పుస్తక సమీక్షl నర్మదా పరిక్రమ కరదీపిక
నమామి దేవి నర్మదే
(నర్మదా పరిక్రమ యాత్రానుభవ కదంబం)
రచన: సంధ్యా యల్లాప్రగడ
పేజీలు: 152; వెల: రూ. 200
ప్రచురణ: అచ్చంగా తెలుగు ప్రచురణ
ప్రతులకు: నవోదయ బుక్ హౌస్
ఫోన్: 85588 99478
భారతదేశంలో పశ్చిమ దిశకు ప్రవహించే నదుల్లో పెద్ద నది నర్మద. అంతేకాదు మిగిలిన నదులతో పోలిస్తే ఈ నదికి ఓ సాంస్కృతిక విశిష్టత ఉంది. అదే నదీ పరిక్రమ. అంటే ఏమీలేదు… నర్మదా నది తీరంలో ఒక ప్రసిద్ధ ప్రదేశం నుంచి ప్రదక్షిణం మొదలుపెట్టి మళ్లీ అక్కడికే చేరుకోవడం అన్నమాట! ఇక ప్రదక్షిణ మార్గం దాదాపు 3,000 కిలోమీటర్లకు పైగానే ఉంటుంది. కాబట్టి, కాలినడకన వీలైనవాళ్లు కాలినడకన, లేదంటే వాహనాల్లో ప్రయాణిస్తూ అక్కడక్కడా నడుస్తూ ఈ పరిక్రమ పూర్తిచేస్తారు. జన్మస్థలం మధ్యప్రదేశ్‌లోని అమర కంటక్ మొదలుకొని జబల్పూర్, పాలరాతి కొండల మార్బుల్ రాక్స్, ఓంకారేశ్వర్, మహేశ్వర్, ఉజ్జయిని, ఇండోర్, హోషంగాబాద్ (నర్మదాపూర్), మాండు, అంకాలేశ్వర్ వరకు నర్మదా నదీ తీరం ఎన్నో విశేషాల సమాహారం. ఈ ప్రదేశాలన్నిటినీ తమ నదీ పరిక్రమలో సందర్శించి, అనుభూతి చెందిన విశేషాలను రచయిత్రి సంధ్యా యల్లాప్రగడ ‘నమామి దేవి నర్మదే’ పుస్తకంలో కండ్లకు కట్టారు. ఇక నర్మదా తీరం అంటే పుణ్యక్షేత్రాలు మాత్రమే కాదు, మహాకవి కాళిదాసు, అద్వైత వేదాంతి ఆదిశంకరులు, ఆయన గురువు గోవింద భగవత్పాదులు, మండనమిశ్రుడు, ఇండోర్ మహారాణి అహల్యాబాయి హోల్కర్, గోండు రాణి దుర్గావతి తదితరుల జ్ఞాపకాలను పొదువుకున్న ప్రాంతం. ఈ చారిత్రక విషయాలనూ రచయిత్రి వివరించారు. తమ పదహారు రోజుల పర్యటనను 152 పేజీల్లో సరళంగా పొందుపరిచారు. పుస్తకం చివర్లో పరిక్రమ చేయాలనుకునే వారికి సూచనలు కూడా ఇచ్చారు. నర్మదా నది గురించి, నదీ మాహాత్మ్యం గురించి తెలుసుకోవడానికి ఉపకరించే కరదీపిక ‘నమామి దేవి నర్మదే’.
వ్యవసాయ విజయాలు

- ప్రకృతి సైన్యంప్రచురణ: రైతునేస్తం
- పేజీలు: 277; వెల: రూ. 500
- ప్రతులకు: రైతునేస్తం పబ్లికేషన్స్
- ఫోన్: 9676797777
సృష్టిలో తొలి శాస్త్రవేత్త రైతే. విత్తు మొలకెత్తుతుందనీ, మొలక మొక్కవుతుందనీ, మొక్క గింజలను ఇస్తుందనీ గుర్తించాడు కాబట్టే.. పంటలు పండించాడు. అన్నం గిన్నెగా అవతరించి.. అందరి ఆకలీ తీరుస్తున్నాడు. మానవజాతి మనుగడ చరిత్రలో ప్రతి రైతూ కథానాయకుడే. అందులోంచి ఓ వందమందిని ‘ప్రకృతి సైన్యం’గా పరిచయం చేస్తున్నది రైతునేస్తం ప్రచురణ సంస్థ. ఇందులో ప్రతీ కథనం కదిలించేదే, కొత్త ఆలోచన రేకెత్తించేదే. సుభాశ్ పాలేకర్ స్ఫూర్తి, నాన్న క్యాన్సర్ మరణం తాలూకు చేదు అనుభూతి.. నల్లగొండ జిల్లా మహిళ వాకిటి విజయ ప్రకృతి సేద్యం చేస్తున్న తీరు.. ప్రపంచానికి ఓ ఆశావాద సంకేతం. కమతం చిన్నదే కావచ్చు, ఆశయం పెద్దదైతే అద్భుతాలు చేయవచ్చని నిరూపించాడు
నామన రోశయ్య. డబ్భు అయిదు సెంట్లలో లక్ష రూపాయల రాబడి సాధించిన ఆ ఏడుపదుల రైతు జీవితమే ఓ వ్యవసాయ విశ్వ విద్యాలయం. తాతముత్తాతల నుంచి నేర్చుకున్న వ్యవసాయ విధానాలకే పరిమితం కాకూడదు. నిత్య విద్యార్థిలా కొత్తదనాన్ని స్వాగతించాలి. కొత్త పంటలను నేలకు పరిచయం చేయాలి. ఇబ్రహీంపట్నం రైతు వనిపెల్లి శ్రీనివాస్ ఈ సూత్రాన్నే నమ్మాడు. డ్రాగన్‌ఫ్రూట్స్ పండిస్తూ నలుగురికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. పాతకు జాతర చేస్తూ.. అంతరించిపోతున్న విత్తన సంపదను కాపాడుతున్న యాదగిరి శ్రీనివాస్, బత్తాయి సాగులో బ్రహ్మాండమైన ప్రగతి సాధించిన జనార్దన్‌రెడ్డి, పెరటి వైద్యంతో చీడపీడల పనిపడుతున్న కొమ్మూరి విజయ్‌కుమార్.. ఇలా ప్రతికథా సేద్య దేవతకు నైవేద్యమే. ప్రతి రైతు ఇంటా ఉండాల్సిన పుస్తకమిది.
బుక్ షెల్ఫ్
శ్రీనాథ్ కథలు

రచన: దిగుమర్తి సుందర శ్రీనాథ్
పేజీలు: 190, వెల: రూ. 150
ప్రచురణ: జె.వి.పబ్లికేషన్స్
ప్రతులకు: నవోదయ బుక్ హౌస్
ఫోన్: 80163 10140
బాల్యం (కవితా సంకలనం)

సంపాదకులు:
గుదిబండి వెంకటరెడ్డి
పేజీలు: 84, వెల: రూ. 100
ప్రచురణ: జీవీఆర్ ప్రచురణలు
ప్రతులకు: ఫోన్: 98498 82783
శ్రీవరదాభ్యుదయము(పద్యకావ్యము)

రచన: పెండ్యాల కిషన్‌శర్మ
పేజీలు: 328, వెల: రూ. 300
ప్రచురణ: ధృతి టి.వి. పబ్లికేషన్స్
ప్రతులకు: ఫోన్: 89194 77539
బి.సి.కులాల రిజర్వేషన్లు సమస్యలు పరిష్కారం

రచన: కోడెపాక కుమార స్వామి
పేజీలు: 152, వెల: రూ. 200
ప్రచురణ: భూమి బుక్ ట్రస్ట్
ప్రతులకు: ప్రముఖ పుస్తక కేంద్రాలు
విశాలక్షి (దీపావళి కథలు)

పేజీలు: 210, వెల: రూ. 200
ప్రతులకు:
విశాలాక్షి సాహిత్య మాసపత్రిక
ఫోన్: 94405 29785
-చింతలపల్లి హర్షవర్ధన్
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

