అర్జునుడు యోధుడు. సమస్త అస్ర్తాలూ తెలిసినవాడు. సవ్యసాచిగా గుర్తింపు పొందినవాడు. ఎన్ని ఘనతలు ఉంటేనేం.. కురుక్షేత్ర సంగ్రామ వేదికపై చేతులెత్తేశాడు. శ్రీకృష్ణుడి గీతోపదేశం తర్వాతే, పార్థునికి తత్వం బోధపడింది. తన శక్తిసామర్థ్యాలు పూర్తిస్థాయిలో ప్రదర్శించాడు. అంతిమంగా విజయుడనే పేరును సార్థకం చేసుకున్నాడు. ఈ లోకంలో అభినవ అర్జునులు ఎందరో ఉన్నారు.
ఎన్ని డిగ్రీలు ఉన్నా, ఎంతటి విషయ పరిజ్ఞానం ఉన్నా.. ప్రపంచ వేదికపై మాట్లాడాల్సిన సమయం వచ్చేసరికి తడబడుతున్నారు. మస్తిష్కంలో ఎన్ని ఆలోచనలు ఉన్నప్పటికీ, వాటిని సూటిగా, స్పష్టంగా అభివ్యక్తం చేయడంలో విఫలమవుతున్నారు. వ్యక్తిగా ఎంత కులాసాగా ఉన్నా.. స్టేజ్ ఫియర్ కారణంగా వక్తగా మాత్రం రాణించలేకపోతున్నారు ఎందరో! ఆ భయాన్ని అధిగమిస్తేనే పోటీ ప్రపంచం మనల్ని గుర్తిస్తుంది.
వక్తగా రాణించాలంటే ఏం చేయాలో విశ్లేషిస్తూ బాల్రెడ్డి దొమ్మాట రాసిన పుస్తకం ‘వక్త’ (ది ఆర్ట్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్). తపస్య, చైతన్య ఈ రెండు పాత్రలతో విజ్ఞాన తపస్యులను చైతన్యపరిచే ప్రయత్నం చేశారు
రచయిత. గొప్ప ఉపన్యాసకుడిగా రూపుదిద్దుకునే క్రమంలో ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయో, వాటిని ఎలా అధిగమించాలో సహేతుకంగా వివరించారు. జీవితం అంటేనే పెను సవాళ్లు.
వాటిని అధిగమిస్తేనే విజయం. అన్నిసార్లూ గెలుపు మన సొంతం కాకపోవచ్చు. అపజయాలూ తారసపడవచ్చు. ఓటమిని ఓర్చుకో గలిగినవాడే స్థితప్రజ్ఞుడు. గత చరిత్రలోని అంశాలతోపాటు వర్తమాన విషయాలనూ జోడిస్తూ కథనాత్మక శైలిలో కౌన్సెలింగ్ చేశారు. స్టేజ్ ఫియర్తో సతమతమవుతున్న వారు, వక్తగా రాణించాలనుకునే వారు తప్పక చదవాల్సిన పుస్తకం ఇది.
రచయిత: బాల్రెడ్డి దొమ్మాట
పేజీలు: 178, వెల: రూ.200
ప్రతులకు: రచయిత ఫోన్:
80081 16606
ఆడపిల్ల జీవితంలో మెరుపులు పుట్టింటి కట్టుబాట్లలో మసకబారుతాయి. ఆడకూతురు ఆనందాలు అత్తారింటికి వెళ్లే దారిలోనే ఆవిరవుతాయి. ప్రపంచం ఎంత పురోగమిస్తున్నా ఆడపడుచు విజయాలను మాత్రం మనసారా అంగీకరించలేకపోతున్నది. ప్రస్తుత సమాజంలో పుట్టింది ఆడబిడ్డ అని తెలియగానే సంతోషం పట్టలేక మిఠాయిలు పంచే తండ్రులు ఎంతమంది? ఆడపిల్లను అబ్బురంగా పెంచుకునే తండ్రులూ, అబ్బాయి పుట్టకపోతాడా అని లోలోపల ఎదురుచూస్తూ ఉంటారు. అలాంటి సమాజంలో పుట్టిన ఆడకూతురు జీవితకథే ‘చైత్ర’ నవల. బాల్యం నుంచి ఈసడింపులు మాత్రమే తెలుసా చిన్నారికి. మార్కులు ఎక్కువొస్తే అభినందించేవాళ్లు లేరు. అడుగడుగునా తన ఆశలను పురుషాహంకారం వెక్కిరించినా.. వెనక్కి తిరిగి చూసుకోలేని ఓ బాలిక విజయగాథ ఇది. ఈ తరం యువతకు ప్రతీక చైత్ర. బాధ్యతాయుతమైన గమ్యాన్ని నిర్దేశించుకున్న చైత్ర.. తను అనుకున్న లక్ష్యాన్ని అందుకుందా లేదా అన్నది నవలలో ఆసక్తికరంగా చూపించారు రచయిత్రి స్ఫూర్తి కందివనం. కథా గమనాన్ని కవనంలా కొనసాగించారు.
వర్తమాన అంశాలు, సరిహద్దులు, దేశ
రక్షణ తదితర అంశాలను స్పృశిస్తూ, సైనికుల త్యాగాలను పాఠకులకు అర్థమయ్యేలా ఆవిష్కరించారు. ‘చైత్ర’ గాథ ఓ విజేత కథ, ఎందరినో విజేతలుగా తీర్చిదిద్దే వీరోచిత కథ. కాలంతో పరుగులు తీసే నగరాల్లోనూ మహిళా సాధికారత మేడిపండు చందంగా తయారైంది. పరోక్షంగా వీటిని ప్రస్తావిస్తూ స్త్రీవాద భావాలకు తన నవల ద్వారా ఊతమిచ్చే ప్రయత్నం చేశారు స్ఫూర్తి కందివనం.
రచయిత్రి: స్ఫూర్తి కందివనం
పేజీలు: 276, వెల: రూ.200
ప్రతులకు: 95627 45117
రచన: ఏటూరి నాగేంద్రరావు
పేజీలు: 124, వెల: రూ. 100 /
ప్రచురణ: నవమల్లెతీగ
ప్రతులకు: అన్ని ప్రముఖ
పుస్తక కేంద్రాలు
ఫోన్: 74166 65323
(యూరపు పునరుద్దీపన
యుగంలో కళలు)
రచన: ప్రొ. వి. శ్రీనివాస చక్రవర్తి
పేజీలు: 302, వెల: రూ. 300 /-
ప్రచురణ: పీకాక్ బుక్స్
ప్రతులకు: ప్రముఖ పుస్తక కేంద్రాలు
రచన: శివరామకృష్ణ ఆకుల
పేజీలు: 92, వెల: రూ. 80 /-
ప్రచురణ: నవజ్యోతి పబ్లిషర్స్
ప్రతులకు: అన్ని ప్రముఖ
పుస్తక కేంద్రాలు, ఫోన్: 99486 61935
జి.యస్.వరదాచారి
పేజీలు: 112,వెల: రూ. 100 /-
ప్రచురణ: వయోధిక
పాత్రికేయ సంఘం
ప్రతులకు: అన్ని ప్రధాన పుస్తక కేంద్రాలు,
ఫోన్: 93947 12208