Cycling Instructions | కరోనా మహమ్మారి తర్వాత ఆహారం, ఆరోగ్యం, వ్యాయామం విషయంలో చాలా శ్రద్ధ చూపుతున్నారు జనం. సైక్లింగ్‌కు ఆదరణ పెరిగింది. బస్సులు, ఆటోలు, క్యాబ్‌లతో పోలిస్తే సైకిల్ సవారీ సురక్షితం కూడా. కాకపోతే, సైకిల్ మీద వెళ్తున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
సైక్లింగ్‌లో అధిక శక్తి అవసరం కాబట్టి గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది. ఆ సమయంలో హార్ట్ రేట్ మానిటర్ ద్వారా హృదయ స్పందనలను తెలుసుకోవచ్చు. దీనిని ఛాతీ భాగంలో
ఉంచుకోవాలి.
సైకిల్వాలాలు హెల్మెట్ తప్పకుండా ధరించాలి. పాలి కార్బొనేట్ హెల్మెట్ అయితే మరీ సౌకర్యంగా ఉంటుంది. ఏమాత్రం ఉక్క పోయకుండా దీన్ని డిజైన్ చేశారు. తేలికగా ఉంటుంది కూడా. కాబట్టి దూర ప్రయాణాల్లో సౌకర్యంగా అనిపిస్తుంది. మెడ మీద భారం పడదు. మెడ నొప్పివేయదు.
సైకిల్ ప్రయాణ మార్గాన్ని, వేగాన్ని సూచించే స్మార్ట్ సైక్లోమీటర్తో (సైకిల్ కంప్యూటర్) ఎన్నో ప్రయోజనాలు. గమ్యాన్ని చేరుకోవడానికి ఎంత సమయం పడుతుందో తెలుసుకోవచ్చు, మార్గమధ్యంలో ఏదైనా ఇబ్బంది కలిగితే, మనం ఉన్న ప్రదేశాన్ని కచ్చితంగా గుర్తించి, అంబులెన్స్‌కు స్పష్టమైన సమాచారం అందించవచ్చు. ట్రాఫిక్ ఇబ్బందులు, రోడ్డు మరమ్మతులు తదితర సందర్భాల్లో.. ప్రత్యామ్నాయ మార్గాలను కూడా సూచిస్తుంది. స్మార్ట్ సైక్లోమీటర్లలో రెండు రకాలు. సైకిల్ హ్యాండిల్ బార్‌కు బిగించే జీపీఎస్ మానిటర్ ఒకరకం. మరోరకం మీటర్‌ను మణికట్టుకు కట్టుకోవచ్చు. స్మార్ట్ ఫోన్‌తో అనుసంధానం చేసుకోవచ్చు.
చట్ట ప్రకారం సైకిల్‌కు హెడ్ ల్యాంప్ తప్పనిసరి కాదు. కానీ, సైకిల్ కొన్న తర్వాత హెడ్ లైట్ అమర్చుకోవాలి. ఇది రాత్రి వేళల్లో దారి చూపుతుంది. ఎదురుగా వస్తున్న వాహన చోదకుడికి మన సైకిల్ జాడ తెలుస్తుంది. హైవేలపై ప్రయాణం చేస్తున్నప్పుడు టెయిల్ లైట్స్ అవసరం మరింత ఎక్కువ. వెనుక నుంచి వేగంగా వచ్చే వాహనాలకు మన ఉనికి తెలుస్తుంది.
సైకిల్ పెడల్‌కు పవర్ మీటర్‌ను జతచేస్తే చాలు.. సైకిల్ వేగంగా పోవడానికి మనం ఎంత శక్తిని వినియోగిస్తున్నామన్నది లెక్కిస్తుంది. సైకిల్ తొక్కే వ్యక్తి శారీరక సామర్థ్యంలో మెరుగుదలను కూడా ‘పవర్’ మీటర్ ద్వారా మనం తెలుసుకోవచ్చు.
సైకిల్ ప్రయాణం ప్రారంభమయ్యే చోటు నుంచి ఎక్కడికి చేరుకోవాలనేదే కాదు.. ఏయే మార్గాల గుండా వెళ్లే అవకాశం ఉన్నదో కూడా ముందే తెలిస్తే.. ప్రయాణం సాఫీగా సాగుతుంది. కాకపోతే, జీపీఎస్ రూట్ యాప్స్‌ను ప్రయాణానికి ముందే మొబైల్, సైకిల్ కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసుకోవాలి.
Cycling | 3 గంటల్లో 40 కి.మీ. సైకిల్ తొక్కిన 75 ఏండ్ల వృద్ధుడు”
“ఫిట్నెస్ మంత్ర.. ఇండియాలో సైక్లింగ్‌కు ఫుల్ డిమాండ్!!”
“మన దగ్గర డ్రైవింగ్ సీటు కుడివైపు ఉంటే.. అమెరికాలో ఎడమ వైపు ఎందుకుంటుంది ? ఎందుకీ తేడా?”
Mosquito Bites | దోమలు కొందరినే కుడతాయెందుకు? కారణం ఏమై ఉంటుంది?