసం ఉద్యమించిన డాక్టర్ జైపాల్ సింగ్, రాజ్యాంగ రచన సలహాదారుడు సర్ బిఎన్ రావు, రచనా సంఘం సభ్యుడు అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ తదితరుల పరిచయం ఇవ్వడం విశేషం. ప్రముఖ చిత్రకారుడు నందలాల్ బోస్ ఆధ్వర్యంలో రాజ్యాంగానికి తగినట్టు చిత్రాలను గీసినవారి పరిచయం కూడా ఇచ్చారు. పుస్తకం చదివిన వారికి రాజ్యాంగ మౌలిక విలువల పట్ల మంచి అవగాహన కలుగుతుందనడంలో సందేహం లేదు.
సచిత్ర భారత సంవిధానం
రచన: శ్రీదేవీ మురళీధర్, పేజీలు: 192, ధర: రూ. 600
ప్రతులకు: ఇ-మెయిల్: ProjectNishedh@Gmail.com
బుక్ షెల్ఫ్
ఒకప్పుడు (కవిత్వం)
రచన: రాజేందర్ జింబో
పేజీలు: 138,
వెల: రూ. 100
ప్రచురణ:
ప్రోజ్ పోయెట్రీ ఫోరం
ఫోన్: 93966 10639
వ్యాసావళి
రచన: పున్న అంజయ్య
పేజీలు: 160,
వెల: రూ. 150
ప్రతులకు: ప్రముఖ పుస్తక కేంద్రాలు
ఫోన్: 93966 10639
ప్రమిద
(రావి రంగారావు సాహిత్య స్వర్ణోత్సవ సంచిక)పేజీలు: 192,
వెల: రూ. 50
ఫోన్: 98854 59193
-చింతలపల్లి హర్షవర్ధన్
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రూ.280 కోట్ల పనులకు మోక్షమెప్పుడో.. రోడ్ల పనుల డిమాండ్‌తో మక్తల్–నారాయణపేట రహదారిపై చిట్టెం పాదయాత్ర..
Ranabaali | ‘రణబాలి’ ఫస్ట్ డే కలెక్షన్స్.. విజయ్ దేవరకొండకు ఈ చిత్రంతోను నిరాశేనా ..!
Chiranjeevi | చిరంజీవి సాయం.. సెన్సార్ చిక్కుల నుంచి బయటపడిన ‘కామ్రేడ్ కల్యాణ్’
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?




