Cycling | 3 గంటల్లో 40 కి.మీ. సైకిల్ తొక్కిన 75 ఏండ్ల వృద్ధుడు
Cycling | మల్కాజ్‌గిరికి చెందిన ఓ 75 ఏండ్ల వృద్ధుడికి వయసు అడ్డు రాలేదు. 3 గంటల్లో 40 కిలోమీటర్ల మేర సైకిల్ తొక్కి శభాష్ అనిపించుకుంటున్నారు. రిటైర్డ్ రైల్వే ఉద్యోగి పాండే భార్య కొన్ని నెలల క్రితం మరణించింది. సాధ్యమైనంత వరకు

మల్కాజ్‌గిరికి చెందిన ఓ 75 ఏండ్ల వృద్ధుడికి వయసు అడ్డు రాలేదు. 3 గంటల్లో 40 కిలోమీటర్ల మేర సైకిల్ తొక్కి శభాష్ అనిపించుకుంటున్నారు. రిటైర్డ్ రైల్వే ఉద్యోగి పాండే భార్య కొన్ని నెలల క్రితం మరణించింది. సాధ్యమైనంత వరకు తాను ఒంటరిని అనే ఫీలింగ్ లేకుండా బతకాలనుకున్నారు. అందుకోసం ఏదైనా చేయాలని పాండే నిర్ణయించుకున్నారు. దీంతో ఆ వృద్ధుడి దృష్టి సైక్లింగ్‌పై పడింది. ఈ క్రమంలో నగరంలో నిర్వహించిన పలు సైక్లింగ్ ఈవెంట్స్‌లో పాల్గొన్నారు. ఈ ఏడాది పంద్రాగస్టు రోజు నిర్వహించిన ఫ్రీడమ్ రైడ్‌లోనూ పాండే పాల్గొన్నారు. అలా సైక్లింగ్ పోటీల్లో పాండే పాల్గొంటూ మంచి నైపుణ్యాన్ని సంపాదించారు.
ఈ క్రమంలో ఆదివారం సఫిల్‌గూడ పార్క్ నుంచి చార్మినార్‌కు గంట సమయంలో సైకిల్‌పై వెళ్లారు. మళ్లీ చార్మినార్ నుంచి నెక్లెస్ రోడ్డు మీదుగా సఫిల్‌గూడ పార్క్‌కు రెండు గంటల్లో చేరుకోగలిగారు. అలా 3 గంటల్లో 40 కిలోమీటర్లు చుట్టేశాడు పాండే. ఈ రైడ్ పూర్తి చేసిన తర్వాత తనలో ఆత్మ విశ్వాసం పెంపొందిందని పాండే పేర్కొన్నారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా యువత నడుచుకోవాలని పాండే సూచించారు. కార్బన్ ఉత్పత్తులను తగ్గించాల్సిన బాధ్యత యువతపై ఉందన్నారు.
పాండే ప్రతి రోజు 40 నిమిషాల పాటు సైక్లింగ్, ఆరు నుంచి ఏడు కిలోమీటర్లు వాకింగ్ చేస్తారు. ఆయనకు కొన్నేండ్ల క్రితం మోకాళ్ల సర్జరీ కూడా అయింది. మిగతా సమయాల్లో 7 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఉచితంగా పాఠాలు బోధిస్తారు. తన భార్య బతికున్న సమయంలో ఈ పేద విద్యార్థులకు ట్యూషన్లు చెప్పేది. ఆమె చనిపోయిన తర్వాత ఆ బాధ్యతలను తాను తీసుకున్నానని పాండే చెప్పుకొచ్చారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

