– కె. బుచ్చయ్య, షాద్‌నగర్.
ఇంటి లోపల మెట్లకింద టాయిలెట్ రావాలి అంటే.. ముందే చక్కగా మెట్ల ల్యాండింగ్ కింద ఎత్తు పెంచి, మెట్ల నిర్మాణం చేయాలి. అప్పుడు పైన వచ్చే గది ఎత్తు ఎంత వస్తుందో కూడా అవగాహన ఉండాలి. మెట్ల ల్యాండింగ్ కింద కనీసం ఆరున్నర అడుగులు రావాల్సి ఉంటుంది. అంతేకానీ, మెట్ల కింద నాలుగు – ఐదు అడుగులు మాత్రమే ఎత్తు కలిగి ఉండే టాయిలెట్ వేయడం ఇబ్బంది అవుతుంది.
అలాగని కింది ఫ్లోరింగ్‌ను లోతు చేసి, గొయ్యి చేయవద్దు. ఇంటికి సమానంగా మెట్లకింద ఫ్లోరింగ్ ఉండాల్సిందే! వెంటిలేషన్ సరిగ్గా లేకుండా.. ఏదో పైప్ ఎగ్జాస్ట్ మీద ఆధారపడకుండా ఉండాలి. ఫ్రీ వెంటిలేషన్, గాలి – వెలుతురు సరిగ్గా వచ్చేలా మెట్ల ల్యాండింగ్ కింద ఇంటిలోపల టాయిలెట్ వేసుకుంటే.. అనారోగ్యాల సమస్య ఉండదు. ప్రతి అంశాన్నీ జాగ్రత్తగా ప్లాన్ చేయాలి. మనకు ఒక పరిశుభ్రమైన ఇల్లు కావాలి.
– బి. జితేందర్, యూసుఫ్‌గూడ.
పడమర రోడ్డు ఉన్నప్పుడు.. గ్రౌండ్లో ఆగ్నేయంలో స్టాఫ్ గదిని వేసుకోవచ్చు. తూర్పు రోడ్డు ఉంటే.. వాయవ్యంలో స్టాఫ్‌రూమ్ వేయండి. మిగతా భాగం పార్కింగ్ చేసుకోవచ్చు. ఈశాన్యంలో మాత్రం వేయకండి. ఇల్లు కూడా కట్టి కిందిభాగంలోనే కార్ పార్కింగ్, స్టాఫ్‌రూమ్ రావాలి అంటే ఇబ్బంది.
అప్పుడు ఇంటిని వాయవ్యంలో కట్ చేసి, పార్కింగ్ ఇచ్చాక.. తిరిగి ఇంటిని మరోదిక్కు అది ఆగ్నేయం అయినా.. దక్షిణం – పడమర అయినా నిర్మాణం కింద కట్‌చేసి, మళ్లా ఒక గదిని దొంగిలించవద్దు. అప్పుడు కింద ఉండే ఇల్లు అనేక మూలలు తెగి, గాయపడ్డ దేహంలా మారిపోతుంది. అంగ వైకల్యపు ఇంటిని తయారుచేసినట్టు అవుతుంది. వాయవ్యం లేదా ఆగ్నేయం మూల ఒక్కటే ఏదైనా కట్ చేయవచ్చు. రెండు కట్ చేయడం మంచిదికాదు.
– వి. కమల, సత్తుపల్లి.
టెర్రస్ మీద మెట్లు, లిఫ్ట్ కలిపి దక్షిణం నిర్మాణం చేస్తున్నారు. అప్పుడు ఉత్తరంలో ఖాళీ భాగం ఉంటుంది. మీ ఉద్దేశం.. ఆ స్థలంలో వాయవ్యంలో గది వేయాలని అనుకుంటున్నారు. వాయవ్యంలో నిర్మాణం జరుపుకోవచ్చు. కానీ, ఉన్న నిర్మాణానికి అంటకుండా కట్టుకోవాలి.
ఉత్తరం ఖాళీలో అటు బాల్కనీ గోడను, దక్షిణంలో గది గోడను తగలకుండా మనిషి వెళ్లేంత స్థలం వదిలి.. మీరు అనుకునే గది లేదా గజీబో వేసుకోండి. లేదా.. పైన ఉత్తరం భాగం మొత్తం కవర్ అయ్యేలా కూడా నిర్మాణం చేసుకోవచ్చు. అంతేకానీ, పైన ‘ఎల్’ ఆకారంలో ఉండేలా నిర్మాణం చేయకండి. ఆ నిర్మాణం పైకప్పును రేకులతో వేయాలనుకుంటే.. ఉత్తరం వాలు వచ్చేలా చూసుకోండి. అయితే, దక్షిణం ఎత్తుకన్నా ఎక్కువ ఎత్తు వేయకండి.
– కె. శ్రీనివాస్, రాయిగిరి.
నేడు ప్రతి ఇంటికీ పార్కింగ్ అనివార్యం అయ్యింది. అందుకోసం జాగ్రత్తగా ప్లాన్ చేయాలి. కింద మొత్తం స్థలం కార్లు, తదితర అవసరాల కోసం వదులుకుంటే బాగుంటుంది. పైనుంచి గృహం వస్తుంది. ఒక ఆఫీస్ గది కావాలి అంటే.. దక్షిణ – నైరుతిలో ఆఫీస్ పెట్టుకొని వాడుకోవచ్చు.
ఒక పోర్షన్ కావాలి అనుకుంటే.. దక్షిణ భాగం పోర్షన్ కట్టాలి. ఉత్తరం భాగం ఖాళీగా వదలాలి. అప్పుడు ఆ నిర్మాణం సవ్యంగా ఉంటుంది. పడమర మొత్తం ఖాళీ స్థలం వదిలి తూర్పు భాగంలో పోర్షన్ కట్టవద్దు. మీకు రోడ్డు పడమరలో ఉన్నప్పటికీ.. అంతే! స్థలం ఉన్న విధానాన్ని బట్టి ఎప్పుడైనా కింద నిర్మాణం దక్షిణ – పడమరల్లో రావాలి. పడమర వీధి కాబట్టి మీరు దక్షిణం కట్టుకోండి. తూర్పు – ఉత్తరం ఖాళీ వచ్చేలా చూడండి. అన్ని అవసరాలూ తీరుతాయి.
-సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 98492 78143