సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చు అనడానికి ఈ రచయిత్రి ఒక ఉదాహరణ. 40 అంతస్తుల ఈ కవితా కోటలో ఒకో అంతస్తు ఓ విలువైన జీవిత పాఠం. అందరి జీవితాల్లో దాగున్న కష్టాలు, కన్నీళ్లు, బడలిక నుంచి బయటపడేలా చేస్తాయి ఇందులోని రచనలు. ‘సొంతిల్లు’ అనేది ప్రతి ఒక్కరి జీవిత కల. అది సాకారమయ్యే తీరును వివరిస్తూ ‘ఒకొక ఇటుక గోడకు.. మా సొంతింటి కలల నీటిని పోసినం.. మా బాపు చెమట నీటిని పోసిండు’ అంటూ సాగిన ఈ కవిత్వం చదువుతుంటే తల్లిదండ్రుల రెక్కల కష్టం కండ్లముందు నిలుస్తుంది.
‘తనకు బాధొచ్చి కాస్తంత కన్నీటిని వదులుదామంటే ఈ సమాజం వాటిని కార్చకుండా కట్టడి చేస్తుంది’ అంటూ పురుషుల కన్నీళ్లను చూసి ఎగతాళి చేసే సమాజానికి చురకలంటించారు రచయిత్రి. కష్టాలమయమైన జీవిత కథలో తొలి ఉద్యోగ ప్రయత్నం ఓ మరుపురాని జ్ఞాపకం. వందల్లో ఉండే ఉద్యోగాల కోసం లక్షల మంది పోటీ పడే విధిలేని ప్రయత్నం.
దానికి తోడు పేదరికం వెంటాడుతుంటే… ఆ భావాలన్నీ ‘కాంపిటేటివ్ ఎగ్జాం’ వివరించింది. ఈ కవితలను మనకు అందించే ముందు ఆవిడ ఓ భాషకు లిపిని సృష్టించిందని అందరూ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం. పిట్టకొంచెం కూత ఘనంలాగా తాను ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లోనే అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ ఎరుకల భాషకు లిపిని సృష్టించింది. ఇది తన మొదటి పుస్తకమే అయినా తాను విషయాలను భద్రంగా మనకు అందించడంలో ఈ యువ రచయిత్రి వందశాతం న్యాయం చేసింది. వయసుతో తారతమ్యం లేకుండా సామాజిక బాధ్యత కలిగిన వారందరికి ఈ కవితలు అంకితమే.
రచయిత్రి: మామిడిపెల్లి ఇంద్రాణి
పేజీలు: 128, ధర: రూ.100
ప్రతులకు: విశాల సాహిత్య అకాడమీ, రామకృష్ణ నగర్, బాగ్ అంబర్ పేట, హైదరాబాద్
– శ్రావణి
రచన : డా. జి.వి. పూర్ణచందు
పేజీలు : 147;
ధర : రూ.200
ప్రచురణ : కృష్ణాజిల్లా రచయితల సంఘం
ప్రతులకు : అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
ఫోన్ : 94401 72642
రచన : వడిచర్ల సత్యం
పేజీలు : 306;
ధర : రూ.300
ప్రచురణ : గోల్కొండ సాహితీ కళా సమితి
ప్రతులకు : అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
ఫోన్ : 91210 01238