– వి. ధర్మదాసు, కోరుట్ల.
వృత్తులను బట్టి కులాలు వచ్చాయి. అలాగని వారివారి కులాలకు స్థలాలు ఉండాలి అనేది.. అశాస్త్రీయ విధానం. కుండలు చేసే వృత్తిగల వారికి ఇంటి ముందు అధికంగా స్థలం ఉండాలి. ఎందుకంటే.. తయారైన కుండలను భద్రంగా పెట్టుకోవాలి. వాటిని కాల్చే బట్టి కావాలి. మట్టి వేసుకోవడానికి స్థలం ఉండాలి. ఇదంతా వారికి ‘వర్కింగ్ ఏరియా’. అలాంటప్పుడు పడమర వీధి కలిగిన స్థలం తీసుకొని, పడమర దిక్కు ఖాళీ అధికంగా వదిలి.. పని కోసం ఏర్పాటు చేసుకుంటే, అది బెడిసి కొడుతుంది. కాబట్టి, ఆ వృత్తి వారికి తూర్పు లేదా ఉత్తరం స్థలం అవసరం అని శాస్త్రం చెబుతుంది. అంతే తప్ప.. ‘హెచ్చు – తగ్గులు ఉంటాయి. వారు గొప్ప.. మిగతావారు తక్కువ’ అనేది శాస్త్రంలో ఉండదు. వాస్తు పదజాలాన్ని అర్థం చేసుకోవాలి. మనిషి జన్మ లక్ష్యం వేరు. ఎవరు ఏ వృత్తిలో జీవించినా.. అది సరిగ్గా సాగి, వారివారి జీవనం గొప్పగా నిలవాలన్నదే శాస్త్రం ఉద్దేశం.
– బి. మోహన్‌కుమార్, చేర్యాల.
మీ స్థలం అంటే.. మీ బ్లాకు మంచిదే! మంచి రోడ్లు ఉన్నాయి. కానీ, మీరు చెప్పినట్టు దక్షిణంలో, పడమరలో అధికంగా ఖాళీ వదిలి, ఆ స్థలంలో ఇల్లు నిర్మించినప్పుడు.. ఆ ఇల్లు మీ మొత్తం స్థలంలో ఈశాన్యం భాగంలోకి వెళ్తుంది. అప్పుడు ఆ గృహం మీకు మీరే బరువు అయ్యేటట్లు చేస్తుంది. ఆర్థిక, ఆరోగ్య సమస్యలు వస్తాయి. కూర్చొని తినేవాళ్లు అధికంగా ఉంటారు. తల బరువు జీవితం అవుతుంది. మీరు దక్షిణం స్థలాన్ని, అలాగే పశ్చిమ స్థలాన్ని వదిలివేయండి. తక్షణం ఇంటిని సరైన విధంగా వేరేచేసి కాంపౌండు కట్టండి. దక్షిణ – పడమర స్థలాలు పక్కవాళ్లు కొంటానంటే అమ్మి వేయండి. లేదా ఉన్న ఇల్లు వదిలి మరో గృహాన్ని శాస్త్రబద్ధంగా కట్టుకోండి. అంతేకానీ, అలాగే ఉంటే.. చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వంశ అభివృద్ధిని మరవకండి.
– ఎస్. రమేశ్, చాడ.
ఇంటికి తూర్పులో, ఉత్తరంలో ఇంటి ఫ్లోరింగ్ ఎత్తులో ‘డెక్’ రావడం అనేది.. ఇంటి అవతలి ఆవరణను కలుషితం చేస్తుంది. డెక్ గజీబో, ఉప గదులు ఇవన్నీ కావాలి అంటే.. ఇంటికి అంటకుండా, ఇంటి కాంపౌండుకు అంటకుండా ఆగ్నేయం, వాయవ్యంలో వేసుకుంటే మంచిది. లేదా ఇంటి ముందు ఇంటి వెడల్పుతో సమానంగా ఆరు లేదా ఏడు అడుగుల వెడల్పుతో అరుగులు కట్టుకోవడం శ్రేష్ఠం. అది అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. ‘డెక్’ను చిన్నగా ఆరు లేదా ఎనిమిది అడుగులకు పరిమితం చేసి.. తూర్పు మధ్యలో, ఉత్తరం మధ్యలో వేయకూడదు. దక్షిణం – పడమర మధ్యలో నైరుతి ఎత్తును బట్టి వేసుకోవాలి.
– ఎన్. కిరణ్, భువనగిరి.
వాస్తవానికి పూజా స్థానం సరిగ్గా నిర్ణయిస్తే.. మిగతా విషయాలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. డూప్లెక్స్ ఇంటిలో పూజగది తూర్పులో లేదా ఉత్తరంలో వచ్చినప్పుడు.. పైభాగం హాల్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక డూప్లెక్స్ ఇంటిలో సీత్రూ.. అంటే, స్లాబ్ కటింగ్ స్థానంలో మనం కింది భాగంలో పూజగదిని జాగ్రత్తగా అమర్చినట్లయితే.. ఆ గదిపైన ఏ హాలూ, ఏ గదీ రాదు.
అలాగని హాలు కింద, పడకగది కింద పూజగది రావడం దోషం కాదు. పూజగదిలో పూజ పీఠంపైన తప్పకుండా ఒక ఆచ్ఛాదన ‘గోపురం’ రావాలి. అదే ఆ మూర్తులకు సరైన పైకప్పు. ‘గోపురం రాకుండా ఉండాలి. గోపురం రావడం తప్పు’ అనే ఆలోచన మంచిదికాదు. అలా.. పైన ఛత్రంతో దైవం ఉన్నప్పుడు హాలు గది వచ్చినా దోషం లేదు. టాయిలెట్స్ మాత్రం రాకూడదు.
-సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 98492 78143