సాహితీ ప్రపంచాన్ని చదవాలంటే ఆసక్తే కాదు సమయమూ ఉండాలి. సాహిత్యాభిలాష ఎంత ఉన్నా ఉండేది నూరేళ్ల జీవితమే. ఈ కొంతలో ఎంతోకొంత చదివే సాహిత్యం ఉత్తమమైనదై ఉండాలి. ఉత్తమ సాహిత్యం కోసం కొన్ని జాబితాలు తిరగేస్తూ ఉంటారు. ఈ జాబితాల్లోంచి కొన్ని ఆణిముత్యాలు జారిపోతాయి. అది పొరపాటుగా కాదు. నిర్ణేతల ప్రాధాన్యాలను బట్టి ఉత్తమ సాహిత్య జాబితాలో కొన్ని పుస్తకాలు చేరుతుంటాయి. కొన్ని జారుతుంటాయి. కాబట్టి కాలాన్ని నడిపించిన కొందరిని చదివి, అందరి రచనల్లోంచి ఏరిన ఆణిముత్యాలు చదువుకోవాలనే ఆసక్తి ఉన్నవారికి ‘సాహితీ మాన్యులు’ ఉపయుక్త గ్రంథం. వివిధ పత్రికల్లో ప్రచురితమైన సాహితీ వ్యాసాల సంకలనం ఇది.
గురజాడ మొదలుపెట్టిన సంస్కరణ నుంచి కారా మాస్టారు కథా ‘యజ్ఞం’ వరకు ఎన్నో సాహితీ విశేషాలను రచయిత పాఠకుల కళ్లకు కట్టారు. సాహితీ వేత్తల జీవితాలు, భావాలు, ఆదర్శాల నుంచి వాళ్లు సృజించిన సాహిత్య ప్రభావాన్ని ఈ పుస్తకంలో విపులంగా వివరించారు. అలాగే ఆయా రచయితల ఉత్తమ రచలన్లోని ఉత్తమోత్తమ గ్రంథాలను సంక్షిప్తంగా పరిచయం చేశారు. తప్పక చదవాల్సిన సాహిత్యాన్ని సమయాభావం వల్ల చదువులేని వారికి నిజంగా ఇది ఒక వరమనే చెప్పాలి. తాపీ ధర్మారావు పరిశోధన, కొడవటిగంటి శైలి, మల్లాది పలుకుబడి, ఆత్రేయ నాటకాలు, శ్రీరమణ వ్యంగ్యం, నండూరి అనువాదంతోపాటు పరభాషా రచయితల గురించీ చదువుకోవచ్చు. సాహిత్యంతో సంభాషణ కేవలం కల్పనా ప్రపంచంలో వివహరించడమే కాదు భాష, చరిత్ర, సంస్కృతి, సమకాలీన రాజకీయాలను కూడా ఈ పుస్తకం సృషించింది.
రచయిత: ఎంబీఎస్ ప్రసాద్
పేజీలు: 300
ధర: 180
-నాగవర్ధన్ రాయల
రచన : సాకం నాగరాజు
పేజీలు : 127;
ధర : రూ.100
ప్రచురణ : అభినవ ప్రచురణలు
ప్రతులకు : అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
ఫోన్ : 94403 31016
రచన : చింతా రాంబాబు
పేజీలు : 70;
ధర : రూ.120
ప్రచురణ : కార్తీక్-నిహాల్ ప్రచురణలు
ప్రతులకు : అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
ఫోన్ : 99481 78092