జ్ఞాపకాలు – కథలు.. వీటిది విడదీయరాని బంధం! ప్రతి కథ పుట్టుకకూ.. ఏదో ఒక జ్ఞాపకమే మూలాధారం! జీవిత ప్రయాణంలో ఎన్నో అనుభవాలు ఎదురవుతాయి. మనల్ని ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటాయి. అలా వెంటాడే జ్ఞాపకాలే.. అద్భుతమైన కథలుగా రూపుదిద్దుకుంటాయి. అలాంటి గుండెను తట్టిలేపే జ్ఞాపకాలే.. ఈ పుస్తకం నిండా! వేసవి వెన్నెల రాత్రుళ్లు వాకిట్లో కూర్చోబెట్టి తల్లిదండ్రులు చెప్పే తమ చిన్ననాటి సంగతులు.. చందమామ కథల కన్నా బావుంటాయి. అలాంటి ముచ్చట్లే.. ఆ పిల్లల్ని సాహిత్యంవైపు నడిపిస్తాయి. రచయిత్రి అభినేత్రి వంగల.. ‘అమ్మ నాన్నలకు.. ప్రేమతో’లో పంచుకున్నది ఆ అనుభవాలనే! స్వార్థం, స్వప్రయోజనం కొంతవరకూ అవసరమే! కానీ, సంఘజీవిగా ఉన్న మనిషి..
తమ పక్కవారి పట్ల స్నేహబంధమూ, బాధ్యతగా మెలగాలని చెబుతుంది.. డా. భార్గవి రఘురాం కథ ‘స్నేహ బంధాలు’. ఇలా చెప్పుకొంటూ పోతే.. బాల్యంలో జరిగిన సంఘటనలు.. పాఠశాల మిత్రులతో ఆడిపాడిన రోజులు.. పెళ్లిళ్లూ – పేరంటాలు.. అత్తవారింట్లో అడుగుపెట్టినప్పుడు బెరుకుబెరుకుగా గడిపిన క్షణాలు.. ఆప్తులను కోల్పోయినప్పుడు పడ్డ బాధలు! ఇలా ప్రతి కథ వెనుకా.. ఎన్నో జ్ఞాపకాలు. మొత్తంగా 63 మంది రచయిత్రుల అనుభవాలు. మనసు తెర వెనుక దాగిన జ్ఞాపకాల దొంతరలు, దూదిపింజలాంటి మనసులో నెమరు వేసుకుంటూ రాసిన కథలు. ఈ కథలన్నీ.. చదివిన ప్రతి ఒక్కరినీ బాల్యంలోకి తీసుకెళ్తాయి.
సంపాదకురాలు : జ్యోతి వలబోజు
పేజీలు: 288, వెల: రూ.300
ప్రతులకు: 85588 99478 అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
పేజీలు: 102,
ధర: రూ. 150
ప్రచురణ: శ్రీ మణిరామా
పబ్లికేషన్స్, నిజామాబాద్
ప్రతులకు:
ఫోన్: 94400 37125
పేజీలు: 150,
ధర: రూ. 270
ప్రచురణ: కస్తూరి విజయం
ప్రతులకు:
ఫోన్: 94409 79882
పేజీలు: 96;
ధర: రూ. 85
ప్రచురణ: ముల్కి బుక్స్, హైదరాబాద్
ప్రతులకు:
ఫోన్: 94400 02659