వంటగది సింక్‌లో ఆహార వ్యర్థాలు పేరుకుపోయి నీళ్లు నిలిచిపోవడం చాలామందికి ఎదురయ్యే సమస్యే. అలాంటప్పుడు శుభ్రం చేయడం చాలా కష్టంగా మారుతుంది. అలాంటి కష్టాలకు గుడ్‌బై చెప్పేస్తూ మార్కెట్లోకి వచ్చింది సింక్ క్లీనింగ్ వైర్. ఈ స్పెషల్ టూల్ డ్రెయిన్లలో ఉండే బ్లాకేజీలను నిమిషాల్లో తొలగిస్తుంది. ఈ క్లీనింగ్ వైర్ సాధారణ వైర్ కాదు. చాలా తేలికగా, గట్టిగా ఉంటుంది. దీంతో పైపుల వంపుల్లో, మూలల్లో కూడా సులభంగా వెళ్లి శుభ్రం చేస్తుంది. 90 సెం.మీ పొడవు ఉండటంతో సింక్ గొట్టంలో బాగా లోపలి వరకు వెళ్లి పేరుకుపోయిన వ్యర్థాలను బయటికి తీసుకొస్తుంది. దీనికి ఉన్న ప్రత్యేకమైన హ్యాండిల్‌తో పైపుల్లో చెత్తని సులభంగా పట్టుకుని, మెలి తిప్పడానికి వీలుంటుంది. వైర్ వాడాక మళ్లీ చుట్టచుట్టి పెట్టుకోవచ్చు. కాంపాక్ట్‌గా ఉండటంతో ఎక్కడైనా చిన్నచోటులో స్టోర్ చేసుకోవచ్చు. ఒక్క సింకే కాదు.. బాత్‌టబ్, షవర్ డ్రెయిన్లలో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించడానికి కూడా ఈ వైర్ చాలా ఉపయోగపడుతుంది. ఇక డ్రెయిన్ క్లీనింగ్ కోసం పదేపదే ప్లంబర్ని పిలవాల్సిన అవసరం ఉండదు.
ధర: రూ.412
దొరుకు చోటు: అమెజాన్.కామ్
ఫోన్ చేతిలో ఉందంటే రోజులో టైమ్ పాస్‌కి పాటలు వినడం, సినిమాలు చూడటం, గేమ్‌లు ఆడటం చేస్తుంటాం. అలాంటప్పుడు చెవులకు అనువైన హెడ్సెట్ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారా? అయితే, జెబ్రానిక్స్ కొత్తగా జెబ్-థండర్ హెడ్ఫోన్లను తీసుకొచ్చింది. స్టయిలిష్ కలర్స్‌తో వచ్చిన ఈ హెడ్ఫోన్లలో.. అధునాతన ఫీచర్లు చాలా ఉన్నాయి. ముఖ్యంగా, దీని బ్యాటరీ లైఫ్ చూస్తే షాక్ అవ్వాల్సిందే. 60 గంటల బ్యాకప్ ఇస్తుంది. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే.. ఏకంగా 60 గంటల పాటు (50% వాల్యూమ్‌లో) పాటలు వినొచ్చు. ముఖ్యంగా గేమర్స్ కోసం ఇందులో గేమింగ్ మోడ్ కూడా ఉంది. కాల్స్ మాట్లాడేటప్పుడు చుట్టూ ఉండే శబ్దం వినిపించకుండా ఉండేందుకు ఇందులో ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ (ENC) ఫీచర్ ఉంది. డ్యూయల్ పెయిరింగ్ ఫీచర్ ఉండటంతో ఒకేసారి రెండు డివైజ్‌లను కనెక్ట్ చేసుకోవచ్చు. బ్లూటూత్ 5.3, ఆక్స్ కేబుల్‌తో దేనికైనా ఇట్టే పెయిర్ అవుతుంది.
ధర: రూ.1699
దొరుకు చోటు: ఫ్లిప్‌కార్ట్.కామ్
ప్రయాణాలు చేసేటప్పుడు.. ఆఫీసుకి వెళ్లేటప్పుడు బ్యాగులో చాలారకాల కేబుల్స్ పెట్టుకోవడం చేస్తుంటాం. ఐఫోన్‌కి ఒక కేబుల్, ఆండ్రాయిడ్ ఫోన్‌కు ఇంకొకటి, పవర్ బ్యాంక్‌కు మరొకటి.. ఇలా ఒక్కోదానికి ఒక్కోటి వాడుతుంటాం. దీంతో కేబుల్స్ చిక్కుబడి పోవడం.. ఏవి ఎక్కడున్నాయో వెతుక్కోవడం పెద్ద తలనొప్పి. అందుకే ఈ సమస్యకు చెక్ పెట్టేస్తూ.. 60W USB Fast Charging Travel Data Cable Set మార్కెట్లోకి వచ్చింది. ఇది కేవలం చార్జింగ్ కేబుల్ మాత్రమే కాదు.. జేబులో పట్టే ఒక చిన్న టూల్‌కిట్ అని చెప్పొచ్చు. ఈ కిట్‌లో మీకు కావాల్సిన అన్నిరకాల కేబుల్స్, చార్జింగ్ అడాప్టర్లను చక్కగా సెట్అప్ చేసుకోవచ్చు. అంతేకాదు.. ఇది 60W పవర్ డెలివరీ ఫాస్ట్‌చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. దీంతో ఫోన్, ట్యాబ్లెట్లు వేగంగా చార్జ్ అవుతాయి. దీంతోపాటు కొన్ని అడాప్టర్స్ కూడా ఉన్నాయి. ఈ చార్జింగ్ కిట్ కేబుల్స్ వరకే పరిమితం కాదు. ఇందులో ఇంకా చాలా ఫీచర్లు ఉన్నాయి. ఇందులో ఒక మైక్రో సిమ్, ఒక నానో సిమ్ పెట్టుకోవచ్చు. విదేశాలకు వెళ్లేటప్పుడు లేదా సిమ్ మార్చేటప్పుడు, మన పాత సిమ్‌ను ఇందులో భద్రంగా పెట్టుకోవచ్చు.
ధర: రూ.499
దొరుకు చోటు: అమెజాన్.కామ్
టైమ్ చూడటానికి మొబైల్ వాడటం మామూలే. కాస్త భిన్నంగా ఓ అలారం క్లాక్‌తో రోజును మొదలుపెడదామని అనుకుంటే. అంతేకాదు.. టైమ్తోపాటు తేదీ, ఉష్ణోగ్రత లాంటివీ ఈ అలారం డిస్ప్లేలో చూపిస్తే ఎలా ఉంటుంది? అలాంటి ఆసక్తికరమైన ఫీచర్లతో వచ్చిందే AERYS డిజిటల్ అలారం క్లాక్. అధునాతన ఫీచర్లు ఆఫీసుల్లో, ఇళ్లలో, బెడ్రూమ్లో వాడుకోవచ్చు. ముఖ్యంగా విద్యార్థులకు ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. క్లాక్‌లో ఉన్న ప్రత్యేకమైన ఫీచర్.. దాని ఆటోమేటిక్ సెన్సర్. గదిలో కాంతి తక్కువగా ఉంటే.. దీని డిస్ప్లే బ్రైట్నెస్ ఆటోమేటిక్‌గా తగ్గుతుంది. దీంతో రాత్రి సమయంలో కళ్లకు ఇబ్బంది ఉండదు. అంతేకాకుండా, దీని అలారం సౌండ్ కూడా చాలా విలక్షణంగా ఉంటుంది. నిద్ర లేపేటప్పుడు ఒక్కసారిగా పెద్ద శబ్దం రాకుండా.. మెల్లగా మొదలై క్రమంగా పెరుగుతుంది. దీంతో నిద్ర నుంచి మెల్లగా, సున్నితంగా మేల్కోవచ్చు. ఈ ఫీచర్‌ను ‘త్రీ స్టెప్ క్రెసెండో అలారం’ అంటారు. ఇక అలారం పైభాగంలో ఒకే ఒక బటన్ ఉంటుంది. దాన్ని నొక్కితే స్నూజ్ ఫంక్షన్ యాక్టివేట్ అవుతుంది. అంతేకాదు.. డిస్ప్లే బ్రైట్‌నెస్‌ని కూడా పెంచొచ్చు.
ధర: రూ.1699
దొరుకు చోటు: ఫ్లిప్‌కార్ట్.కామ్