మనిషి పరిపూర్ణత్వాన్ని సాధించడానికి దారి చూపే ఆచరణే- నైతికత. మనిషి నైతికతపై అతని గొప్పతనం ఆధారపడి ఉంటుంది. జ్ఞానర్జనతో నైతిక విలువలు అలవడుతాయి. ‘ఇస్లాం నైతిక స్పృహ’ పుస్తకం మనకు అలాంటి జ్ఞానాన్ని అందిస్తుంది. ఇస్లాం ధర్మంలోని, ఖురాన్లోని నైతిక ఆదేశాలను, బోధనలను ఇందులో చక్కగా వివరించారు రచయిత. ఆర్థిక సంయమనం ప్రతి మనిషికి చాలా అవసరమని, ఎవరినీ అతిగా అనుమానించకూడదని ఇస్లాం బోధ.
ఇతరులపై కారణం లేకుండా నిందలు వేయకూడదని, వారి గురించి చెడుగా మాట్లాడకూడదని ఇస్లాం మర్యాద నేర్పిస్తుంది. అనాథలు, నిరుపేదలు, యాచకుల పట్ల దయతో వ్యవహరించడం మనిషి నైతికతలో భాగమని వివరిస్తుంది. అరిషడ్వర్గాలను జయించడంలోనే జీవిత రహస్యం దాగి ఉందని వెల్లడిస్తుంది. మన కర్మలకు మనం జవాబుదారీగా ఉండాలని… నైతికతకు బలమైన పునాది అయిన ధైర్యాన్ని జీవితంలో ఎప్పుడూ కోల్పోకూడదని గుర్తు చేస్తుంది. లోక కల్యాణమే ఇస్లాం లక్ష్యమని, అందుకు మనుషులు ఎలాంటి నైతిక ప్రవర్తన కలిగి ఉండాలో ఈ పుస్తకం చక్కగా వివరిస్తుంది.
రచన: అమర్పాల్ సింగ్
ప్రచరణ: తెలుగు ఇస్లామిక్ పబ్లికేషన్స్ ట్రస్టు
పేజీలు: 55 వెల: ఉచితం
సంప్రదించాల్సిన నెంబరు: 1800 572 3000
సోమర్సెట్ మామ్ రంగుల పరదా
అనువాదం: బీనాదేవి
పేజీలు: 144,
వెల: రూ.100
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
నేనూ.. నా నల్లకోటు (కథలు)
రచన: రాజేందర్ జింబో
పేజీలు: 151
వెల: రూ.150
ప్రతులకు: 86399 72160
రచన: విద్యాసాగర్ నూగూరి
పేజీలు: 128
వెల: రూ.150
ప్రతులకు: పాలపిట్ట బుక్స్- 98487 87284, ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు