కంటి నిండా నిద్ర లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి
Sleep | “కంటినిండా నిద్రపోయి ఎంతకాలమైందో? చీమ చిటుక్కుమన్నా మెలకువ వచ్చేస్తుంది. ఆ కలత నిద్రలోనూ పీడకలలే. డెస్క్‌టాప్ ముందు మత్తుగా జోగిన ప్రతిసారీ.. అద్దాల క్యాబిన్లోంచి పెద్దబాసు శూలాల్లాంటి చూపులొకటి. నన్ను కాస్త ప్రేమించమని ఆ నిద్రాదేవికి ఎవరైనా చెప్పండ్రా!” అని వాపోతుంటారు చాలామంది. నిజానికి నిద్రపోవడం ఓ ఆర్ట్.
తేడావస్తే మాత్రం హార్ట్ ఎటాకే!

నిద్రకు గంట ముందే సెల్‌ఫోన్ స్విచ్చాఫ్ చేయండి. నిద్రకు రెండు గంటల ముందు నుంచీ కాఫీ, టీలు బంద్.

నిద్రకు మూడు గంటల ముందే భోజనం చేసేయండి
.
సగానికి సగం మందికి నిద్రపట్టకపోవడానికి కారణం నాసిరకం దిండు, దుప్పటే. నాణ్యత విషయంలో రాజీపడకండి.

మీ మంచాన్ని మినీ ఆఫీస్‌గా మార్చుకోవద్దు. పడక ఉన్నది నిద్రకే.
గురక సమస్య కాదు. తీవ్ర హెచ్చరిక. వెంటనే శ్వాసకోశ వైద్యుడిని కలవండి. ప్రార్థన, ధ్యానం, యోగనిద్ర గాఢ నిద్రకు ఉపకరిస్తాయి. పీడకలలను నివారిస్తాయి.

నిద్రలేమి అనేది ఆందోళన, డిప్రెషన్, ఊబకాయం, మధుమేహం, హృద్రోగం తదితర సమస్యలకు దారితీస్తుంది. కంటినిండా నిద్ర ఉంటేనే, ఒంటినిండా ఆరోగ్యం.
మహిళలకే నిద్ర అవసరం ఎక్కువ. ఎందుకంటే, వాళ్ల మెదడు పురుషులతో పోలిస్తే మరింత కష్టపడుతుంది.

నిద్రలేమికి పోషక విలువల కొరత, విటమిన్ల లోపం ప్రధాన కారణాలు. వరుసగా కొన్ని వారాలపాటు నిద్రపట్టకపోతే ఏదో తీవ్ర సమస్య ఉన్నట్టే. డాక్టర్‌ను సంప్రదించండి. ఈ రాత్రికి ముందస్తు ‘గుడ్’నైట్!
Read More :
“రాత్రుళ్లు నిద్ర పట్టక ఇబ్బంది పడుతున్నారా.. ఒకసారి ఇలా చేసి చూడండి..”
ఏవైపు తిరిగి పడుకుంటే మంచిది?”
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
- Tags
- better sleep
- Health
- insomnia
- sleep
RELATED ARTICLES
తాజా వార్తలు
Karnataka HC | ప్రతి విషయాన్ని విచారించే అధికారం ఆ సంస్థకు లేదు.. కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
girl consumes cough syrup dies | జ్యూస్‌గా భావించి దగ్గు మందు అంతా తాగిన బాలిక.. నిద్రలోకి జారుకుని మృతి
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యపై చర్యలకు ప్రొఫెసర్లు, విద్యార్థుల డిమాండ్.. వీడియో
Kolkata’s Presidency University | వివేకానంద పోస్టర్‌కు అవమానం.. ఇద్దరు విద్యార్థినులను బహిష్కరించిన యూనివర్సిటీ
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

