హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ): ప్రముఖ కార్టూనిస్ట్ శేఖర్ స్మారక అవార్డు ప్రదానోత్సవ సభను ఆదివారం ఉదయం 10.30 గంటలకు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించనున్నారు. శేఖర్ కుటుంబీకులు, మిత్రులు, ఫోరం ఫర్ పొలిటికల్ కార్టూనిస్ట్స్ శనివారం ప్రకటనలో వెల్లడించారు. సభకు ముఖ్యఅతిథిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హాజరై అవార్డును ప్రదానం చేయనున్నారు. మెమోరియల్ అవార్డును 2026 సంవత్సరానికి గాను కార్టూన్ విభాగంలో ఎం నారు, ఆర్టిస్ట్ విభాగంలో కూరెళ్ల శ్రీనివాస్‌కు అందివ్వనున్నారు.